Political News

‘ఇబ్బందులు ప‌డుతున్నా.. రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొంటా’

“అవ‌స‌ర‌మైతే రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొంటా. ఇప్ప‌టికే అన్ని విధాలా స‌ర్దుకుని రాజ‌కీయాల్లో ఉన్నా. పైగా ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ చేస్తున్న వ్యాఖ్య‌లు న‌న్ను తీవ్రంగా బాధిస్తున్నాయి” అని వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మె ల్యే బాలినేని శ్రీనివాస‌రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తాను ఒంగోలు పేద ప్ర‌జ‌ల కోసం ఇళ్ల ప‌ట్టాలను ఇవ్వాల‌ని అడిగాన‌ని.. ఇది త‌న స్వార్థం కోసం కాద‌ని బాలినేని చెప్పారు. అయితే.. ఇదేదో త‌న ఇంట్లో కార్య‌క్ర‌మం మాదిరిగా కొంద‌రు వ్యాఖ్యానిస్తున్నార‌ని.. పార్టీకి చెడు సంకేతాలు ఇచ్చార‌ని బాలినేని విమ‌ర్శించారు.

తాజాగా మీడియాతో మాట్లాడిన బాలినేని.. సీఎం జ‌గ‌న్‌పైనా ప‌రోక్షంగా విమ‌ర్శ‌లు చేశారు. “నేను సీఎం జగన్‌ని ఏదైనా అడిగితే వాసు అలిగాడని అంటున్నారు” అని వ్యాఖ్యానించారు. తాను అలిగింది ప్రజల కోసమేన‌ని చెప్పారు. అది కూడా గూడు లేని ప్ర‌జ‌ల కోస‌మేనని, రాష్ట్ర వ్యాప్తంగా 33 ల‌క్ష‌ల మందికి ఇళ్లు ఇచ్చిన మ‌న పార్టీ.. కేవ‌లం 25 వేల మందికి ఇళ్లు ఇవ్వ‌లేక‌పోతే.. న‌గుబాటు త‌ప్ప‌ద‌ని అలిగాన‌ని చెప్పారు. “ఒంగోలు నియోజ‌క‌వ‌ర్గంలోని 25 వేల మంది పేద‌ల‌కు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని హైదరాబాద్‌లో కూర్చున్నా. దీనిని సీఎం స‌హా అంద‌రూ త‌ప్పుబ‌ట్టారు. వాసు వస్తే గట్టిగా అడుగుతున్నాడని సీఎం ఇంటెలిజెన్స్ అధికారులతో అంటున్నారు” అని బాలినేని చెప్పారు.

ప్రజల్లో జరుగుతున్న విషయాలు సీఎంకి చెప్పకపోతే చాలా ఇబ్బందులు వ‌స్తాయ‌ని బాలినేని వ్యాఖ్యానించారు. సీఎం దగ్గర అందరిలాగా తాను డబ్బాలు కొట్టన‌ని, క‌నీసం పొగిడే ప్ర‌య‌త్నం కూడా చేయ‌న‌ని చెప్పారు. అయితే.. ఇలా చేయ‌క‌పోవ‌డం వ‌ల్ల చాలానే కోల్పోయాన‌ని.. అయినా ఇది ఇష్ట‌మేన‌ని.. అయిన వారికి ఏమీ చేయ‌లేక పోయాన‌ని.. ప‌రోక్షంగా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డికి టికెట్ ఇప్పించుకోలేక పోయిన విష‌యాన్ని ఆయ‌న ప్ర‌స్తావించారు. టికెట్ ఇవ్వ‌నందునే మాగుంట శ్రీనివాసుల రెడ్డి కుటుంబం టీడీపీలోకి వెళ్తోంద‌ని చెప్పారు. ఇది ఎఫెక్ట్ చూపిస్తందుని బాలినేని వ్యాఖ్యానించారు.

నేను వెళ్ల‌ను!

మాగుంట‌కు టికెట్ ఇవ్వాలని ప‌ట్టుబ‌ట్టిన మాట వాస్త‌వ‌మేన‌ని బాలినేని చెప్పారు. అయితే, ఆయ‌న‌కు ఇవ్వలేద‌ని.. దీంతో ఆయ‌న త‌న దారి తాను చూసుకున్నార‌ని.. ఇప్పుడు తాను కూడా టీడీపీలోకి వెళ్తాన‌ని కొంద‌రు ప్ర‌చారం చేస్తున్నార‌ని.. అలా ఎప్ప‌టికీ జ‌ర‌గ‌ద‌ని.. అవ‌స‌ర‌మైతే.. రాజకీయాల‌నుంచి త‌ప్పుకొంటాన‌ని బాలినేని చెప్పారు. త‌న మ‌న‌సుకు న‌చ్చే పార్టీలో ఉంటున్నాన‌ని..పార్టీకి ద్రోహం చేసే మనస్తత్వం త‌న‌ది కాద‌ని చెప్పారు. వ‌చ్చే ఎన్నిక‌లే త‌న‌కు చివ‌రి ఎన్నిక‌ల‌ని.. ఆపై తాను ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటాన‌ని బాలినేని చెప్పారు.

This post was last modified on February 28, 2024 10:20 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

విజయమ్మ లాజిక్ తో జగన్ కు కఫ్టమే

వైైసీపీ అదినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆయన కన్న తల్లి విజయమ్మ నుంచే భారీ…

13 minutes ago

రెడ్ బుక్ వ‌ద‌ల‌: మ‌రోసారి లోకేష్ స్ప‌ష్టం

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌.. రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం ప‌నిచేస్తోంద‌ని ఆరోపించిన కొన్ని గంట‌ల వ్య‌వ‌ధిలోనే టీడీపీ యువ‌నాయ‌కుడు,…

1 hour ago

క్రేజీ దర్శకుడు హీరో అయితే ఎలా

సౌత్ దర్శకుల్లో రాజమౌళి, సుకుమార్, త్రివిక్రమ్ తర్వాత అంతకన్నా తక్కువో ఎక్కువో స్టార్ డం తెచ్చుకున్న వాళ్లలో లోకేష్ కనగరాజ్…

5 hours ago

కబుర్లన్నీ చెప్పి ఇదేంటి అమీర్ సాబ్

ఇటీవలే జరిగిన ఒక ఈవెంట్ లో అమీర్ ఖాన్ మాట్లాడుతూ థియేటర్ ఓటిటి మధ్య ఇప్పుడున్న గ్యాప్ సరిపోదని నాలుగు…

8 hours ago

ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చు – జగన్

రాష్ట్రంలోని 25 పార్లమెంటు నియోజకవర్గాల ఇంచార్జ్‌లను మార్చనున్నట్లు వైసీపీ అధినేత జగన్ చెప్పారు. అయితే దీనికి కొంత సమయం పడుతుందన్నారు.…

11 hours ago

థ్యాంక్స్ మోదీజీ: మధుసూదన్ భార్య కామాక్షి!

పహల్ గాం ఉగ్రవాద దాడి తదనంతర పరిణామాల్లో భాగంగా మంగళవార తెల్లవారుజామున భారత త్రివిధ దళాలు పాకిస్తాన్ భూభాగంలోని ఆ దేశ…

12 hours ago