భారతీయ జనతా పార్టీతో జట్టు కట్టినప్పటి నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీరే వేరుగా ఉంటోంది. ఆ పార్టీని మెప్పించేందుకా అన్నట్లు ఆయన ‘హిందుత్వ’ ముద్ర కోసం ప్రయత్నిస్తున్నారు. భాజపా అధినాయకత్వాన్ని మెప్పించేందుకు ఆయన అనేక పనులు చేశారు. ఆయన ట్వీట్లలో కూడా చాలా వాటిని పరిశీలిస్తే ‘బీజేపీ’ ఎఫెక్ట్ కనిపిస్తోంది. ఇది పవన్‌ను అభిమానించే చాలామందికి నచ్చట్లేదు. ఈ విషయంలో ఆయన తన ఐడెంటిటీని కోల్పోతున్నారనే అభిప్రాయాలున్నాయి. ఇవి చాలవన్నట్లు పవన్ తాజాగా చేసిన ఒక ఫొటో షూట్ విమర్శల పాలవుతోంది. తన ఫామ్ హౌస్‌లోనో మరెక్కడో కానీ.. కుర్చీలో కూర్చుని పవన్ ప్రశాంతంగా పుస్తకాలు చదువుకుంటున్నట్లుగా కనిపిస్తున్నాడు ఈ ఫొటోల్లో. కానీ ఇది సహజంగా, అనుకోకుండా తీసిన ఫొటోలు కావన్నది స్పష్టం.
పనిగట్టుకుని ఒక సెటప్ చేయించుకుని ఫొటో షూట్ చేయించుకున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ విషయంలో పవన్.. ప్రధాని నరేంద్ర మోడీని అనుసరిస్తున్నాడేమో అనిపిస్తోంది. మోడీకి ఇలాంటి ఫొటో షూట్ల పిచ్చి బాగా ఉందన్న సంగతి తెలిసిందే. కరోనా టైంలో దేశం అల్లాడిపోతుంటే ఇప్పుడు కూడా నెమలిని పక్కన పెట్టుకుని ఫొటో షూట్లు చేయించుకున్న మహానుభావుడాయన. ఇలాంటి ఫొటోలతో ఏం సంకేతాలివ్వాలనుకుంటారో ఏమో కానీ.. సోషల్ మీడియాలో మాత్రం తీవ్ర వ్యతిరేకతే కనిపిస్తోంది. ప్రధానిని చెడా మడా తిట్టారు నెటిజన్లు. ఈ సంగతి ట్విట్టర్లో చాలా యాక్టివ్‌గా ఉండే జనసేన వర్గాలకు తెలియకుండా ఉండకపోవచ్చు. మరి పవన్‌కు ఏం అవసరమని ఇలాంటి విన్యాసాలు చేస్తున్నాడో ఆయనకే తెలియాలి. ఈ ఫొటో షూట్ గురించి ఒకప్పటి ప్రజారాజ్యం నేత, ప్రస్తుత కేంద్ర ఆర్థిక మంత్రి భర్త పరకాల ప్రభాకర్ ఒక కౌంటర్ కూడా వేశారు. ‘‘ఏమీ తెలియని వాళ్లకు తెలివైన వాళ్లుగా కనిపించాలని అనుకుంటే.. తెలివైన వాళ్ల ముందు ఏమీ తెలియని వాళ్లుగా మిగిలిపోతాం’’ అని ఆయన పంచ్ వేశారు.
This post was last modified on September 11, 2020 1:06 am
500 కోట్ల రూపాయల ప్రజాధనం దుబారా చేసి విశాఖలోని రుషికొండకు గుండు కొట్టి మరీ అక్కడ ఖరీదైన ప్యాలెస్ ను…
తమ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని, మైక్ ఇవ్వరేమోనని తాము అసెంబ్లీ సమావేశాలను బాయ్ కాట్ చేస్తున్నామని పులివెందుల…
టీడీపీ యువ నాయకుడు, మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో చేస్తున్న ప్రసంగాలకు మంచి లైకులు పడు తున్నాయి. ఇది ఏదో…
ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ఒకటైన ‘పుష్ప-2’ విడుదలకు ఇంకో 20 రోజుల సమయమే మిగిలి ఉంది. ఈ…
ఇండస్ట్రీలో ఏ బ్యాగ్రౌండ్ లేకుండా కెరీర్లో తొలి అడుగులు వేస్తున్న వాళ్లను ఇండస్ట్రీలో పెద్దగా పట్టించుకోరు. కానీ వాళ్లే మంచి…
తెలుగులో ఈ ఏడాది భారీ అంచనాల మధ్య విడుదలైన పాన్ ఇండియా చిత్రాల్లో ‘దేవర’ ఒకటి. పాన్ వరల్డ్ హిట్…