Political News

సెంటిమెంటునే ఫాలో అవుతున్నారా ?

రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కేసీఆర్ సెంటిమెంటునే ఫాలో అవ్వాలని డిసైడ్ అయ్యారట. ఎలాగంటే మార్చి 10వ తేదీన కరీంనగర్లో పార్లమెంటు ఎన్నికల బహిరంగ సభలో పాల్గొనటం ద్వారా. కేసీయార్ కు సెంటిమెంట్లు చాలా ఎక్కువన్న విషయం తెలిసిందే. పూజలు, యాగాలు, హోమాలు చేయిస్తునే ఉంటారు. ఇపుడు విషయం ఏమిటంటే ఎన్నికలు ఏవైనా సరే కరీంనగర్ జిల్లా నుండే బహిరంగ సభలు నిర్వహించడం సెంటిమెంటు. కరీంనగర్ జిల్లాలోని హుస్నాబాద్ బహిరంగసభతోనే కేసీయార్ ఎన్నికల శంకారావాన్ని పూరిస్తారు.

మొన్నటి అసెంబ్లీ ఎన్నికల బహిరంగసభలను కూడా హుస్నాబాద్ నుండే ప్రారంభించిన విషయం గుర్తుండే ఉంటుంది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓడిపోయింది. అయినా సరే ఏమాత్రం వెనక్కు తగ్గకుండా రాబోయే పార్లమెంటు ఎన్నికల బహిరంగసభలను కూడా హుస్నాబాద్ లేదా కరీంనగర్ నుండే మొదలుపెట్టాలని డిసైడ్ అయ్యారట. మొన్నటి నల్గొండ బహిరంగసభ జస్ట్ శాంపుల్ మాత్రమే అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లోల ఓడిపోయిన రెండురోజే కేసీయార్ బాత్ రూంలో పడటంతో తుంటిఎముక విరిగింది. దానికి ఆపరేషన్ చేసిన డాక్టర్లు ఆరువారాలు విశ్రాంతి అవసరమని చెప్పారు.

డాక్టర్లు చెప్పినట్లుగా విశ్రాంతి తీసుకున్న కేసీయార్ ట్రయల్లాగ నల్గొండ సభలో పాల్గొన్నారట. అందుకే బహిరంగసభకు కేసీయార్ వీల్ ఛైర్లోనే హాజరయ్యారు. అసలు కేసీయార్ విషయంలో జరుగుతున్న ప్రచారం ఏమిటంటే ఇకనుండి కేసీయార్ పూర్తిగా రెస్ట్ తీసుకుంటారని. అందుకనే పార్టీ వేదికల మీద కూడా పెద్దగా కనబడటంలేదు. రేపు మార్చి 1వ తేదీన ఛలో మేడిగడ్డ కార్యక్రమంలో కూడా కేసీయార్ పాల్గొనటంలేదు.

పార్టీ తరపున చేస్తున్న పర్యటనల్లో కూడా కేటీయార్, హరీష్ ఎక్కడా పొరబాటున కూడా కేసీయార్ ప్రస్తావన తేవటంలేదు. చాలాకాలం తర్వాత ఫాంహౌజ్ లో కేటీయార్, హరీష్, కవితతో కేసీయార్ చాలాసేపు భేటీ అయినట్లు పార్టీవర్గాలు చెప్పాయి. మేడిగడ్డ కార్యక్రమానికి సంబంధించి మాట్లాడినపుడు కూడా కేటీయార్ ఎక్కడా కేసీయార్ ప్రస్తావన తేలేదు. అందుకనే కేసీయార్ పూర్తిగా రెస్టులోకి వెళిపోతున్నారనే ప్రచారం పెరిగిపోతోంది. అయితే పార్టీవర్గాల సమాచారం ఏమిటంటే పార్లమెంటు ఎన్నికల తర్వాత రెస్టు తీసుకునే అవకాశముందట. మరి చివరకు ఏమవుతుందో చూడాలి.

This post was last modified on February 29, 2024 3:44 pm

Share

Recent Posts

సిరిసిల్ల కాదు.. ఉరిసిల్ల‌.. రెచ్చిపోయిన రేవంత్‌రెడ్డి

టార్గెట్ కేటీఆర్.. ల‌క్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. బీఆర్ఎస్ నాయ‌కుడు, మాజీ మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న…

41 minutes ago

సూపర్ హిట్ హీరోల విచిత్ర పరిస్థితి

ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…

3 hours ago

చంద్రబాబు సభ సమీపంలో పేలుడు!

విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…

5 hours ago

కుల పిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా… మతపిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా

వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…

5 hours ago

వాల్యూమ్ పెంచండి జైలర్ సాబ్

ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…

6 hours ago

మహాకాల్… ఊహించని కాంబినేషన్

ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…

7 hours ago