ఏపీ అధికార పార్టీ వైసీపీకి ఎన్నికలకు ముందు హైకోర్టులో దెబ్బమీద దెబ్బ తగులుతోంది. వరుసగా హైకో ర్టు సర్కారుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మంగళవారం రాజధాని అమరావతి విషయంపై కీలక తీ ర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. రైతులకు గత చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన ఫ్లాట్లను రద్దు చేయడా నికి వీల్లేదని తేల్చి చెప్పింది. ఇది ఎన్నికలకు ముందు వైసీపీకి భారీ ఎఫెక్ట్. ఇక, ఇప్పుడు కీలకమైన మైనింగ్‌పైనా హైకోర్టు వార్నింగ్ ఇచ్చింది.
గుంటూరు జిల్లా, చేబ్రోలు మండలం, వీరంకినాయుడు పాలెంలో జరుగుతున్న ఇసుక అక్రమ తవ్వకాలపై హైకోర్టు కన్నెర్ర చేసింది. ఈ అక్రమాలపై దాఖలైన పిటిషన్‌ను విచారించిన హైకోర్టు.. డీకే పట్టా భూముల్లో మైనింగ్ ఎలా చేస్తారని సర్కారును ప్రశ్నించింది. ఇసుక, మట్టి, ఇతర ఖనిజాల విషయంలో జరుగుతున్న అక్రమాలపై తమకు వందల కొద్దీ పిటిషన్లు వస్తున్నాయని వ్యాఖ్యానించింది. ఇంత జరుగుతున్నా.. ప్రభుత్వం ఏం చేస్తోందని నిలదీసింది.
బెంచ్ పాయింట్ ఔట్ చేస్తున్నా ఎందుకు స్పందించడం లేదని ప్రభుత్వ న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది. రెండు వారాల్లో స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలని మైనింగ్ శాఖను హైకోర్టు ఆదేశించింది. అయితే రెండు వారాల సమయం చాలదని ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. దీంతో ఏదైనా ఉపగ్రహానికి వెళ్లి రిపోర్ట్ తేవాలా అని కోర్టు ప్రశ్నించడం గమనార్హం. మైనింగ్ శాఖ ఇచ్చే నివేదికలో తేడా ఉంటే అధికారులపై తగిన చర్యలు తీసుకోక తప్పదని వ్యాఖ్యానించింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వానికి చెంప పెట్టుగా ఉన్నాయని ప్రతిపక్షాలు వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం.
This post was last modified on February 28, 2024 2:18 pm
వైసీపీ పాలనా కాలంలో తిరుమల శ్రీవారి పరకామణిలో 900 డాలర్ల చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఈ పరిణామం తిరుమల…
నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…