పార్లమెంటు ఎన్నికలకు కేవలం 40 రోజుల సమయం మాత్రమే ఉందని తెలుస్తోంది. ఈ లోగానే షెడ్యూల్ కూడా వచ్చేసేందుకు రెడీగా ఉంది. అయితే.. ఇంతలోనే తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్‌లో కలకలం రేగింది. పార్టీని పట్టించుకోవడం లేదని.. ఎన్నికలకు సమాయత్తం చేయడం లేదని.. పార్టీ పరిస్థితి అగమ్యంగా ఉందని నేతల మధ్య గుసగుస వినిపిస్తోంది. ఇలాంటి సమయంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ముఖ్య నేత, ఎంపీ ఒకరు పార్టీ నుంచి జంప్ చేసేశారు.
నాగర్‌కర్నూల్ ఎంపీ, బీఆర్ఎస్ నేత పోతుగంటి రాములు ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. నేడు ఆయన బీజేపీలో చేరారు. బీఆర్‌ఎస్‌లో ఇటీవల తనకు ఎదురైన పరిణామాలు తనను అవమానపరిచేలా ఉన్నాయని ఎంపీ రాములు భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ లేదా బీజేపీలో చేరతారని ఊహాగానాలు వచ్చినప్పటికీ.. ఆయన తాజాగా బీజేపీలో చేరారు. వాస్తవానికి బీజేపీపై యుద్ధం ప్రకటిస్తున్నామని కీలక నేతలు .. చెప్పుకొచ్చారు. అయితే.. ఇంతలోనే ఎంపీ పార్టీ మారి కమలం గూటికి చేరుకోవడంతో షాక్ తగిలినంత పనిజరిగింది.
టికెట్ కోసమేనా?
కాగా, పోతుగంటి రాములు బీఆర్ ఎస్ నుంచి బీజేపీలోకి చేరడం వెనుక కేవలం టికెట్ కోసమేననే వాదన బలంగా వినిపిస్తోంది. ప్రస్తుతం బీఆర్ ఎస్‌లో సిట్టింగు ఎంపీలను మారుస్తామని… ప్రజల అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకుంటామని మాజీ మంత్రి కేటీఆర్ ఇటీవల ప్రకటించారు. ఇక, కొన్నాళ్ల కిందట కేటీఆర్ నాగర్ కర్నూలులో పర్యటించినప్పుడు ఎంపీగా ఉన్న రాములుకు సమాచారం ఇవ్వలేదు. దీంతో తనకు టికెట్ వచ్చే అవకాశం లేదని.. రాములు అప్పట్లోనే కామెంట్లు చేశారు. ఈ నేపథ్యంలో కనీసం ఎలాంటి ముందస్తుసమాచారం లేకుండానే ఆయన బీజేపీ కండువా కప్పుకోవడం గమనార్హం.
This post was last modified on February 28, 2024 2:21 pm
కోలీవుడ్ టాప్ హీరోయిన్ నయనతారకు కోపం వచ్చింది. హీరో ధనుష్ మీద తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ మూడు పేజీల…
పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న అకీరానందన్ తెరంగేట్రం కన్నా ముందు అతని సంగీతం వినే అవకాశం దక్కేలా…
రీల్స్ చేయటం ఇవాల్టి రోజున కామన్ గా మారింది. చిన్నా.. పెద్దా అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరు తమకున్న…
అభిమానుల దృష్టి ఓజి మీద విపరీతంగా ఉండటం వల్ల హైప్ విషయంలో హరిహర వీరమల్లు కొంచెం వెనుకబడినట్టు అనిపిస్తోంది కానీ…
టాలీవుడ్లో మెగా హీరోలకు ఉన్న ఫ్యాన్ సపోర్ట్ ఇంకెవరికీ ఉండదనే అభిప్రాయాలున్నాయి. ముందు తరంలో ముందు మెగాస్టార్ చిరంజీవి, ఆ…
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…