Political News

రేవంత్ గేం.. ఎలక్షన్స్ ముందా తరువాతా?

అధికారంలో ఉన్నపుడు కేసీయార్ ప్రతిపక్షాలపైకి కేసీయార్ ప్రయోగించిన అస్త్రాన్నే రేవంత్ రెడ్డి ప్రయోగించబోతున్నారు. అదేమిటంటే బీఆర్ఎస్ఎల్పీలో చీలిక తేవటం. బీఆర్ఎస్ తరపున గెలిచిన ఎంఎల్ఏల్లో ఎంతమందిని వీలైతే అంతమందిని లాగేసుకునేందుకు ప్లాన్ చేస్తున్నట్లు పార్టీవర్గాల సమాచారం. టార్గెట్ ప్రకారం ఎంఎల్ఏలు కాంగ్రెస్ లో చేరుతారనే నమ్మకం కుదరగానే బీఆర్ఎస్ఎల్పీలో చీలిక తేవాలని ప్లాన్ చేశారట. తక్కువలో తక్కువ 12-15 మంది ఎంఎల్ఏలు హస్తం గూటికి రావడం ఖాయమైతే అప్పుడు గేమ్ మొదలు పెట్టాలన్నది రేవంత్ ఆలోచనగా తెలుస్తోంది.

అయితే బీఆర్ఎస్ఎల్పీలో చీలిక పార్లమెంట్ ఎన్నికలకు ముందా ? తర్వాతా అన్నదే తేల్చుకోలేకపోతున్నారట. ఎందుకంటే రాజకీయంగా ఎలా చేస్తే లాభం ఉంటుందనే విషయంపై ప్రత్యేకంగా కసరత్తు చేస్తున్నారట. 2014లో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీయార్ చేసిందిదే. ముందుగా టీడీపీ ఎంఎల్ఏలపైన టార్గెట్ పెట్టారు. ఒక్కో ఎంఎల్ఏని లాగేసుకుని చివరకు టీడీపీఎల్పీలో చీలిక తెచ్చారు. మెజారిటి టీడీపీ ఎంఎల్ఏలను అప్పటి టీఆర్ఎస్లోకి లాగేసుకున్నారు. తర్వాత కాంగ్రెస్ ఎంఎల్ఏలపైన టార్గెట్ పెట్టారు. ఈ పార్టీ విషయంలో కూడా అలాగే చేశారు.

టీడీపీ, కాంగ్రెస్ పార్టీలను లేవనీయకుండా దెబ్బకొట్టేందుకు కేసీయార్ శతవిధాల ప్రయత్నాలు చేశారు. ప్రాంత వైరుధ్యం వల్ల టీడీపీని సాంతం దెబ్బకొట్టడంలో కేసీయార్ విజయం సాధించారు. అయితే కాంగ్రెస్ విషయంలో మాత్రం ఫెయిలయ్యారు. దాని ఫలితమే ఇపుడు అధికారంలో కాంగ్రెస్ కూర్చోవటం. అప్పట్లో తాను ఏదైతే వ్యూహాన్ని అమలుచేసారో ఇపుడు అదే వ్యూహాన్ని రేవంత్ అమలుచేయబోతున్నారంతే. ఎంత అవకాశం ఉంటే అంత బీఆర్ఎస్ ను చీల్చి చెండాటమే రేవంత్ టార్గెట్ గా పెట్టుకున్నట్లు పార్టీవర్గాల సమాచారం.

ప్రస్తుత పాలిటిక్స్ అంతా పవర్ పాలిటిక్స్ అయిపోయాయి. రాజకీయాల్లోకి ఎవరు ప్రవేశిస్తున్నా వ్యక్తిగత లాభాలు, ప్రయోజనాలను రక్షించుకోవటం కోసమని బాగా తెలుసు. పార్టీలు మారుతున్నా కేవలం ఇందుకోసమే అనడంలో సందేహం లేదు. అందుకనే ఏ పార్టీ అధికారంలో ఉంటే ప్రత్యర్థి పార్టీల ప్రజాప్రతినిధులు కండువాలు మార్చేసుకోవటానికి కారణం ఇదే. పార్టీవర్గాల సమాచారం ప్రకారం ఇప్పటికే 8 మంది బీఆర్ఎస్ ఎంఎల్ఏలు రేవంత్ ను కలిశారు. మరి వీళ్ళంతా రేవంత్ ను ఎందుకు కలిశారు ? తొందరలో ఏమి చేయబోతున్నారు అన్నది చూడాలి.

This post was last modified on March 9, 2024 11:41 am

Share

Recent Posts

సామజిక చైతన్యం వైపు అల్లు అర్జున్ అభిమానులు

సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…

9 seconds ago

కోర్టులను అనుమానిస్తున్నారా జగన్?

న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…

49 minutes ago

కన్నీటి పర్యంతమైన బొత్స

వైసీపీ ఎమ్మెల్సీ బొత్స మేనల్లుడు, ఉత్తరాంధ్రలో వైసీపీ కీలక నేత, విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న…

1 hour ago

వంగ ఏం మాట్లాడినా కాంట్రవర్సీ తప్పదా

సోషల్ మీడియాలో రచ్చ లేపాలంటే సందీప్ రెడ్డి వంగ సినిమా తీయాల్సిన అవసరమే లేదని.. అతను యథాలాపంగా చిన్న కామెంట్…

1 hour ago

సూర్య పాత్రలో షాకింగ్ ట్విస్టుందా?

తెలుగులో స్టార్ హీరోల పాత్రలకు ఏదైనా వైకల్యం పెట్టాలంటే.. ఎన్నో భయాలుండేవి ఒకప్పుడు. హీరోలు అలాంటి పాత్రలు ఒప్పుకోవడమూ కష్టంగా…

2 hours ago

విజయవాడ మేయర్ రేసుకు పోటాపోటీ

విజయవాడ మేయర్ పదవికి అన్నీ పార్టీల్లోనూ పోటీ పెరుగుతుంది. ఇంకా ఎన్నికల ప్రక్రియ మొదలుకాకుండానే మేయర్ కుర్చీ పై పలువురు…

2 hours ago