రాజకీయాల్లో జరిగే అనూహ్యమైన పరిణామాలు.. ఒక్కొక్కసారి చిత్రంగా ఉంటాయి. కాంగ్రెస్ జాతీయ పార్టీ అయినా.. తనకు షెల్టర్ ఇచ్చిన పార్టీకి ఎప్పుడూ.. డ్యామేజీ చేసిన సందర్భాలు లేవు. కానీ.. బీజేపీ అలా కాదు.. ఒంటె సామెత మాదిరిగా.. తనకు అనను కూలంగా ఉన్న రాష్ట్రాల్లో ముందు వేలు పెడుతుంది.. తర్వాత.. మొత్తం ఆక్రమిస్తుంది. ఇలాంటి మనస్తత్వం ఉన్న పార్టీలతో జట్టుకలిపేందుకు ప్రాంతీయ పార్టీలు సాహసించడం లేదు.
కానీ, ఏపీలో చంద్రబాబు చోటు పెట్టారు. అయితే.. బీజేపీ గురించి ఆయనకు మాత్రం తెలియదా? అంటే.. తెలుసు. కానీ, చంద్రబాబు బీజేపీ అంటే ఇంకా వాజపేయి కాలంనాటిదనే భ్రమలో ఉన్నారనే అనిపిస్తోం ది. వచ్చే ఎన్నికలలో బీజేపీతో పొత్తు పెట్టుకున్న ఆయన ఏకంగా 5 ఎంపీ సీట్లను వదులుకు న్నారు. వీటిలో బీజేపీకి అవకాశం ఇచ్చారు. పొత్తులో భాగంగా ఇది బాగానే ఉన్నా.. ప్రస్తుతానికి వైసీపీ సర్కారును గద్దెదించి.. చంద్రబాబు అధికారంలోకి వచ్చేందుకు ఇది తాత్కాలిక ప్రయోజనం అందించనుంది.
అయితే.. దీర్ఘకాలిక ప్రయోజనాలను.. లక్ష్యాలను కనుక చూసుకుంటే.. ప్రస్తుతం బీజేపీ ఉన్నది గుజరాతీల చేతుల్లో. సో.. వారు కనుక ఒక్కసారి సీటు దక్కించుకున్నారంటే.. మర్రి చెట్టు మాదిరిగా.. మిగిలిన పార్టీలను లాగేస్తారనడానికి అనేక రాష్ట్రాలు ఉదాహరణ. ఇది అంతిమంగా.. ఏ పార్టీకైనా ప్రాణ సంకటమే. అంటే.. చంద్రబాబు ఇప్పుడు తాత్కాలిక ప్రయోజనం చేసుకుంటూ.. బీజేపీకి సీట్లు వదులుకుంటున్నా.. ఆ పార్టీకి మాత్రం శాశ్వత ప్రయోజనాన్ని అందిస్తున్నారనే వాదన వినిపిస్తోంది.
పూర్వం మాదిరిగా.. అయితే, బీజేపీ ఇప్పుడు లేదు. పొత్తు పెట్టుకునేప్పుడే.. చాలా షరతులు పెట్టారని తెలిసింది. కాబటి.. టీడీపీ అంతిమ ప్రయోజనాలను ఈ ప్రాతిపదికలో ప్రధానంగా దృష్టిలో పెట్టుకోవల్సి ఉంటుంది. ఈ విషయంలో చిన్న తేడా వచ్చినా.. జనసేనకు పోయేదేమీ లేదు. టీడీపీకే నష్టం ఎక్కువగా ఉంటుందని అంటున్నారు పరిశీలకులు.
అసెంబ్లీ సీట్ల లెక్కలు వేరు. కానీ, పార్లమెంటు స్థానం అంటే.. ఒక్కొక్క దాని పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. కాబట్టి.. ఉత్తరాదిలో బీజేపీ వేసిన ప్లాన్ కూడా ఇదే. ఒక్క ఎంపీ సీటు తీసుకుని.. తర్వాత వట వృక్షంగా ఆక్రమించింది. ఇలాంటి పరిస్థితి ఏపీలోనూ భవిష్యత్తులో ఉండదని చెప్పడానికి ఎలాంటి రుజువులు లేక పోవడం గమనార్హం.
This post was last modified on March 14, 2024 5:54 pm
రేపు ఎంఎస్ సుబ్బులక్ష్మి బయోపిక్ ఓపెనింగ్ జరగనుంది. అల్లు అరవింద్, రాక్ లైన్ వెంకటేష్, బన్నీ వాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న…
నిన్నటి తమిళ కమెడియన్ ఇప్పటి హీరో సూరి తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు తిరుగుతూ ఆశ్చర్యానికి గురవుతున్నాడు. కారణం ప్రతి చోటా…
గత నెల మకుటం అనే సినిమా విడుదలయ్యిందనే సంగతి హార్డ్ కోర్ మూవీ ఫాలోయర్స్ కి తప్ప సామాన్య ప్రేక్షకులకు…
ఏపీ మాజీ డిప్యూటీ సీఎం, టీడీపీ నేత ఆళ్ల నాని (57) కన్నుమూశారు. నానికి హఠాత్తుగా గుండెపోటు రావడంతో ఆయనను…
నిర్మాత నాగవంశీ ఈ మధ్య మంచి జోష్ లో ఉన్న విషయం తెలిసిందే. అఖిల్ సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ లెనిన్…
మొన్న గురువారం విడుదలైన సినిమాల్లో మారెమ్మ కూడా ఉంది. మాములుగా అయితే స్టార్ కాస్టింగ్ లేని ఇలాంటి మూవీని జనం…