Political News

చంద్రబాబు, రేవంత్ ల రహస్య భేటీ?

బీజేపీతో పొత్తుల వ్యవహారంపై తుది చర్చలు జరిపేందుకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే గురువారం మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరిన చంద్రబాబు విమానాశ్రయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారని తెలుస్తోంది. మధ్యాహ్నం 3:30 నుంచి సాయంత్రం 5.30 వరకు దాదాపు 2 గంటల పాటు గురు శిష్యులిద్దరూ కీలకమైన చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది.

బీజేపీతో టీడీపీ-జనసేన పొత్తు వ్యవహారంతో పాటు ఏపీ రాజకీయాలలో తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పాత్ర ఏ విధంగా ఉండాలి అన్న వ్యవహారంపై కూడా చంద్రబాబు, రేవంత్ చర్చించినట్టుగా తెలుస్తోంది. గత ఎన్నికలకు ముందు తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్…అప్పటి ప్రతిపక్ష నేత జగన్ కు పూర్తిస్థాయిలో మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. అదేవిధంగా 2024 ఎన్నికలలో టీడీపీ-జనసేన కూటమికి రేవంత్ రెడ్డి కూడా మద్దతు ఏ విధంగా తెలపాలి అన్న వ్యవహారంపై ఈ ఇద్దరు చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది.

ఇక లోక్ సభ ఎన్నికలలో బీఆర్ఎస్ ను ఓడించేందుకు బిజెపితో కాంగ్రెస్ చీకటి ఒప్పందం కుదుర్చుకుందని విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మోడీని పెద్దన్న అంటూ రేవంత్ రెడ్డి సంబోధించారని బీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీతో బీజేపీ పొత్తు చర్చలు జరుగుతున్న సమయంలో చంద్రబాబు, రేవంత్ భేటీ అయ్యారన్న టాక్ వస్తోంది.

ఓ పక్క టీడీపీ-జనసేన-బిజెపి కూటమి దాదాపు ఖరారు కాబోతున్న నేపథ్యంలో వైసీపీ పై ముప్పేట దాడి ఖాయమని ఇద్దరు చర్చించుకున్నారని తెలుస్తోంది. మరోవైపు వైపు షర్మిల నేతృత్వంలోని కాంగ్రెస్ కూడా వైసీపీపై విరుచుకుపడుతోందని, ఏపీ కాంగ్రెస్ కు తెలంగాణ కాంగ్రెస్ కూడా పూర్తి స్థాయి మద్దతు ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది. జగన్ పై నలువైపుల నుంచి దాడి చేసే అవకాశం ఉంటుందని వారు మాట్లాడుకున్నట్టుగా తెలుస్తోంది. మరో ఐదు రోజుల్లో ఏపీలో ఎన్నికల కోడ్ రాబోతున్న నేపథ్యంలో ఎన్నికలకు సంబంధించిన పార్టీకి కావాల్సిన సహాయ సహకారాలపై కూడా ఈ ఇద్దరు నేతలు చర్చించారని తెలుస్తోంది.

This post was last modified on March 8, 2024 4:54 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

జంపింగ్ జ‌పాంగ్‌లు.. గెలుపు గుర్రం ఎక్కేనా?

సార్వత్రిక ఎన్నికలకు ముందు ఏపీలో అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు పార్టీలు, కండువాలు మార్చేసిన జంపింగ్ జపాంగ్‌ల…

53 mins ago

ఒక‌టి జ‌గ‌న్‌కు.. ఒక‌టి ష‌ర్మిల‌కు.. అవినాష్‌కు సున్నా

క‌డ‌ప‌లో అవినాష్ రెడ్డి క‌థ ముగిసిందా? ఎంపీ స్థానాన్ని అత‌ను కోల్పోవాల్సిందేనా? అంటే రాజ‌కీయ విశ్లేష‌కులు అవున‌నే అంటున్నారు. క‌డ‌ప…

2 hours ago

ఆరంభం టాక్ ఏంటి

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక చిన్న సినిమా ప్రేక్షకుల అటెన్షన్ దక్కించుకోవడం కష్టం. ట్రైలర్ కట్ తో అది చేసి చూపించిన…

3 hours ago

రూ.10 లక్షలు ఇస్తే ‘నీట్’గా రాసేస్తా !

దేశమంతా ఈ ఆదివారం నీట్ - యూజీ పరీక్షలు జరిగాయి. దేశమంతా 24 లక్షల మంది పరీక్ష రాశారు. గత…

3 hours ago

దేశం దృష్టిని ఆకర్షిస్తున్న ఆ నియోజకవర్గాలు !

దేశంలో 543 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న రాజకీయ విశ్లేషకులు, ప్రజల దృష్టి మాత్రం కొన్ని నియోజకవర్గాల మీదనే ఉంది. ఇందులో…

4 hours ago

కామెడీ హీరో అదృష్టం బాగుంది

ఇమేజ్ ఉన్న మీడియం రేంజ్ స్టార్లకే ఓపెనింగ్స్ వస్తాయా రావా అనే టెన్షన్ ఉన్న పరిస్థితులు ప్రస్తుతం నెలకొన్నాయి. దానికి…

4 hours ago