వైసీపీలో సంచలనం చోటు చేసుకోనుందా? కీలక నాయకురాలు.. ప్రస్తుత మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ.. జనసేనలో చేరేందుకు రెడీ అయ్యారా? ఇప్పటికే రహస్యంగా మంతనాలు కూడా పూర్తి చేసుకున్నారా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. తాజాగా ఆమె తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను వైసీపీ అధినేత, సీఎం జగన్‌కు పంపించారు. అయితే.. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
వాసిరెడ్డి పద్మ.. వైసీపీ నాయకురాలిగా దాదాపు 10 ఏళ్లుగా ఆమె పనిచేస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చేందుకు కూడా ఆమె ప్రయత్నాలు చేశారు. గతంలోప్రజారాజ్యంపార్టీలో పనిచేసిన ఈమె కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకురాలు. ఎస్సీ వ్యక్తిని వివాహం చేసుకున్నారు. 2009లో జగ్గయ్యపేట నియోజక వర్గం నుంచి ఆమె పోటీ చేశారు. అయితే.. ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. తర్వాత.. వైసీపీ బాట పట్టారు. సుదీ ర్ఘకాలంలో పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.
వైసీపీ అధికారంలోకి వచ్చాక సీఎం జగన్ ఆమెకు మహిళ కమిషన్ చైర్ పర్సన్ బాధ్యతలు అప్పగించారు. రెండోసారి కూడా రెన్యువల్ చేశారు. తరచుగా ఆమె ప్రభుత్వం పక్షమే మాట్లాడుతున్నారు. అయితే.. వచ్చే ఎన్నికల్లో ఆమె పోటీ చేయాలని భావించారు. కానీ, టికెట్ విషయంలో ఎటూ తేలక పోవడం.. కాపుల ప్రభావం ఇప్పుడు జనసేనవైపు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆమె జనసేన వైపు మొగ్గు చూపుతున్నారని తెలిసింది. గతంలో చిరంజీవితో ఉన్న పరిచయాలు.. పార్టీలో పనిచేసిన అనుభవం నేపథ్యంలో పవన్ కూడా ఆమెను ఆహ్వానించినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on March 7, 2024 12:40 pm
కోలీవుడ్ టాప్ హీరోయిన్ నయనతారకు కోపం వచ్చింది. హీరో ధనుష్ మీద తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ మూడు పేజీల…
పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న అకీరానందన్ తెరంగేట్రం కన్నా ముందు అతని సంగీతం వినే అవకాశం దక్కేలా…
రీల్స్ చేయటం ఇవాల్టి రోజున కామన్ గా మారింది. చిన్నా.. పెద్దా అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరు తమకున్న…
అభిమానుల దృష్టి ఓజి మీద విపరీతంగా ఉండటం వల్ల హైప్ విషయంలో హరిహర వీరమల్లు కొంచెం వెనుకబడినట్టు అనిపిస్తోంది కానీ…
టాలీవుడ్లో మెగా హీరోలకు ఉన్న ఫ్యాన్ సపోర్ట్ ఇంకెవరికీ ఉండదనే అభిప్రాయాలున్నాయి. ముందు తరంలో ముందు మెగాస్టార్ చిరంజీవి, ఆ…
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…