రాబోయే ఎన్నికల్లో తెలంగాణ నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధి పోటీ చేయబోతున్నారా ? పార్టీ వర్గాల సమాచారం ప్రకారం పోటీ చేసేందుకు అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ మధ్య ఢిల్లీలో రాహుల్ ను రేవంత్ రెడ్డితో పాటు చాలామంది మంత్రులు కలిశారు. ఆ సమయంలో తెలంగాణా నుంచి పోటీచేయాలని ఆహ్వానించినట్లు సమాచారం. తెలంగాణాలోని ఖమ్మం, భువనగిరి లేదా నల్గొండలో ఎక్కడ నుంచి పోటీ చేసినా గెలుపు ఖాయమని రాహుల్ కు రేవంత్ అండ్ కో గ్యారంటీ ఇచ్చారట.
నిజానికి ఖమ్మం నుంచి సోనియాగాంధీని పోటీచేయాలని మొదట్లో రేవంత్ అండ్ కో పీసీసీ ఆధ్వర్యంలో ఒక తీర్మానం చేసి పంపారు. దాన్ని ఏఐసీసీ కీలక వ్యక్తులు పరిశీలించారు కూడా. అయితే సోనియా అనారోగ్యం కారణంగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండకూడదని డిసైడ్ చేసుకున్నారు. అందుకనే రాబోయే ఎన్నికల్లో పోటీచేసే ఆలోచనలో ఉన్నట్లు సోనియా స్పష్టంచేశారు. పోటీ నుంచి తప్పుకుంటున్న కారణంగానే తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్ లోని అమేథి స్ధానంలో కూతురు ప్రియాంకను పోటీచేయిస్తున్నట్లు చెప్పారు.
సోనియా పోటీకి దూరమని తెలియగానే వెంటనే చాలామంది ప్రియాంక పేరును ప్రస్తావించారు. అయితే ప్రియాంక అమేథిలో పోటీ చేయబోతున్నారని తేలిపోయిన తర్వాత ఎవరు మాట్లాడలేదు. అలాంటిది ఇపుడు సడెన్ గా రాహుల్ పేరు ప్రస్తావన పెరిగిపోతోంది. ఎందుకంటే ఇపుడు రాహుల్ కేరళలోని వాయనాడుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే వాయనాడు నుండి రాబోయే ఎన్నికల్లో సీపీఐ ప్రధాన కార్యదర్శి డీ రాజా భార్య పేరును ఆ పార్టీ ప్రకటించేసింది. అంటే వచ్చేఎన్నికల్లో వాయనాడు నుండి రాహుల్ పోటీ చేయడం లేదని తేలిపోయింది.
మరి అమేథిలో పోటీచేయక, వాయనాడులోనూ పోటీ చేయకపోతే రాహుల్ ఎక్కడ నుండి పోటీ చేస్తారు ? అందుకనే తెలంగాణా నేతలు రాహుల్ ను తెలంగాణా నుండి పోటీ చేయమని ఆహ్వానిస్తున్నారు. పైన చెప్పిన మూడు నియోజకవర్గాల్లో ఎక్కడి నుండి పోటీచేసినా గెలుపు ఖాయమని కూడా చెప్పారట. సోనియా కుటుంబంలో నుండి ఎవరో ఒకరిని పోటీచేయించాలన్నది తెలంగాణా కాంగ్రెస్ నేతలు పట్టుదలగా ఉంది. మరి రాహుల్ స్పందన ఎలాగుంటుందో చూడాలి. పోటీ చేస్తే మాత్రం పార్టీకి మంచి ఊపు ఖాయమని పార్టీ అనుకుంటోంది. చివరకు ఏమవుతుందో చూడాలి.
This post was last modified on February 28, 2024 11:07 am
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…
మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…
తమిళ దిగ్గజ నటుడు, తమిళగ వెట్రి కగళం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ వ్యవహారం.. మరింత ముదురుతోంది. గత ఏడాది సెప్టెంబరు 27న…
రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత గ్రామం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.…
గత కొన్నేళ్లుగా మినిమమ్ హిట్ లేకుండా అభిమానులను హర్ట్ చేస్తున్న మాస్ మహారాజా రవితేజ ఈసారి పూర్తిగా రూటు మార్చి…