టీడీపీ యువ నేత బొజ్జల సుధీర్‌రెడ్డి. వచ్చే ఎన్నికల్లో శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం అందుకోవాలని భావిస్తున్నారు. నియోజకవర్గంలోనూ పెద్ద ఎత్తున ఆయన తిరుగుతున్నారు. ప్రజలకు చేరువ అవుతున్నారు. వారి సమస్యలు వింటున్నారు. బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాలను కూడా అమలు చేస్తున్నారు. యువతను కూడా కూడగడుతున్నారు. ఏదో ఒక కార్యక్రమం పెట్టుకుని ప్రజలకు చేరువ అవుతున్నారు. అయితే.. ఇప్పటి వరకు బొజ్జల సుధీర్‌రెడ్డికి టికెట్ కన్ఫర్మ్ చేయలేదు.
20 రోజుల కిందటే.. టీడీపీ ఫస్ట్ జాబితా ఇచ్చింది. దీనిలో 94 మంది అభ్యర్థులను ఖరారు చేశారు. అయి తే.. ఈ జాబితాలో శ్రీకాళహస్తి నియోజకవర్గం లేకపోవడం గమనార్హం. దీంతో సుధీర్ దాదాపు డీలా పడిపోయాడని అంటున్నారు పరిశీలకులు. గత ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన సుధీర్‌కు.. ఇప్పుడు సింపతీ కూడా కలిసి వస్తోంది. అంతేకాదు.. వైసీపీ నేత, ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డిపై వున్న వ్యతిరేకత మేలు చేస్తుందని తలపోస్తున్నారు.
వచ్చే ఎన్నికల్లో తన గెలుపు ఖాయమనికూడా సుధీర్ లెక్కలు వేసుకున్నారు. అయితే.. పార్టీ అధిష్టానం నుంచి మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి సంకేతాలు రాలేదు. మరి వచ్చే ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇస్తుందా? లేదా? అనేది చూడాలి. పార్టీలో ఇదే టికెట్‌పై ఆసక్తికర చర్చ సాగుతోంది. చంద్రబాబు చేయించిన సర్వేలో సుధీర్ కన్నా బలమైన నాయకుడు అవసరం ఉన్నట్టు తేలిందని చెబుతున్నారు. అందుకే ఈ టికెట్ విషయంలో ఒకింత ఆలోచనలో పడ్డారని అంటున్నారు.
ప్రస్తుతం ఇంకా పరిశీలన జరుగుతోందని.. సుధీర్ గ్రాఫ్ మెరుగు పడితే.. ఆయనకే టికెట్ దక్కుతుందని పార్టీలో అంతర్గత చర్చ సాగుతోంది. అయితే.. సుధీర్ మాత్రం తనకే టికెట్ దక్కుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదిలావుంటే.. బీజేపీ ఇప్పుడు టీడీపీతో జట్టు కట్టిన నేపథ్యంలో ఆ పార్టీ ఈ టికెట్‌ను కోరుకునే అవకాశం ఉందని.. ఇటువైపు కమలనాథుల్లో చర్చ సాగుతోంది. తాము సునాయయాసంగా నెగ్గుతామని వారు చెబుతున్నారు. మొత్తంగా ఈ పరిణామాలను గమనిస్తే.. శ్రీకాళహస్తి టికెట్‌పై మరికొంత కాలం సస్పెన్స్ కొనసాగే అవకాశం కనిపిస్తోంది.
This post was last modified on March 10, 2024 4:32 pm
వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుల కోసం దావోస్ వెళ్లిన కూటమి సర్కారు సింగిల్ పైసా పెట్టుబడులు కూడా రాబట్టలేదని విపక్షం…
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను సీఎంగా చూడాలనుకుంటున్నామని జనసేన నేత కిరణ్ రాయల్ తో పాటు పలువురు నేతలు,…
వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పులపాలైందని తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. పథకాల కోసం ప్రభుత్వ నిధులను…
భారత క్రికెట్ అభిమానుల ఆశలపై మరోసారి మబ్బులు కమ్ముకున్నాయి. త్వరలో పాకిస్థాన్, దుబాయ్ వేదికలుగా జరగబోయే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి…
ప్రజా గాయకుడు గద్దర్ కు పద్మ అవార్డుల వ్యవహారంలో ఘాటు వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్… బీజేపీ,…
వైసీపీ కీలక నేత వేణుంబాక విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానంటూ ప్రకటించి కలకలం రేపారు కదా. ప్రకటించినట్లుగానే ఆయన తన…