బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ వ్యవహారం నేపథ్యంలో బాలీవుడ్ నటి కంగనా రనౌత్, మహారాష్ట్ర సర్కార్ ల మధ్య వివాదం తీవ్రస్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఉద్ధవ్ థాకరేను, మహారాష్ట్ర ప్రభుత్వాన్ని, పోలీసులను ఉద్దేశించి కంగనా పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఈ క్రమంలోనే తాజాగా కంగనా రనౌత్‌పై ముంబైలో రెండు కేసులు నమోదయ్యాయి.
మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే గౌరవానికి భంగం కలిగించేలా కంగనా వ్యాఖ్యలు చేసినందుకు ముంబైలోని విఖ్రోలి పోలీస్ స్టేషన్‌లో రెండు కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేపై చేసిన వ్యాఖ్యలకు నటి కంగనా రనౌత్ పై ఒక కేసు నమోదైంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ను కంగనా “తుఝే” అని ఏకవచనంతో సంబోధిస్తూ అగౌరవపరిచిందని కేసు నమోదైంది. ఉద్ధవ్ థాకరే తుఝే క్యా లగ్ తా హై
అంటూ కంగనా మాట్లాడిన వీడియోపై శివసేన నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఆమెపై కేసు నమోదైంది.
తన ఆఫీసును కూల్చివేసిన తర్వాత కంగనా బీఎంసీ అధికారులపై, మహారాష్ట్ర సర్కార్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసింది.కశ్మీరు నుంచి పండిట్లను తరిమివేసినప్పుడు వారు పడిన బాధ తనకు అర్థమైందని, అయోధ్యతోపాటు కశ్మీరుపై కూడా సినిమా తీస్తానని కంగనా సంచలన వ్యాఖ్యలు చేసింది. తనకు జరిగిన ఘటనను కశ్మీర్ పండిట్ల ఘటనతో పోలుస్తూ కంగనా చేసిన వ్యాఖ్యలు ఒక మతం, వర్గం వారికి వ్యతిరేకంగా ఉన్నాయని కంగనాపై రెండో కేసు నమోదైంది.మరోవైపు, ఉధ్ధవ్ థాకరేపై కంగనా మాటల దాడి కొనసాగుతూనే ఉంది. అధికారం కోసం బాలా సాహెబ్ థాకరే భావజాలాన్ని అమ్మకానికి పెట్టిన పార్టీ ఇప్పుడు శివసేనగా లేదని..సోనియా సేనగా మారిందంటూ కంగనా రనౌత్ మరో సంచలన ట్వీట్ చేసింది.
This post was last modified on September 10, 2020 11:21 pm
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…