వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయకుడు, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిపై నెటిజన్ల ట్రోల్స్ అదిరిపోతున్నాయి. ఆన్ దిరికార్డ్, ఆఫ్ దిరికార్డు గా వైసీపీ నాయకులు కూడా ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. తాజగా కొడాలి నాని.. సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. రానున్న ఎన్నికలే తనకి చివరివి అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలను కొడాలి నాని చేశారు.
“నాకు ఇప్పుడు 53 ఏళ్లు. వచ్చే ఎన్నికల్లో గెలిస్తే 58 ఏళ్ల వరకు పదవిలో ఉంటానన్నారు. 58 ఏళ్ల తర్వాత రాజకీయాలు చేయలేం. అందుకే 2029 ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నా. నాకు ఇద్దరు కుమార్తెలకు. రాజకీయాల పట్ల ఆసక్తి లేదు. తన తమ్ముడి కుమారుడికి ఆసక్తి ఉంటే వస్తాడు. రానున్న ఎన్నికల్లో వైసీపీ విజయం సాధిస్తే నియోజకవర్గం లో చేయాల్సిన అభివృద్ధి పనులుపైనే దృష్టి సారిస్తా” అని నాని అన్నారు. అయితే.. ఆయన ఏ ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేశారో తెలియదు కానీ.. ప్రతిపక్షాలకు మాత్రం ఆయుధాలు అందించారని వైసీపీ నాయకులు పెదవి విరుస్తున్నారు.
ఇక, నెటిజన్లు కూడా ట్రోల్స్ చేస్తున్నారు. కొడాలి పని అయిపోయింది. ఆయన తన ఓటమిని ముందే ఒప్పేసుకున్నారు. అనే కామెంట్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇక, గుడివాడలో ఇప్పటి వరకు అప్రతిహతంగా గెలిచినా.. ఇంకా అభివృద్ధి చేయాల్సి ఉందన్న వ్యాఖ్యలపై స్థానికులు కూడా ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పటికి నాలుగు సార్లుగా కొడాలి విజయం దక్కించుకున్నారు. కానీ, ఆయన చెబుతున్న అభివృద్ధి ఇంకా చేయకపోవడం ఏంటని.. ఇక్కడి వారు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు.. టీడీపీ దూకుడుతో “సెంటిమెంటు అస్త్రాలు” ప్రయోగిస్తున్నారంటూ.. ప్రతిపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.
తాజాగా కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. ఇప్పటివరకు నాలుగు సార్లు గెలుస్తూ వచ్చిన కొడాలి నాని.. తాజాగా ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఆయన అభిమానులతో పాటు వైసిపి శ్రేణులను కొంత ఆందోళనకు గురి చేస్తున్నాయి. టిడిపి నేతలు మాత్రం ఓటమి భయంతోనే ఈ తరహా వ్యాఖ్యలు కొడాలి నాని చేస్తున్నాడంటూ విమర్శలు గుర్తిస్తున్నారు. వైసీపీలో ఫైర్ బ్రాండ్ నాతగా పేరుగాంచిన కొడాలి నాని చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
This post was last modified on March 8, 2024 9:36 pm
రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా గ్రూపులు అనగానే మహిళలే గుర్తుకు వస్తారు. ఎందుకంటే.. డ్వాక్రా అంటే.. స్వయం సహాయక మహిళా సంఘాలు!…
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…