Political News

పొత్తుల‌పై చంద్ర‌బాబు ఫ‌స్ట్ రియాక్ష‌న్‌.. ఏమ‌న్నారంటే!

బీజేపీతో టీడీపీ-జ‌న‌సేన మిత్ర‌ప‌క్షం పొత్తులు ఖ‌రారైన త‌ర్వాత‌.. చంద్ర‌బాబు ఫ‌స్ట్ టైం రియాక్ట్ అయ్యారు. ఏపీలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో రాష్ట్రానికి కేంద్రం సహకారం అవసరం అని, ఆర్థిక విధ్వంసం నుంచి కోలుకోవాలంటే కేంద్రంతో కలిసి ఉండాలని చంద్రబాబు అన్నారు. బీజేపీతో పొత్తుపై క్లారిటీ రావడం, సీట్ల సర్దుబాటుపై అవగాహన కుదరడం సంతోషంగా ఉంది. బీజేపీ, జనసేన, టీడీపీ పార్టీలు కూటమిగా ఏపీ ఎన్నికలకు వెళ్తున్నాయని చంద్రబాబు అన్నారు. వచ్చే ఎన్నికల్లో పొత్తు కుదిరిన తరువాత శనివారం ఢిల్లీ నుంచి పార్టీ ముఖ్యనేతలతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

జగన్ రాష్ట్రాన్ని దివాళా తీయించారని, ఆర్థిక లోటును భర్తీ చేసుకోవడానికి కేంద్రం సహకారం అవసరమని నేతలకు చంద్రబాబు తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని బీజేపీతో పొత్తు పెట్టుకున్నట్లు స్పష్టం చేశారు. పొత్తులో భాగంగా కొందరికి సీట్లు రాకపోతే నిరుత్సాహపడొద్దని, పొత్తు అవసరాన్ని నేతలకు వివరించాలని పార్టీ ముఖ్య నేతలకు దిశా నిర్దేశం చేశారు. సీట్ల సర్దుబాటుపై స్పష్టత వచ్చిందని.. త్వరలోనే మరోసారి భేటీ అయ్యాక పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.

టీడీపీ, జనసేన ఈనెల 17న చిలకలూరిపేటలో ఉమ్మడి బహిరంగ సభ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది. తాజాగా బీజేపీతో పొత్తు కుదరడంతో మూడు పార్టీలు కలిసి ఈ సభను నిర్వహించనున్నాయి. ఈ సభకు ప్రధాని మోడీ హాజరు కానున్నారని ప్రచారం జరుగుతోంది. ఒక వేళ 17న ప్రధాని మోడీ బిజీ షెడ్యూల్ ఉంటే, 18కి బహిరంగ సభ వాయిదా వేస్తారని వినిపిస్తోంది. బీజేపీతో పొత్తు పెట్టుకోవడం, మరోసారి ఎన్డీఏలోకి టీడీపీ చేరిన తరువాత నిర్వహిస్తున్న సభ కావడంతో భారీగా ఏర్పాట్లు చేయాలని పార్టీ శ్రేణులకు చంద్రబాబు సూచించారు.

సుదీర్ఘ చ‌ర్చ‌లు

బీజేపీతో పొత్తు వ్య‌వ‌హారంపై చంద్ర‌బాబు, ప‌వ‌న్‌లు సుదీర్ఘంగా క‌మ‌ల నాథుల‌తో చ‌ర్చ‌లు జ‌రిపారు. గ‌తంలో బీజేపీనే టీడీపీని ఆహ్వానించ‌గా.. తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో ఈ రెండు పార్టీలు బీజేపీ కోసం వేచి చూశాయి. అంతేకాదు.. బీజేపీ అగ్ర‌నేత అమిత్ షా బిజీ షెడ్యూల్ కార‌ణంగా కూడా ఈ పొత్తులపై చ‌ర్చ‌లు ఆల‌స్య‌మ‌య్యాయ‌ని తెలుస్తోంది. అయితే.. ఇంత ఓపిక‌గా.. చంద్ర‌బాబు పొత్తు పెట్టుకోవ‌డం ఇదే తొలిసారి అని ప‌రిశీల‌కులు చెబుతున్నారు.

This post was last modified on March 9, 2024 8:55 pm

Share

Recent Posts

అమరావతిలో 300 కోట్లతో కేటీఆర్ 5 స్టార్ హోటల్?

ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…

3 hours ago

ఆదర్శం వెనుకడుగు వేయడం అవసరమే

ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…

4 hours ago

స‌ల్మాన్ సినిమాకు ఎట్ట‌కేల‌కు మోక్షం?

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్ల‌యిపోయింది. అస‌లే ఫ్లాపుల్లో ఉన్న అత‌డికి…

4 hours ago

జ్ఞానేష్ పై కేసులు తవ్వుతున్న కాంగ్రెస్

భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…

4 hours ago

55 శాతం తెలంగాణ యువతకు జుట్టు సమస్యలు

యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…

5 hours ago

సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తి!

ఐటీ రంగానికి కేంద్రంగా మారిన తెలంగాణ‌లోని సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తిని నిర్మిస్తున్నామ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో…

6 hours ago