“ఆ.. ఎంతో మంది అక్రమాలకు పాల్పడుతున్నారు.. నేను ఈ మాత్రం తీసుకుంటే తప్పేంటి?” అనే మాట తరచుగా వినిపిస్తుంది. కానీ, పాపపు సొమ్ము ఎప్పుడూ నిలబడదు. చివరకు.. అది ఎక్కడకు చేరాలో.. ఎవరికి వెళ్లాలో.. అక్కడికే వెళ్లిపోతుంది. జనాల్ని దోచుకుని.. అక్రమ మార్గాలు, వక్రమ మార్గాల్లో సంపాయించిన సొమ్ము..చివరకు సర్కారుకు చేరిన ఘటన ఢిల్లీలో జరిగింది. దాదాపు 400 కోట్ల రూపాయల అక్రమ ఆస్తిని సర్కారు బలగాలను పెట్టి మరీ సొంతం చేసుకుంది.
ఇవీ వివరాలు..
ఉత్తర్ ప్రదేశ్‌లో లిక్కర్, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసే గురుదీప్ సింగ్ ఉరఫ్ పాంటీ చద్దా.. జనాల్ని బాగానే దోచుకున్నారు. ప్రభుత్వానికి పన్నులు ఎగవేసి, రాజకీయ నేతలను ప్రలోభాలకు గురి చేసి భూముల కబ్జాలు, దందాలు చేశాడు. ఇలా సంపాయించిన సొమ్ముతో పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్నే ఏర్పాటు చేసుకున్నాడు. ఇలా.. చద్దా.. ఒక్క యూపీలోనే కాకుండా.. బిహార్, ఢిల్లీ తదితర ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ ఎత్తున ఆస్తులు పోగేశాడు. ఈ విషయంలోనే అన్నదమ్ముల మధ్య గొడవలు కూడా జరిగాయి.
ఢిల్లీలో 10 ఎకరాలను దౌర్జన్యంగా సొంతం చేసుకున్న పాంటీ చద్దా.. ఇక్కడ భారీ ఫామ్ హౌస్‌ను నిర్మించాడు. ఈ విషయంలో పాంటీకి ఆయన చిన్నతమ్ముడు హర్దీప్‌కు మధ్య వివాదం రేగింది. ఇరువురు తన్నుకున్నారు. ఈ క్రమంలో హర్దీప్ పాంటీని కాల్చి చంపేశాడు. సినిమా అక్కడితో అయిపోలేదు.. పాంటీకి ఉన్న సెక్యూరిటీ.. హర్దీప్‌ను చంపేసింది. అంటే.. సొంత అన్నదమ్ములు ఇద్దరూ ఆస్తుల కోసం.. అది కూడా అక్రమాస్తుల కోసం చచ్చిపోయారు.
కట్ చేస్తే..
ఢిల్లీ పరిధిలోని ఛత్రపుర్ ప్రాంతంలో పాంటీ చద్దా ఏర్పాటు చేసుకున్న 400 కోట్ల రూపాయల విలువైన ఫామ్ హౌస్ ప్రస్తుతం చద్దా తనయుడి ఆధ్వర్యంలో ఉంది. అయితే.. ఈయనకు మానసిక స్థితి సరిగా లేకపోవడంతో నిర్వహణ లేకుండా పడి ఉంది. అంటే.. ఇంత ఆస్తిని కూడా అనుభవించే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో అనేక ఫిర్యాదులు అందిన నేపథ్యంలో తాజాగా ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ ఈ ఫామ్ హౌస్ పూర్తిగా నేలమట్టం చేసి భూమిని స్వాధీనం చేసుకుంది. చద్దా గతంలో బీజేసీ ప్రభుత్వం ఉన్న సమయంలో ఈ ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఫామ్ హౌస్ నిర్మించినట్లు అధికారులు గుర్తించారు. వెంటనే స్వాధీనం చేసుకున్నారు. దీనిలో గార్డెన్, అత్యంత విలాస వంతమైన ఔట్‌హౌస్, ప్రధాన భవనం ఉన్నాయి. మొత్తానికి అక్రమంగా వచ్చిన సొమ్ము.. సర్కారుకే చేరడం గమనార్హం.
This post was last modified on March 3, 2024 9:47 pm
రకరకాల ప్రచారాలు, వదంతులు, డిస్కషన్లు, సోషల్ మీడియా తిట్లు, ఎన్నెన్నో కథలు వెరసి గత అయిదు రోజులుగా పెద్ద చర్చగా…
టెస్ట్ సిరీస్ ఓటమి బాధను మరిపిస్తూ వన్డే సిరీస్ గెలిచిన టీమిండియా, ఇప్పుడు టీ20లోనూ అదే జోరు కొనసాగించింది. కటక్లోని…
టెక్ ప్రపంచంలోనే ఒక సంచలన ప్రకటన వెలువడింది. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, భారత ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు.…
తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో భాగంగా ఇవాళ సినీ ప్రముఖులు ఈ సమ్మేళనానికి విచ్చేసారు. అందులో పాల్గొన్న నిర్మాత అల్లు…
అఖండ 2 విడుదల డిసెంబర్ 12 ఉంటుందా లేదానే అయోమయం ఇంకా కొనసాగుతోంది. ఆ డేట్ కి రావడం పక్కానే…
ఒకే ఏడాది రెండు రిలీజులతో అభిమానులను ఖుషి చేసిన పవన్ కళ్యాణ్ అతి తక్కువ గ్యాప్ లో మూడో సినిమాతో…