గుంటూరు జిల్లాలోని ఉండవల్లిలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో పొత్తుల చర్చలు ముమ్మరంగా సాగుతున్నాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్, బీజేపీ అగ్రనేతలు, ఏపీ వ్యవహారాల ఇంచార్జ్‌లుగా తాత్కాలిక బాధ్యతలు చేపట్టిన కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ బృందం కూడా చంద్రబాబు నివాసానికి వెళ్లింది. నేటి భేటీతో బీజేపీ అభ్యర్థుల జాబితాపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. గత రెండు రోజులుగా అటు పవన్‌తో పాటు తమ పార్టీ నేతలతో షకావత్ భేటీ అవుతున్నారు.
చంద్రబాబు నివాసంలో తాజాగా జరుగుతున్న భేటీ మరింత కీలకంగా మారింది. నేటితో లెక్కలు తేలిపోనున్నాయి. అలాగే ఎవరికి ఎన్ని సీట్లు? ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలనే విషయమై కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. పార్లమెంటు స్థానాలకు సంబంధించి బీజేపీ ఒంటరిగానే 6 స్తానాలు కోరుతుండగా.. జన సేన 3 స్థానాలు కోరుతోంది. మరోవైపు, అసెంబ్లీ సీట్లకు సంబంధించి 10 సీట్లు కోరుతున్నట్టు తెలుస్తోంది. ఇక, జనసేనకు ఇప్పటికే 24 స్థానాలు కేటాయించారు.
మొత్తంగా ఆయా పార్టీల బలాబలాలు, సెగ్మెంట్ల వారిగా ప్రాధాన్యం ఇస్తుండడం గమనార్హం. బీజేపీకి ఉన్న బలం.. స్థానిక నేతల హవా.. వంటివాటిపైనా అగ్రనేతలు చర్చలు జరుపుతున్నారు. అయితే.. ఈ భేటీకి ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి రాకపోవడం గమనార్హం. అంతా కూడా.. గజేంద్ర షెకావత్ చేతుల మీదుగానే కార్యక్రమాన్ని నడిపిస్తున్నారు. దీనిని బట్టి ఏపీ రాజకీయలలో పురందేశ్వరి కీలకమైన సమయంలో వ్యూహాత్మకంగా తప్పుకున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
This post was last modified on March 11, 2024 5:07 pm
మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…
తమిళ దిగ్గజ నటుడు, తమిళగ వెట్రి కగళం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ వ్యవహారం.. మరింత ముదురుతోంది. గత ఏడాది సెప్టెంబరు 27న…
రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత గ్రామం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.…
గత కొన్నేళ్లుగా మినిమమ్ హిట్ లేకుండా అభిమానులను హర్ట్ చేస్తున్న మాస్ మహారాజా రవితేజ ఈసారి పూర్తిగా రూటు మార్చి…
నిన్న మొన్నటి వరకు కారాలు మిరియాలు నూరుకున్న నాయకులు..ఇప్పుడు ఎంచక్కా చేతులు కలిపారు. సంక్రాంతి పుణ్యమా అని.. రాష్ట్రంలోని ఉభయగోదావరి…