Political News

ష‌ర్మిల ఫ‌స్ట్ మీటింగ్‌.. కాంగ్రెస్‌కు జోష్ పెరిగిన‌ట్టేనా?

ఏపీ పీసీసీ చీఫ్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టిన వైఎస్ ష‌ర్మిల ప్ర‌తిష్టాత్మకంగా తీసుకుని నిర్వహించిన‌.. తొలి ఎన్నికల స‌భ ఫుల్లుగా స‌క్సెస్ అయింద‌నే భావ‌న రాజ‌కీయ వ‌ర్గాల్లో వినిపిస్తోంది. అనంత‌పురంలో సోమవారం రాత్రి నిర్వ‌హించిన న్యాయ సాధ‌న స‌భ‌ ఆ పార్టీలో జోష్ నింపింది. అయితే.. అదేస‌మ‌యంలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షాలు స‌హా అధికార పార్టీలో గుబులు రేపుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు.. కాంగ్రెస్ ఓటు బ్యాంకు చీలితే.. తాము ల‌బ్ధి పొందుతామ‌ని.. ప్ర‌తిప‌క్షాలు అంచ‌నా వేసుకున్నాయి.

అదేస‌మ‌యంలో అధికార పార్టీ కూడా.. ఎవ‌రు వ‌చ్చినా.. త‌మ ఓటు బ్యాంకు చీల‌ద‌ని అంచ‌నాలు వేసు కుంది. కానీ, ష‌ర్మిల నేతృత్వంలో నిర్వ‌హించిన స‌భ‌కు దాదాపు 20 వేల మంది పైచిలుకు జ‌నాభా హాజ‌ర‌య్యారు. వాస్త‌వానికి ఈ స‌భ‌ను స్థానిక నాయ‌కులు లైట్ తీసుకున్నారు. ఏం పుంజుకుంటుందిలే.. అనుకున్నారు. అందుకే.. కేవ‌లం రెండు రోజుల ముందు మాత్ర‌మే ఏర్పాట్లు చేశారు. ఎందుకంటే.. ష‌ర్మిల దాదాపు త‌న కుమారుడి వివాహం నేప‌థ్యంలో వారానికిపైగా రాష్ట్రానికి దూరంగా ఉన్నారు.

దీంతో కీల‌క నాయ‌కులు కూడా.. పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. అయిన‌ప్ప‌టికీ.. 20 వేల మంది హాజ‌ర‌య్యార‌ని అంచ‌నా ఉంది. ఇక‌, ప‌ట్టుద‌ల‌తో కూర్చుని ప్ర‌య‌త్నాలు చేస్తే.. మున్ముందు స‌భ‌ల‌కు జ‌న‌స మీక‌ర‌ణ చేస్తే.. ఈ సంఖ్య మూడు రెట్లు పెరిగినా ఆశ్చ‌ర్యం లేద‌ని అంటున్నారు. త్వ‌ర‌లోనే విశాఖ‌లో భారీ స‌భ‌ను ఏర్పాటు చేయ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో ఇంత‌కు మించి జ‌నాల‌ను త‌ర‌లించేందుకు ప్లాన్ చేస్తున్నారు. దీంతో కాంగ్రెస్ జోష్ పెరుగుతున్న‌ద‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

మ‌రోవైపు.. కాంగ్రెస్ ఇలా బ‌ల‌ప‌డుతూ.. పోతే.. క్షేత్ర‌స్థాయిలో ఓట్లు చీలడం ప్రారంభ‌మై.. కాంగ్రెస్‌కు సంస్థాగ‌తంగా ఉన్న ఓటు బ్యాంకు వైసీపీకి దూర‌మ‌వుతుంది. దీని వ‌ల్ల క‌నీసంలో క‌నీసం 20 సీట్ల‌పై ప్ర‌భావం ప‌డుతుంద‌నే అంచ‌నా వ‌స్తోంది. ఇదేస‌మ‌యంలో ఓట్లు చీల‌డం ప్రారంభ‌మైతే.. ఇది త‌మ‌కు ఎఫెక్ట్ అని ప్ర‌తిప‌క్షాలు అంచ‌నా వేస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ష‌ర్మిల జ‌గ‌న్‌ను మాత్ర‌మే టార్గెట్ చేయ‌గా.. ఇప్పుడు టీడీపీని కూడా టార్గెట్ చేస్తుండ‌డం గ‌మ‌నార్హం. దీంతో ఈ పార్టీ నాయకులు కూడా అంత‌ర్మ‌థ‌నంలో ప‌డిపోయారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

This post was last modified on February 27, 2024 3:55 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్రబాబుపై అంబటి బూతుపురాణం… ఏం జరిగింది?

వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…

16 minutes ago

చిట్టి ఇలా రెచ్చిపోయిందేంటి…

ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…

59 minutes ago

దురంధర్‌ను చెడగొట్టిన నెట్‌ఫ్లిక్స్

దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…

1 hour ago

పసిడి పతనం: 48 గంటల్లో రూ. 1.8 లక్షల సంపద ఆవిరి

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…

2 hours ago

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

3 hours ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

3 hours ago