తెలంగాణలోని పార్లమెంటు స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. మొత్తం 17 స్థానాలు ఉండగా.. తాజాగా విడుదల చేసిన జాబితాలో నలుగురికి మాత్రమే సీట్లు ఎనౌన్స్ చేసింది. వీటిలో రెడ్లకే పెద్దపీట వేయడం గమనార్హం. రాబోయే లోక్ సభ ఎన్నికలకు 36 మంది అభ్యర్థులతో ఫస్ట్ లిస్ట్ ను ఏఐసీసీ ప్రకటించింది. దీనిలో తెలంగాణలో మొత్తం 17 ఎంపీ స్థానాలకు గాను.. 4 స్థానాలకు అభ్యర్థులను కూడా ఖరారు చేసింది. అన్ని సమీకరణలు చూసుకుని, ఆర్థికంగా, సామాజిక వర్గం పరంగా, గత రాజకీయ అనుభవాలను దృష్టిలో పెట్టుకుని సీట్లను కేటాయించినట్టు తెలుస్తోంది.
జహీరాబాద్ నుంచి సురేష్ షెట్కార్, నల్గొండ స్థానానికి కుందూరు రఘువీర్ రెడ్డి, చేవెళ్ల స్థానానికి సునీతా మహేందర్ రెడ్డి, మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్ లను అభ్యర్థులు కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది. అయితే, మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థిగా వంశీచందర్ రెడ్డిని ఇప్పటికే ప్రకటించారు. దీంతో మొత్తం 5 స్థానాల్లో ఇప్పటి వరకు కాంగ్రెస్ తన అభ్యర్థులను ప్రకటించినట్టు అయింది. ఇక, దేశవ్యాప్తంగా చూసుకుంటే.. 32 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్టయింది. దీనిలోనూ కొందరు బంధువులకు టికెట్ కేటాయించారు.
ప్రస్తుత కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సోదరుడు డీకే సురేష్‌కు బెంగళూరు రూరల్ పార్లమెంటు స్థానాన్ని కేటాయించారు. ఇక, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి వయనాడ్ నుంచే పోటీ చేయనున్నారు. వాస్తవానికి ఈ టికెట్ విషయంలో కొంత తర్జన భర్జన జరిగింది. తమ సీటు తమకు ఇచ్చేయాలని కామ్రెడ్ల నుంచి వివాదం రావడంతో సోనియా గాంధీ దౌత్యం చేసి ఈ సీటును కుమారుడికే ఇప్పించుకున్నారు. ఫలితంగా ఫస్ట్ జాబితాలోనే రాహుల్‌కు వయనాడ్ దక్కింది.
ఇక, కేరళలోని పథనం తిట్ట పార్లమెంటు స్థానాన్ని పార్టీ సీనియర్ నేత, మాజీ సీఎం ఏకే ఆంటోని రెండో కుమారుడు ఆంటో ఆంటోనీకి కేటాయించడం గమనార్హం. చిత్రం ఏంటంటే పెద్ద కుమారుడు ఇటీవలే బీజేపీలోకి చేరిపోయాడు. దీంతో ఈ కుటుంబం మొత్తం యూటర్న్ తీసుకునే చర్చ సాగుతోంది. ఇలాంటి సమయంలో పార్టీ అనూహ్య నిర్ణయం తీసుకుంది. మరోవైపు ఈ సారి ఓటమి తథ్యమని కాంగ్రెస్‌లోనే చర్చ సాగుతున్న సిట్టింగ్ ఎంపీ, పార్టీ సీనియర్ నేత శశి థరూర్‌కు తిరిగి తిరువనంతపురం టికెట్‌నే కేటాయించారు. ఈయన తరచుగా బీజేపీ విధానాలను సమర్థిస్తుండడం గమనార్హం. మొత్తానికి కాంగ్రెస్‌లో మెరుపులు లేని జాబితా అయితే వచ్చింది.
This post was last modified on March 8, 2024 9:05 pm
మాజీ మంత్రి మల్లారెడ్డి స్టేజ్ ఎక్కారంటే, మైక్ అందుకున్నారు అంటే మెరుపులు మెరవాల్సిందే. అది రాజకీయ సభ అయినా.. సినిమా…
మన దేశంలో చాలా చోట్ల కోతుల బెడద ఉంది. అడవుల నరికివేత, పట్టణీకరణ నేపథ్యంలో కోతులు జనావాసాల మధ్యకు వచ్చాయి.…
అల్లు అర్జున్ అంటే ఒకప్పుడు మెగా హీరోల్లో ఒకడు. అతను మెగాస్టార్ చిరంజీవినో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌నో పొగిడితేనో..…
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఇరుముడి తప్ప మరొక మాట వినిపించదేమో అన్న రేంజ్ లో వసూళ్లు హోరెత్తిపోతున్నాయి. ఈ జోరు…
ఇంకో నాలుగు రోజుల్లో విడుదల కాబోతున్న టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ మల్లారెడ్డి యునివర్సిటిలో ఘనంగా జరిగింది. తెలుగు…
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల్లో ఒకరైన కొడాలి నానికి తెలుగుదేశం అన్నా, జనసేన అన్నా ఎంత కోపమో ప్రత్యేకంగా…