Political News

వ‌లంటీర్ వ్య‌వ‌స్థ‌ను ర‌ద్దు చేయం: చంద్ర‌బాబు

తాము అధికారంలోకి రావ‌డం ప‌క్కా అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. తాము అధికారంలోకి వ‌చ్చినా.. వ‌లంటీర్ వ్య‌వ‌స్థ‌ను ర‌ద్దు చేయ‌బోమ‌ని చెప్పారు. అనంత‌పురం జిల్లా పెనుకొండలో నిర్వ‌హించిన‌ ‘రా కదలిరా’ సభలో ఆయ‌న మాట్లాడుతూ.. వ‌లంటీర్ల ప్రస్తావన తీసుకువచ్చారు. టీడీపీ-జనసేన అధికారంలోకి వచ్చినా వ‌లంటీరు వ్యవస్థ ఉంటుందని, ఎవరినీ ఉద్యోగం నుంచి తొలగించబోమని స్పష్టం చేశారు. అయితే, వాలంటీర్లు వైసీపీ కోసం పనిచేయవద్దని కోరుతున్నాన‌న్నారు. వ‌లంటీర్లకు మంచి భవిష్యత్ ఉంటుందని, వారికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

“అనంతపురం జిల్లా అంటే నాకు ఎంతో ఇష్టం. అత్యంత తక్కువ వర్షపాతం నమోదయ్యే జిల్లా ఇది. అలాంటి అనంతపురం జిల్లాను సస్యశ్యామలం చేయాలని సంకల్పించాం. కియా పరిశ్రమను తెచ్చి వేలాది మందికి ఉపాధి కల్పించాం. కియా కోసం గొల్లపల్లి రిజర్వాయర్ ను 18 నెలల్లో పూర్తి చేసిన నీరు అందించాం. 2014లో పెనుకొండ ప్రాంతం ఎలా ఉంది… ఇప్పుడెలా ఉంది? కియా వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా 50 వేల మందికి ఉద్యోగాలు వచ్చాయి” అని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు.

టీడీపీ కార్యకర్తలను ఎక్కడికక్కడ వేధిస్తున్నారని చంద్ర‌బాబు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. “ఖబడ్దార్… జాగ్రత్తగా ఉండండి. దెబ్బకు దెబ్బ… మంచికి మంచి. తమాషా అనుకోవద్దు. నాడు అనంతపురం జిల్లాలో రక్తం పారించారు… నేను వచ్చి నీళ్లు పారించాను. రాష్ట్రాన్ని మళ్లీ నాశనం చేయాలనుకుంటున్నారు. ఇది మీ వల్ల కాదు” అని వైసీపీ నాయ‌కుల‌కు వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రాన్ని బాగు చేసే బాధ్యత తాము తీసుకుంటున్నామ‌న్నారు. ప్రజల తరఫున నాయకులుగా తాను, జ‌న‌సేన అధినేత పవన్ కల్యాణ్ ముందుకెళతామ‌ని చెప్పారు. ఎలాంటి త్యాగాలకైనా తాము సిద్ధమేనని… మీరు సిద్ధమా అని ప్ర‌జ‌ల‌ను ప్ర‌శ్నించారు.

జగన్ రాష్ట్రాన్ని మూడు ముక్కలాట పేరుతో నాశనం చేశాడని చంద్ర‌బాబు దుయ్య‌బ‌ట్టారు. అందుకే సూపర్ సిక్స్ తీసుకువచ్చా మ‌న్నారు. “సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం. పేదరికం నిర్మూలన చేయడం తెలిసిన పార్టీ తెలుగుదేశం. మహిళలకు, రైతులకు, యువతకు, ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనారిటీలకు న్యాయం చేసి, రాష్ట్రాన్ని మళ్లీ ప్రగతిపథంలో నడిపించే బాధ్యత మాది” అని చంద్ర‌బాబు చెప్పారు.

సీటుపై స్ప‌ష్ట‌త‌

చంద్ర‌బాబు త‌న ప‌ర్య‌ట‌న‌లో పెనుకొండ సీటుపై స్ప‌ష్ట‌త ఇచ్చారు. పెనుకొండ ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా సబితను నిలబెడుతున్నామ‌న్నారు. ఇక్కడి ఎమ్మెల్యే నియోజకవర్గాన్ని తమ్ముళ్లకు అప్పజెప్పి వందల ఎకరాలు దోచేశాడని మాజీ మంత్రి శంక‌ర‌నారాయ‌ణ‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. పెన్నా నది నుంచి బెంగళూరుకు ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని అన్నారు. అలాంటి ఎమ్మెల్యే పోయాడు కానీ… ఇంకొక ఆవిడ వచ్చిందని .. ఆయన కంటే భయంకరమైన వ్యక్తి అని మంత్రి ఉష శ్రీచ‌ర‌ణ్‌పై చంద్ర‌బాబు విమ‌ర్శ‌లు గుప్పించారు.

This post was last modified on March 5, 2024 12:07 pm

Share

Recent Posts

బిర్యానీ తినడానికే పుట్టినవారు జంతువులు

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో మీడియాకెక్కారు. ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతతో వ్యవహారించాల్సిన ఆయన అత్యంత…

2 hours ago

ఆరుగురు పతివ్రతలు మళ్ళీ వస్తున్నారు

కొన్నేళ్లుగా టాలీవుడ్లో రీ రిలీజ్ మేనియా ఎలా న‌డుస్తోందో తెలిసిందే. ఇంట్లో కూర్చుని ఓటీటీల్లో లేదా యూట్యూబ్‌లో ఎప్పుడైనా చూసుకునే…

2 hours ago

డెకాయిట్ అత్యాశని దృశ్యం 3 వాడుకుంది

బాలీవుడ్ చరిత్రలో గొప్ప బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన దురంధర్ మొదటి భాగంలో హీరో కన్నా ఎక్కువ పేరు…

3 hours ago

బీజేపీ మంత్రి ఇలాకాలో మారుతున్న రాజ‌కీయం ..!

ఉమ్మ‌డి అనంతపురం జిల్లాలోని ధ‌ర్మ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం ఒక్క‌సారిగా రాజ‌కీయ చ‌ర్చ‌కు వేదిక‌గా మారింది. ప్ర‌స్తుతం ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి మంత్రి…

4 hours ago

ఫ్లైయింగ్ అతడికి భార్యలాంటిది

ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…

7 hours ago

ఆ యంగ్ మినిస్ట‌ర్ దూకుడు మామూలుగా లేదుగా…

యువ మంత్రి, క‌ర్నూలు జిల్లాకు చెందిన టీజీ భ‌ర‌త్‌.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయ‌కుడిగా.. యువ…

9 hours ago