Political News

సెగలు పుట్టిస్తున్న ‘మేడిగడ్డ’ రాజకీయం

తెలంగాణాలో మేడిగడ్డ బ్యారేజి రాజకీయంగా సెగలు పుట్టిస్తోంది. బ్యారేజీ నాసిరకం నిర్మాణం కారణంగా వేల కోట్ల రూపాయల అవినీతి జరగటమే కాకుండా బ్యారేజి ఎందుకూ పనికిరాకుండా పోయిందని రేవంత్ రెడ్డి ప్రభుత్వం తేల్చేసింది. మేడిగడ్డ బ్యారేజి పనికిరాకుండా పోతే దీని ఆధారంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కూడా పనికిరాదని మంత్రులు, ఇంజనీరింగ్ నిపుణులు కూడా ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. రేవంత్ ఆధ్వర్యంలో మేడిగడ్డ బ్యారేజిలో జరిగిన అవినీతిని, నాసిరకం నిర్మాణంపై క్షేత్రస్ధాయి పర్యటన జరిగింది. మంత్రులు, ఇంజనీరింగ్ నిపుణులు బ్యారేజీని ప్రత్యక్షంగా చూసొచ్చారు.

అందుకనే మార్చి 1వ తేదీన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీయార్ నాయకత్వంలో పార్టీకి చెందిన సుమారు 200 మంది నేతలు, ఇంజనీరింగ్ నిపుణులు మేడిగడ్డ బ్యారేజిని సందర్శించబోతున్నారు. తమ సందర్శన ద్వారా బ్యారేజి విషయంలో ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలన్నీ అబద్ధాలేనని చెప్పబోతున్నారు. కేవలం రాజకీయంగా కేసీయార్ ను బద్నాం చేయటం ఒకటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం టార్గెట్ అని కేటీయార్ అండ్ కో ఎదురుదాడి చేయబోతున్నారు.

అయితే వీళ్ళగోల ఇలాగుంటే పార్టీలతో సంబంధం లేని ప్రజాసంఘాలు కూడా మధ్యలో దూరాయి. కేసీయార్ హయాంలో జరిగిన అవినీతిని తాము నిరూపిస్తామని మొదలుపెట్టాయి. కేటీయార్ తమను కూడా తీసుకెళితే బ్యారేజి దగ్గరే కేసీయార్ అవినీతిని నిరూపిస్తామని తెలంగాణా ఉద్యమకారుల ఐక్యవేదిక అధ్యక్షుడు ఎం. రఘుమారెడ్డి సవాలు విసిరారు. కేటీయార్ కు చిత్తశుద్ది ఉంటే తమను కూడా బ్యారేజి దగ్గరకు తీసుకెళ్ళాలని డిమాండ్ చేశారు. కేసీయార్ అవినీతికి పాల్పడకపోతే బ్యారేజి పిల్లర్లు కుంగిపోవటం, బ్యారేజి గోడలకు పగుళ్ళు ఎలాగ వస్తాయని కేటీయార్ ను నిలదీస్తున్నారు.

బ్యారేజీల రాజకీయాన్ని మానుకోవాలని రఘుమారెడ్డి బీఆర్ఎస్ నేతలకు హితవుచెబుతున్నారు. కేసీయార్ హయాంలో జరిగింది ముమ్మాటికి నాసిరకం నిర్మాణాలు కాబట్టి మేడిగడ్డ, కాళేశ్వరం ప్రాజెక్టులు వాడకానికి పనికిరాకుండా పోతున్నాయని మండిపడ్డారు. కేంద్ర జలశక్తి సలహాదారుడు వెదిరే శ్రీరామ్ మాట్లాడుతు కాళేశ్వరం రీ డిజైనింగే పెద్ద తప్పన్నారు. అసలు కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్ర జలసంఘం అనుమతే ఇవ్వలేదని చెప్పారు. మేడిగడ్డ బ్యారేజి నాసిరకం నిర్మాణాన్ని పరిశీలించేందుకు జలశక్తి ఒక నిపుణుల కమిటిని ఏర్పాటుచేసింది. గోదావరి బోర్డు మాజీ ఛైర్మన్ చంద్రశేఖర్ నాయకత్వంలో కమిటి బ్యారేజిని పరిశీలించబోతోంది.

This post was last modified on March 1, 2024 12:30 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఆరెంజ్ హీరోయిన్ పెళ్లి కుదిరింది

అదేంటి జెనీలియా ఎప్పుడో వివాహ బంధంలో అడుగు పెట్టింది కదాని ఆశ్చర్యపోకండి. మ్యాటర్ తన గురించి కాదు. ఆరంజ్ ఫ్లాష్…

43 mins ago

పుష్ప 2 హంగామా వేరే లెవెల్

టాలీవుడ్ కే కాదు మొత్తం అన్ని భాషల ప్రేక్షకులు విపరీతంగా ఎదురు చూస్తున్న పుష్ప 2 ది రూల్ కౌంట్…

46 mins ago

కాంట్రాక్లర్ల జీవితాలు జగన్ నాశనం చేశాడు

విశాఖలో 500 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చుపెట్టి రుషికొండ ప్యాలెస్ కట్టిన జగన్ పై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు…

47 mins ago

ఓట్ల కోసం రాలేదు.. మరాఠా గడ్డపై పవన్

మహారాష్ట్ర డెగ్లూరులో ఎన్డీయే అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆకట్టుకునే ప్రసంగంతో…

49 mins ago

ధనుష్ మీద భగ్గుమన్న నయనతార

కోలీవుడ్ టాప్ హీరోయిన్ నయనతారకు కోపం వచ్చింది. హీరో ధనుష్ మీద తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ మూడు పేజీల…

4 hours ago

అకీరా సంగీతానికి తమన్ గైడెన్స్

పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న అకీరానందన్ తెరంగేట్రం కన్నా ముందు అతని సంగీతం వినే అవకాశం దక్కేలా…

7 hours ago