రాజకీయాలంటేనే అవకాశ వాదం. అవసరాల సమాహారం. ఏ పార్టీ కూడా ఉత్తినే మరో పార్టీతో చేతులు కలపదు. సొంత లాభం కొంత మానుకోవడానికి ఇదే గురజాడ వారి రోజులు కానేకావు. ఇవన్నీ.. ఎవరి స్వార్థం వారు చూసుకునే పక్కా పొలిటికల్ డేస్. ఈ విషయం తెలిసి.. తాను కూడా ఇదే బాటలో నడిచిన షర్మిల.. పొరుగు పార్టీలపై విమర్శలు గుప్పించడం విచిత్రంగా ఉందని అంటున్నారు పరిశీలకులు. తెలంగాణలో పార్టీ పెట్టుకున్న షర్మిల గురించి అందరికీ తెలిసింది.
అక్కడ పార్టీ పుంజుకునే ఓపికలేక.. కాంగ్రెస్‌లో విలీనం చేసి.. నమ్ముకున్న నాయకులను మూసీనదిలో ముంచేసి, ఏపీకి తరలి వచ్చి.. కాంగ్రెస్ పగ్గాలు చేపట్టారు. ఈ విషయం ఆమె గుప్పిట మూసుకున్నంత మాత్రాన తెలుగు ప్రజలు కళ్లు మూసుకోలేదు. తన స్వార్థం కోసమే కాంగ్రెస్‌లోకి వచ్చింది వాస్తవం. ఇది రాజకీయంగా తప్పుకాదు. అయితే.. ఇంత చేసి.. ఇప్పుడు ఏవో పొరుగు పార్టీలు కొంపలు ముంచేస్తున్నాయని గగ్గోలు పెడుతున్నారు షర్మిలక్క!!
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా, రాష్ట్రానికి వెన్నుపోటు పొడిచిన బీజేపీతో పొత్తు ఎలా పెట్టుకున్నారో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రజలకు సమాధానం చెప్పాలని అక్క నిలదీశారు. మరి పదేళ్ల పాటు ఇదే ఏపీ కష్టాల్లో ఉంటే.. ఎందుకు ఇటు వైపు చూడలేదు. తెలంగాణ మెట్టినిల్లు.. అంటూ అక్కడే ఎందుకున్నారని నిలదీస్తే..షర్మిల ఏం చెబుతారు?
“2.30 లక్షల ఉద్యోగాల భర్తీ అనే హామీతో జగన్ అన్న అధికారంలోకి వచ్చారు. మెగా డీఎస్సీ అని చెప్పి దగా డీఎస్సీ విడుదల చేశారు. బీజేపీకి, వైసీపీకి అసలు తేడా ఏముంది?. ఏపీలో బీజేపీకి బీ పార్టీగా వైసీపీ ఉంది. బీజేపీకి వారసులని జగన్ నిరూపించుకున్నారు. ‘సిద్దం’ సభలతో కోట్ల రూపాయల ప్రజా ధనం వృథా చేస్తున్నారు. జనాలను పోగేసుకుని మళ్లీ మాయ చేస్తున్నారు. బీజేపీతో అంటకాగే పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్పాలి. యువకుల కోసం కాంగ్రెస్ నేషనల్ మ్యానిఫెస్టో విడుదల చేసింది. ‘భర్తీ భరోసా’ పేరుతో యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. రాహుల్ గాంధీ గారు యువత, నిరుద్యోగ సమస్య లపై స్పందించి ఈ మ్యానిఫెస్టో రూపొందించారు” అని షర్మిల తనదైన గళం వినిపించారు. ఎంత చేసినా.. పార్టీ పుంజుకోదని.. క్షేత్రస్థాయిలో కార్యకర్తలను పెంచుకోవాలనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
This post was last modified on March 11, 2024 5:13 pm
ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…
విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…
వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…
ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…
ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…
వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి సంచలన ఆరోపణలు చేస్తున్న సునీల్ యాదవ్ వ్యవహారం…