Political News

ఇంతియాజ్ పోటీ.. తెర‌వెనుక ఇంత డ్రామా జ‌రిగిందా!

క‌ర్నూలు అసెంబ్లీ స్థానం నుంచి వైసీపీ అభ్య‌ర్థిగా ఇటీవ‌ల త‌న ఉద్యోగానికి రాజీనామా చేసిన ఐఏఎస్ అదికారి, మైనారిటీ వ్య‌క్తి ఇంతియాజ్‌కు సీఎం జ‌గ‌న్ అవ‌కాశం ఇచ్చారు. అయితే.. ఇలా ఆయ‌న‌ను అనూహ్యంగా తెర‌మీదికి తీసుకురావ‌డం వెనుక చాలా జ‌రిగింద‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. అంత తేలిక‌గా.. ఇంతియాజ్కు టికెట్ ఇవ్వ‌లేద‌ని.. ఇంటి పోరు కార‌ణంగానే ఆయ‌న‌ను తెర‌మీదికి తెచ్చార‌ని పార్టీలో చ‌ర్చ సాగుతుండ‌డం గ‌మ‌నార్హం.

ఏం జ‌రిగింది?
టికెట్ నాకు రాకున్నా ఫర్వాలేదు నా ప్రత్యర్ధికి రాకుడదంటూ కర్నూలు వైసీపీ నేతలు ఎత్తులకు పైఎత్తులు వేశారు. టికెట్ దక్కించుకునేందుకు కర్నూలు సిటీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఈ ప్రయత్నంలో ఇద్దరి నేతలకు సీఎం జగన్ చెక్ పెట్టారు. ఇద్దరినీ కాదని మూడో వ్యక్తికి టికెట్ ఎందుకు కేటాయించారు. కర్నూలు ఎమ్మెల్యేగా ప్రస్తుతం హఫీజ్ ఖాన్ కొనసాగుతున్నారు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ పై హఫీజ్ ఖాన్ గెలుపొందారు.

రాష్ట్రంలో వైసిపి అధికారంలోకి రావడంతో కర్నూలు హెడ్ క్వార్టర్‌లో ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ చురుకుగా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటూ తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్నారు. ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో వైసిపి అధినేత టికెట్లు మార్పులు చేర్పులు చేస్తూ ఉండడం తెలిసిందే. కర్నూలు నియోజకవర్గంలో ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉండటం, మొదట్నుంచి పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడం జగన్‌కి నమ్మిన బంటులా ఉన్న తనను కాదని టికెట్ వేరే వారికి కేటాయించే పరిస్థితి లేదనుకన్నారు.

వచ్చే ఎన్నికలకు అన్నీ సిద్ధం కూడా చేసుకున్నారు. మరోవైపు కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎస్.వి మోహన్ రెడ్డి దంపతులు ఈసారి టికెట్ తమకే కేటాయించాలని జగన్ ముందు పట్టు పట్టారు. 2019 ఎన్నికల్లో మీరు చెప్పారని హఫీజ్ ఖాన్‌కు సపోర్ట్ చేశామని ఈసారి తమకు టికెట్ కేటాయించి న్యాయం చేయాలని పంచాయితీ పెట్టారు. అంతేకాదు, కర్నూలులో ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్‌కు తీవ్ర వ్యతిరేకత ఉందని ఈసారి టికెట్ కేటాయిస్తే కచ్చితంగా వైసీపీ ఓడిపోతుం దని పేర్కొన్నారు.

ఎమ్మెల్యే పై వ్యతిరేకతను చూపిస్తూ హఫీజ్ ఖాన్ బాధితులను సైతం ఏకం చేసి టికెట్ రాకుండా ప్రయతించారు. ఈ ఇద్దరి నేతలతో కర్నూలు టికెట్ వైసిపి అధిష్టానానికి తలనొప్పిగా మారింది. దీంతో చేసేది లేక అధిష్టానం ఇద్దరినీ పక్కనపెట్టి మైనార్టీ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ఇంతియాజ్‌ను వైసిపి కర్నూలు అభ్యర్థిగా ప్రకటించారు. ఇంతియాజ్ ను గెలిపించుకొని రావాల్సిన బాధ్యతలు కూడా ప్రస్తుత ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, మాజీ ఎమ్మెల్యే ఎస్పీ మోహన్ రెడ్డికి అప్పగించారు. ఇదీ సంగ‌తి!

This post was last modified on March 10, 2024 4:28 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

లేడీ డాన్లకు వార్నింగ్ ఇచ్చిన సీఎం

ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…

54 minutes ago

మాయమైన నందమూరి హీరో రీ ఎంట్రీ

ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…

2 hours ago

దృశ్యం పాయింటుతో సిరీస్ తీశారు

శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…

2 hours ago

శివన్న డెడికేషనే వేరు

తెలంగాణ‌కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…

3 hours ago

పర్ఫెక్షన్లో రాక్షసుడు జక్కన్న

బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…

4 hours ago

కర్ణాటకలో తెలుగు కనపడకూడదా?

కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…

6 hours ago