ఏపీలో ఎన్నికల సందడి పెరిగింది. దీంతో టికెట్ల కేటాయింపు కూడా దాదాపు కొలిక్కి వస్తోంది. ఈ క్రమంలో అటు వైసీపీ, ఇటు టీడీపీలు.. సర్వేలు, అభ్యర్థుల గుణ గణాలు, ఆర్థిక పరిస్థితి వంటివాటిని బేరీజు వేసుకుని టికెట్లు కేటాయిస్తున్నాయి. ఇక, ఇప్పుడు కాంగ్రెస్ వంతు వచ్చింది. ఈ పార్టీ కూడా.. అభ్యర్థుల ఎంపికపై దృష్టిసారించింది. ఇప్పటికే ఆశావాహుల నుంచి దరఖాస్తులు స్వీకరించిన కాంగ్రెస్ పార్టీ ఇంటర్వూ చేసేందుకు రెడీ అయింది.
విజయవాడలోని ఆంధ్రరత్న భవన్‌లో టికెట్లు ఆశిస్తూ.. దరఖాస్తు చేసుకున్న వారిని షర్మిలగా కలవను న్నారు. షర్మిల రాకతో చాలారోజుల తర్వాత కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు కళకళలాడుతున్నాయి. దీంతో వచ్చే ఎన్నికల్లో పోటీచేయాలని ఆసక్తి ఉన్నవారి నుంచి కాంగ్రెస్ దరఖాస్తులు ఆహ్వానించింది. తొలిరోజే పెద్దఎత్తున ఆశావహులు దరఖాస్తు చేసుకున్నారు. జనవరి 24 నుంచి ఇప్పటి వరకు 175 అసెంబ్లీ స్తానాలకు 420 వరకు దరఖాస్తులు వచ్చాయి,
అయితే, కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ వారికి చెరో 15 లేదా 20 సీట్లు కేటాయించినా.. మిగిలిన స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేసే క్రతువును ప్రారంభించింది. ఈ క్రమంలో షర్మిల ఆయా అభ్యర్థలతో ముఖాముఖి నిర్వహించనున్నారు. తొలిరోజు నర్సాపురం, ఏలూరు, నరసరావుపేట, బాపట్ల, గుంటూరు, మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని ఆశావాహులతో చర్చలు జరపనున్నారు. ఈ పార్లమెంట్ స్థానాల పరిధిలో ఉన్న 49 అసెంబ్లీ నియోజక వర్గాలలో పోటీ చేసేందుకు 280 మంది అప్లికేషన్ పెట్టుకున్నారు.
మిగతా 9 పార్లమెంట్ స్థానాల పరిధిలో ఉన్న 63 అసెంబ్లీ నియోజక వర్గాల దరఖాస్తుదారులతో శుక్రవారం మాట్లాడనున్నారు. ఈ క్రమంలో అభ్యర్థుల గుణగణాలు, ఆర్థిక పరిస్థితులు, గెలువు అవకాశాలు, పార్టీకి కమిట్ మెంట్ ఇలా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్టు తెలుస్తోంది. అయితే.. పాతకాపులకు ప్రాధాన్యం దక్కుతుందని, అదేవిధంగా అధిష్ఠానం ఆశీస్సులు ఉన్నవారికి నేరుగా టికెట్లు ఇవ్వచ్చని సమాచారం.
This post was last modified on February 29, 2024 1:57 pm
ప్రముఖ వ్యాపార వేత్త, ప్రపంచ కుబేరుడు గౌతం అదానీ.. ఏపీలో సౌర విద్యుత్కు సంబంధించి చేసుకున్న ఒప్పందాల వ్యవహారంలో అప్పటి…
సోలార్ విద్యుత్ ఒప్పందాల నేపథ్యంలో అదానీ గ్రూప్ పై లంచం ఇచ్చారన్న ఆరోపణలు రావడం కలకలం రేపిన సంగతి తెలిసిందే.…
ఐపీఎల్ 2025 కోసం జరుగుతున్న ఆటగాళ్ల వేలంలో బీహార్ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ మెగా…
టీడీపీ నాయకుడు, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తీరు మారలేదు. ప్రస్తుతం ఉన్న నాయకుల్లో చాలా మంది ఫొటోలకు ఫోజులు…
ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి తన మార్క్ నిర్ణయాలతో ప్రశంసలు అందుకుంటోన్న సంగతి తెలిసిందే.…
జనసేన నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డిపై వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన…