జనసేన పార్టీకి మరో స్టార్ క్యాంపెయినర్ రెడీ అయ్యారు. అది కూడా మెగా కుటుంబం నుంచే కావడం గమ నార్హం. వచ్చే ఎన్నికల్లో జనసేనను అధికారంలోకి తీసుకువచ్చేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని కూడా చెప్పడం విశేషం. అయితే.. ఆ స్టార్ క్యాంపెయినర్.. మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె కొణిదెల నిహారిక. తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.
బాబాయి(జనసేనాని పవన్)తో కలిసి అనేక సందర్భాల్లో రైతులను కలిశారు. వారి కష్టాలు విన్నాను. వారి సమస్యలు తెలుసుకున్నాను. అప్పటి నుంచే నాకు రాజకీయాలపై ఆసక్తి పెరిగింది. గత ఎన్నికల్లోనూ ప్రచారం చేస్తానని చెప్పాను. కానీ, ఎందుకో ఒప్పుకోలేదు. ఆ తర్వాత కూడా పార్టీ కార్యక్రమాలపై దృష్టి పెట్టాను. ఇప్పుడు కూడా బాబాయి తరఫున ప్రచారం చేసేందుకు నేను సిద్ధంగానే ఉన్నాను అని నిహారిక వెల్లడించారు.
తన ఓటు ఏపీలోనే ఉన్నదన్న ఆమె.. గత ఏడాది కూడా ఓటు వేసినట్టు తెలిపారు. ఇప్పుడు కూడా ఏపీ లోనే ఓటు వేయనున్నట్టు తెలిపారు. మార్పు కోసం పవన్ చేస్తున్న ప్రయత్నాలకు యువత కలిసి రావాల ని ఆమె పిలుపునిచ్చారు. ఏపీ రాజకీయాలను తాను ఆసక్తిగా గమనిస్తున్నానని చెప్పారు. ఏపీలో రాజకీయ మార్పు కోరుకుంటున్నట్టు తెలిపారు. అయితే.. దీనికి బాబాయి తరఫున మెగా కుటంబం కూడా కదులుతుందని ఆమె ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
ఇదిలావుంటే, వచ్చే ఎన్నికల్లో ప్రచారానికి మెగా స్టార్ రామ్ చరణ్‌కూడా వచ్చేందుకు సిద్ధంగానే ఉన్నారు. అయితే.. పవన్ ఆయనను నిలువరిస్తున్న విషయం తెలిసిందే. ఇక, ఇప్పటికే నాగబాబు ప్రచారంంలో ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కాకపోయినా.. తన నియోజకవర్గం వరకు ఆయన ప్రచారంలో ముమ్మరంగానే తిరుగుతున్నారు.
This post was last modified on March 1, 2024 8:01 am
గత కొన్నేళ్లుగా మినిమమ్ హిట్ లేకుండా అభిమానులను హర్ట్ చేస్తున్న మాస్ మహారాజా రవితేజ ఈసారి పూర్తిగా రూటు మార్చి…
నిన్న మొన్నటి వరకు కారాలు మిరియాలు నూరుకున్న నాయకులు..ఇప్పుడు ఎంచక్కా చేతులు కలిపారు. సంక్రాంతి పుణ్యమా అని.. రాష్ట్రంలోని ఉభయగోదావరి…
దేశవ్యాప్తంగా వీధికుక్కల దాడులు పెరుగుతున్న నేపథ్యంలో జరిగిన విచారణలో సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మానవ ప్రాణాల భద్రతకు…
ప్రతి అభిమానికీ తన ఆరాధ్య కథానాయకుడిని తెరపై ఒకలా చూసుకోవాలనే ఆశ ఉంటుంది. తన హీరో బలాన్ని గుర్తించి.. తన…
రాజకీయాలలో ప్రజలకు అవసరమైన పనులు చేయడం ఎంత ముఖ్యమో… అందుకు సంబంధించిన క్రెడిట్ తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. అయితే,…
అభిమానానికి ఏదీ అడ్డు కాదు అనడానికి ఇది ఉదాహరణ. కంటి చూపు లేని ఒక వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి మీద…