టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ కావడాన్ని తట్టుకోలేక మృతిచెందిన కార్యకర్తల కుటుంబాలను నిజం గెలవాలి పేరుతో ఆయన సతీమణి నారా భువనేశ్శరి పరామర్శిస్తున్నారు. ఇప్పటివరకూ 8 టూర్లలో కార్యకర్తల కుటుంబాలకు భువనేశ్వరి చెక్కులు ఇచ్చి ఆర్థిక సహాయం చేశారు. ఈ క్రమంలో కార్యకర్తల కుటుంబాలకు సాయం చేయడంలో భువనేశ్వరి అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఇప్పటి వరకు ఇంటికే పరిమితమైన ఆమె.. రాజకీయంగా కూడా దూకుడు పెంచారు. వైసీపీని అంతం చేసేందుకు కలిసి రావాలని పిలుపునిస్తున్నారు.
దీంతో నిజం గెలవాలి యాత్రలకు జోష్ పెరిగింది. వాస్తవానికి ఈ షెడ్యూల్ మార్చి 1నే ముగిసిపోవాల్సి ఉంది. అయితే.. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని.. దీనిని మరింతగా ముందుకు తీసుకువెళ్లాలని టీడీపీ నిర్ణయించింది. ఎన్నికల షెడ్యూల్ వచ్చే వరకు అంటే.. మరో రెండు వారాల పాటు దీనిని కొనసాగించ నున్నారు. దీంతో క్షేత్రస్తాయిలో మహిళలను తమవైపు తిప్పుకొనే అవకాశం ఉంటుందని టీడీపీ అధిష్టానం భావిస్తోంది.
ఇక, ఈ నిజంగెలవాలి యాత్ర ద్వారా బాధితులకు రూ.3 లక్షల చొప్పున చేస్తున్న సాయం విషయంలోనూ విధానాన్ని మార్చేశారు. పరామర్శకు వెళ్లకముందే కార్యకర్తల కుటుంబాల అకౌంట్స్ లోకి సాయాన్ని జమ చేస్తున్నారు. దాంతో కార్యకర్తల కుటుంబాలు చెక్కులను బ్యాంకులకు తీసుకెళ్లే పని లేకుండా సాయం అందిస్తున్నారు. ఇప్పటివరకూ బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి భువనేశ్వరి చెక్కులు అందజేశారు. ఇకనుంచి పరామర్శకు వెళ్లేముందు బాధిత కార్యకర్తల కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాలో ఆర్థిక సాయాన్ని జమ చేయాలని నిర్ణయించారు.
దీంతో చెక్కులను బ్యాంకులో డిపాజిట్ చేసే పని లేకుండా.. నేరుగా బ్యాంకు కు వెళ్లి డబ్బులు తెచ్చుకు నేలా విధానాన్ని సరళతరం చేశారు. కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించి, ఆర్ధిక సాయాన్ని అందించిన విషయాన్ని తెలిపే లెటర్ ను మాత్రం ఇవ్వనున్నారు. భువనేశ్వరి ఇచ్చే లెటర్ లో కార్యకర్తల పట్ల పార్టీ, పార్టీ అధినేత, కుటుంబ సభ్యుల నిబద్దతను తెలిపేలా వివరాలను పొందుపరిచారు. మొత్తానికి ఎన్నికల షెడ్యూల్ వరకు.. ఎలాంటి నిబంధనలు లేనందున దీనికి పొడిగింపు ఇవ్వడం గమనార్హం.
This post was last modified on February 29, 2024 7:30 pm
ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…
విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…
వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…
ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…
ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…
వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి సంచలన ఆరోపణలు చేస్తున్న సునీల్ యాదవ్ వ్యవహారం…