తాను గత ఎన్నికల్లో ఓడిపోయిన భీమవరం నియోజకవర్గాన్ని ఎట్టి పరిస్థితిలోనూ ఈ సారి వదులుకోకూ డదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయానికి వచ్చారు. భీమవరంపై ఉక్కుపిడికిలి బిగిస్తున్నా. ఇక్కడ గెలిచి తీరాల్సిందే. మీరు ఏమైనా చేయండి. నా మద్దతు ఉంటుంది.
అని తాజాగా జనసేన కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. భీమవరం నుంచి ఎవరు పోటీ చేసినా, అక్కడ జనసేన గెలవాలి. గెలిచి తీరాలి.. అని షరతు విధించారు.
“ఇప్పుడు ఏ ఉత్సాహంతో పార్టీ శ్రేణులు పని చేస్తున్నాయో.. అంతకుమించిన ఉత్సాహంతో పని చేయాలి“ అని కార్యకర్తలకు పవన్ సంచలన పిలుపునిచ్చారు. గురువారం రాత్రి ఢిల్లీకి వెళ్లేముందు ఆయన మంగళగిరిలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని కీలకమైన భీమవరం నియోజకవర్గం ముఖ్య నాయకు లతో సమావేశమయ్యారు. వచ్చే ఎన్నికల్లో పవన్ కల్యాణ్ భీమవరం నుంచి పోటీ చేసే అవకాశం ఉందని వస్తున్న వార్తల నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది.
క్షత్రియ, కాపు ఓటు బ్యాంకు మిక్స్‌డ్‌గా ఉన్న భీమవరంలో గత ఎన్నికల్లో పవన్ ఓడిపోయారు. అయితే.. బలమైన పోటీ మాత్రం ఇవ్వగలిగారు. ఇక, ఇప్పుడు.. మాత్రం ఆయన పోటీ చేస్తారా? లేదా? అనేది పక్కన పెడితే, సొంత జిల్లా(మెగా ఫ్యామిలీకి)లో ఓడిపోయారన్న అపవాదు నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే స్థానిక బలమైన నాయకులు కనకరాజు సూరి, కొటికలపూడి గోవిందరావు, చెనమల్ల చంద్రశేఖర్‌లతో పవన్ విడిగా సమావేశమయ్యారు.
భీమవరంలో తాజా పరిస్థితులు, రాజకీయ పరిణామాలపై చర్చించారు. భీమవరం తన సొంత నియోజక వర్గమని పవన్ పేర్కొన్నారు. పార్టీ గెలుపునకు క్యాడర్ అంతా సంసిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అయితే.. పవన్ ఇక్కడ నుంచి పోటీ చేస్తారా? లేక.. ఎవరినైనా రంగంలోకి దింపుతారా? అనేది వేచిచూ డాలి. అయితే.. ఎవరు రంగంలోకి దిగినా.. గెలిచేలా పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడం గమనార్హం.
This post was last modified on March 8, 2024 5:59 pm
వైసీపీ కీలక నేత, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి ఓ రేంజిలో న్యాయ పోరాటం చేస్తున్నారు. తిరుపతి…
వైసీపీ అధినేత జగన్ వ్యవహార శైలి కేవలం ప్రధాన ప్రతిపక్షం కోసమే ఆరాటపడుతున్నట్టు కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం ఆయనకు…
ఏపీలో రిలీజ్ సినిమాల ప్రదర్శనలపై కూటమి సర్కారు సరికొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇప్పటిదాకా రిలీజ్ అయ్యే దాదాపుగా అన్ని…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏది చేసినా చాలా వెరైటీగా ఉంటుంది. ఇతర రాజకీయ నాయకులతో…
https://www.youtube.com/watch?v=V0ARlFc_ndE సంక్రాంతి పందెం కోళ్ళలో మొదటిది గేమ్ ఛేంజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. తుది తీర్పు ఏంటనేది తేలడానికి ఇంకొంచెం…
బ్రాండ్ ఏపీ ప్రారంభమైందని సీఎం చంద్రబాబు తెలిపారు. వైసీపీ విధ్వంసంతో అతలాకుతలమైన రాష్ట్రాన్ని అన్ని విధాలా బాగు చేస్తున్నామని చెప్పారు.…