Political News

గ‌వ‌ర్న‌ర్ ఇలా చేసి ఉండాల్సింది కాదు

తెలంగాణలోని గ‌వ‌ర్న‌ర్ కోటా ఎమ్మెల్సీ ల విష‌యంలో చోటుచేసుకున్న వివాదానికి హైకోర్టు తెర‌దించిం ది. గ‌త బీఆర్ ఎస్ ప్ర‌భుత్వం సిఫార‌సు చేసిన వారి విష‌యంలో గ‌వ‌ర్న‌ర్ వ్య‌వ‌హ‌రించిన తీరును కోర్టు త‌ప్పుబ‌ట్టింది. అదే స‌మ‌యంలో ప్ర‌స్తుత ప్ర‌భుత్వం చేసిన సిఫార‌సు మేర‌కు గ‌వ‌ర్న‌ర్ తీసుకున్న నిర్ణ‌యాల‌ను కూడా ఆక్షేపించింది. ఇలా చేసి ఉండాల్సింది కాదు అని గ‌వ‌ర్న‌ర్‌ను ఉద్దేశించికోర్టు వ్యాఖ్యానించింది. ఈ క్ర‌మంలో రేవ‌త్‌రెడ్డి ప్ర‌భుత్వం సిఫార‌సు చేసిన ప్రొఫెస‌ర్ కోదండ‌రాం, అమిర్ అలీఖాన్‌ల అభ్య‌ర్థిత్వాల‌ను కోర్టు తోసిపుచ్చింది.

ఏం జ‌రిగింది?

కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ ఎస్ ప్రభుత్వ హ‌యాంలో దాసోజు శ్రవణ్‌, కుర్రా సత్యనారాయణల‌ను గ‌వ‌ర్న‌ర్ కోటాలో మండ‌లికి నామినేట్‌ చేస్తూ గ‌త ఏడాది ఎన్నిక‌ల‌కు ముందు మంత్రి మండలి తీర్మానం చేసింది. దీనిని ఆమోదించాల‌ని కోరుతూ గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సైకి పంపించారు. అయితే..ఆమె దీనిని ఆమోదించ‌క‌పోగా రోజుల వ్య‌వ‌ధిలోనే తిరస్కరించారు. దీంతో గ‌వ‌ర్న‌ర్ నిర్ణ‌యాన్ని సవాల్‌ చేస్తూ దాసోజు, కుర్రాలు హైకోర్టును ఆశ్రయించారు. గవర్నర్‌ పరిధి దాటి వ్యవహరించారని, మంత్రిమండలికి ఎమ్మెల్సీలను నామినేట్ చేసే హక్కు ఉంద‌ని పిటిషనర్లు పేర్కొన్నారు. దీనిపై ఇంకా తీర్పు రావాల్సి ఉంది.(అప్ప‌టికి)

ఇంత‌లోనే తెలంగాణ‌లో ప్ర‌భుత్వం మారిపోయింది. ఆ వెంట‌నే సీఎం రేవంత్‌రెడ్డి ఇదే గ‌వ‌ర్న‌ర్ నామినే టెడ్‌ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదండరాం, ఆమిర్‌ అలీఖాన్‌లను సిఫార్సు చేస్తూ.. గవర్నర్ కు ఫైలు పం పించారు. ఆ వెంట‌నే గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సై వారి పేర్లను ఆమోదించారు. అనంతరం కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం కూడా లభించడంతో వారి నియామక ఉత్తర్వులు జారీ అయ్యాయి.

యూట‌ర్న్ ఇలా..

రేవంత్ స‌ర్కారు సిఫారసు చేసిన అభ్య‌ర్థుల వ్య‌వ‌హారంపై మ‌రోసారి బీఆర్ ఎస్ నేత‌లు దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ హైకోర్టును ఆశ్రయించారు. గతంలో తాము వేసిన పిటిషన్‌పై నిర్ణయం వెలువడే వరకూ ఈ నియామకాలు ఆపాలని పిటిషన్‌లో కోరారు. దీంతో తాజాగా హైకోర్టు ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఎమ్మెల్సీల నియామకంపై ప్రభుత్వం పునఃసమీక్షించుకోవాలని పేర్కొంది.

ఏం జ‌రుగుతుంది: మ‌రికొద్ది రోజుల్లో అంటే ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత కావొచ్చు.. లేదా ముందే అయినా.. మ‌ళ్లీ అమిర్‌, కోదండరాంల‌కే అవ‌కాశం ఇస్తూ.. నామినేట్ చేయొచ్చు.

This post was last modified on March 7, 2024 2:16 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చిన్మయి vs ట్విట్టర్ యువత – ఆగేదెప్పుడు?

గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి చాలా ఏళ్ల నుంచి అమ్మాయిలకు ఎదురయ్యే లైంగిక వేధింపుల గురించి అలుపెరగని పోరాటం చేస్తున్న…

10 minutes ago

సునీల్ వెనుక వైసీపీ రాజకీయ వర్గాల్లో చర్చ

వివాదాస్పద ఐపీఎస్ సునీల్ కుమార్ వ్యవహారం అందరికీ తెలిసిందే. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజును కస్టోడియల్ విచారణలో చేయి చేసుకున్నారన్న…

34 minutes ago

బాలయ్యతో వస్తే మోగ్లికే మంచిది

అఖండ 2 వాయిదా వ్యవహారం డిసెంబర్ 12 విడుదల కావాల్సిన వేరే సినిమాల మీద ప్రభావం చూపించింది. సైక్ సిద్దార్థ్…

49 minutes ago

ఎన్నికల వరకు ఓర్చుకోండి అని జగన్ సూచన?

వైసీపీ నాయకులకు జగన్ తరచుగా హితవు పలుకుతున్నారు. ఎన్నికల వరకు ఓర్చుకోవాలని చెబుతున్నారు. దీనికి కారణం కొందరు ప్రస్తుతం కేసుల్లో…

54 minutes ago

పవన్ చెప్పే స‌నాత‌న ధ‌ర్మ బోర్డు.. ప్రభుత్వం స్థాపించగలదా?

``స‌నాత‌న ధ‌ర్మ బోర్డును సాధ్య‌మైనంత వేగంగా ఏర్పాటు చేయాలి.`` తాజాగా జ‌న‌సేన అధినేత‌, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ మ‌రోసారి…

1 hour ago

అఖండకు ఆలస్యమనే విషం అమృతంగా మారింది

గత వారం చివరి నిమిషంలో విడుదల వాయిదా పడిన అఖండ 2 ఇప్పుడు డిసెంబర్ 12 రావడం అంతా మంచికే…

1 hour ago