రాబోయే ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీచేయబోయే నియోజకవర్గం విషయంలోసస్పెన్స్ కంటిన్యు అవుతునే ఉంది. ఏ నియోజకవర్గంలో నుండి తాను పోటీచేయబోతున్న విషయాన్ని పవన్ ఇంతవరకు అధికారికంగా ప్రకటించలేదు. దాంతో అనేక నియోజకవర్గాల పేర్లు ప్రచారంలో ఉంటున్నాయి. తాజాగా పిఠాపురం నియోజకవర్గంలోనే పవన్ పోటీచేయబోతున్నారనే ప్రచారం ఊపందుకుంది. ఇంతకుముందు కూడా ఈ నియోజకవర్గంనై ప్రచారం జరిగినా మళ్ళీ ఎందుకో మరుగునపడిపోయింది. అలాంటిది ఇపుడు సడెన్ గా మళ్ళీ ప్రచారం ఊపందుకుంది.
అసలైతే భీమవరంలోనే పవన్ పోటీ అన్నారు. అయితే ఇక్కడినుండి మాజీ ఎంఎల్ఏ పులపర్తి రామాంజనేయులని పోటీచేయమని స్వయంగా పవనే అడిగారు. దాంతో భీమవరంలో పవన్ పోటీచేయటంలేదని తేలిపోయింది. మరి పోటీచేసే ఉద్దేశ్యంలేనపుడు టీడీపీ నేతల ఇళ్ళకు వెళ్ళి మద్దతివ్వమని ఎందుకు అడిగారో అర్ధంకావటంలేదు. టీడీపీ నేతల ఇళ్ళకి పవనే స్వయంగా వెళ్ళి మద్దతు అడగటంతో భీమవరంలో పవనే పోటీచేస్తున్నారనే ప్రచారం పెరిగిపోయింది. సరే ఈ విషయమై క్లారిటి రాగానే పిఠాపురం నియోజకవర్గం పేరు ప్రచారంలోకి వచ్చేసింది.
ఈ నియోజకవర్గం పేరు ఎందుకు ప్రచారంలోకి వచ్చిందంటే పవన్ తన పోటీ విషయమై ఫిబ్రవరి నెలలోనే రెండుసార్లు సర్వే చేయించుకున్నారట. ఈ నియోజకవర్గంలో ప్రత్యేకంగా పవన్ సర్వే చేయించుకుంటున్నారు కాబట్టి ఇక్కడ నుండి పోటీచేసే ఆలోచనలో ఉన్నట్లు పార్టీ నేతలే చెబుతున్నారు. దీనికి ప్రధానకారణం ఏమిటంటే ఇక్కడ కాపు సామాజికవర్గం ఓట్లు ఎక్కువగా ఉండటమేనట. నియోజకవర్గంలో సుమారు 2.5 లక్షల ఓట్లుంటే కాపుల ఓట్లు సుమారు 60 వేలదాక ఉంటుందని అంటున్నారు.
కాపులంతా గంపగుత్తగా ఓట్లేసి ఇతర సామాజికవర్గాల్లోని వాళ్ళు కూడా ఓట్లస్తే పవన్ గెలుపు ఖాయమని సర్వేలో తేలినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. గోదావరి జిల్లాల్లో దశాబ్దాలుగా కాపులకు బీసీలకు ఏమాత్రం పడదు. అలాగే కాపులకు ఎస్సీలకు కూడా పడదు. ఇలాంటి నేపధ్యంలో ఇతర సామాజికవర్గాలు పవన్ కు ఓట్లేస్తాయా అన్నది కీలకమైన పాయింట్. సమాజమంతా కులాల వారీగా ఎప్పుడో చీలిపోయింది. కాబట్టి కులాలకు అతీతంగా అందరు లేకపోతే మెజారిటి జనాలు పవన్ కు ఓట్లేసి గెలిపిస్తారని అనుకునేందుకు లేదు. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.
This post was last modified on March 1, 2024 12:32 pm
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…
గల్లా జయదేవ్.. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంతూరు చంద్రగిరికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తగానే కాకుండా… గుంటూరు…
దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సమావేశం ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లోని పాలకులు, వ్యాపారవర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న సంగతి…