బీజేపీతో పొత్తు దాదాపు ఒక కొలిక్కి వచ్చేసింది. ఇక అధికారిక ప్రకటనే తరువాయి. సీట్ల పంపకాల వ్యవహారంపైనే చిక్కు ముడి ఏర్పడడంతో గత మూడు రోజులుగాటీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌లు ఢిల్లీలో ఉండి.. పొత్తులపై పలు దఫాలుగా చర్చలు జరిపారు. ఇది ఎలా ఉన్నా.. బీజేపీతో కనుక పొత్తు కన్ఫర్మ్ అయితే.. చంద్రబాబు కానీ, పవన్ కానీ.. ఫస్ట్ చేసే డిమాండ్లు ఏమిటి? అనేది ఆసక్తిగా మారింది. ఎన్నికలు సజావుగా సాగడం కోసం, తమకు రాజకీయంగా ఎన్నికల సమయంలో ఇబ్బందులు ఉండకూడదనే ఉద్దేశం ఈ పొత్తుల వెనుక కీలకంగా ఉన్నాయి.
ఈ నేపథ్యంలో చంద్రబాబు.. పవన్‌లు తొలి డిమాండ్ ఏం చేస్తారన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. గత కొన్నాళ్లుగా ఇరు పార్టీల అనుచరులు, కార్యకర్తలపై దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. దీనిపై అనేక సందర్భాల్లో ఇరు పార్టీల నాయకులుకూడా డీజీపీకి లేఖలు సంధించారు. అయినప్పటికీ.. సానుకూల నిర్ణయం మాత్రం రాలేదు. దీంతో మానసికంగా.. కూడా టీడీపీ శ్రేణులు ఇబ్బంది పడుతున్నారు. రేపు ఎన్నికల సమయానికి వీరిని అసలు బయటకు రానిచ్చే పరిస్థితి కూడా ఉండదు. ఈ నేపథ్యంలో ఫస్ట్ డిమాండ్‌గా డీజీపీ మార్పును కోరుకునే అవకాశం ఉంది.
గత 2019 ఎన్నికల్లో ప్రతిపక్షం వైసీపీ కూడా ఇలానే చేసింది. అప్పటి డీజీపీని మార్చేసేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చింది. దీంతో నోటిఫికేషన్‌కు 24 గంటల ముందు డీజీపీని మార్చారు. తర్వాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మార్పుపైనా చంద్రబాబు, పవన్‌లు పట్టుబట్టే అవకాశం ఉంది. రెవెన్యూ యంత్రాంగం ఎన్నికల సమయంలో కీలకంగా ఉండడం.. ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి సీఎం జగన్‌కు అనుకూలంగా ఉన్నారని ప్రతిపక్షాలు విశ్వసిస్తున్న దరిమిలా.. ఆయన సీఎస్‌గా ఉంటే.. ఎన్నికలు సజావుగా సాగే అవకాశం లేదని చంద్రబాబు తలపోస్తున్నారు.
ఈ నేపథ్యంలో రెండో డిమాండ్‌గా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మార్పు ఉండనుందని తెలుస్తోంది. కేంద్రం తలుచుకుంటే.. ఈ మార్పులు పెద్ద కష్టం కాదు. అసలు వాస్తవానికి టీడీపీ-జనసేనల వ్యూహం కూడా ఇదే. ఇక. మూడో డిమాండ్‌గా .. వలంటీర్లను అసలు ఎన్నికలకు సంబంధించి ఎలాంటి విధులూ అప్పగించకుండా అత్యంత దూరంగా ఉంచడం. దీనిపై ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘానికి చంద్రబాబు రెండు దఫాలుగా మెమొరాండం ఇచ్చారు. అయినప్పటికీ.. పెద్దగాఫలితం కనిపించలేదు. ఇప్పుడుం కేంద్రంతో ఈ క్రతువును పూర్తి చేయడం.. మూడో డిమాండ్‌గా పార్టీ నేతల మధ్య చర్చసాగుతోంది.
This post was last modified on March 9, 2024 8:54 pm
వైసీపీ కీలక నేత, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి ఓ రేంజిలో న్యాయ పోరాటం చేస్తున్నారు. తిరుపతి…
వైసీపీ అధినేత జగన్ వ్యవహార శైలి కేవలం ప్రధాన ప్రతిపక్షం కోసమే ఆరాటపడుతున్నట్టు కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం ఆయనకు…
ఏపీలో రిలీజ్ సినిమాల ప్రదర్శనలపై కూటమి సర్కారు సరికొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇప్పటిదాకా రిలీజ్ అయ్యే దాదాపుగా అన్ని…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏది చేసినా చాలా వెరైటీగా ఉంటుంది. ఇతర రాజకీయ నాయకులతో…
https://www.youtube.com/watch?v=V0ARlFc_ndE సంక్రాంతి పందెం కోళ్ళలో మొదటిది గేమ్ ఛేంజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. తుది తీర్పు ఏంటనేది తేలడానికి ఇంకొంచెం…
బ్రాండ్ ఏపీ ప్రారంభమైందని సీఎం చంద్రబాబు తెలిపారు. వైసీపీ విధ్వంసంతో అతలాకుతలమైన రాష్ట్రాన్ని అన్ని విధాలా బాగు చేస్తున్నామని చెప్పారు.…