ఏపీ కాంగ్రెస్ పార్టీ తొలి ఎన్నికల పథకాన్ని ప్రకటించింది. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తే.. ఏపీలో పేద కుటుంబాలకు నెల కు రూ.5 చొప్పున ఆర్థికసాయం చేస్తామని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రకటించారు. ఇప్పటికే తెలంగాణలో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తున్నామన్న ఖర్గే.. కర్ణాటకలో 5 గ్యారెంటీలను అమలు చేస్తున్నట్టు చెప్పారు. ఏపీలోనూ పథ కాలు సంపూర్ణంగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. కేంద్రంలో అధికారంలోకి వస్తే.. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని.. ఇది తమ వ్యూహాత్మక నిర్ణయమని ఖర్గే వెల్లడించారు.
ఇదిలావుంటే.. రాష్ట్రంలో వైసీపీ పాలనపై ఖర్గే నిప్పులు చెరిగారు. రాష్ట్రాన్ని సీఎం జగన్ మోడీకి తాకట్టు పెట్టారని వ్యాఖ్యానించా రు. టీడీపీ, జనసేన, వైసీపీ వల్ల రాష్ట్రానికిఒనగూరే ప్రయోజనం లేదన్నారు. సీఎం జగన్ రాష్ట్రానికి ఏం చేశాడో ప్రజలే నిలదీయా లని ప్రశ్నించారు. `పోరాడుదాం.. సాధిద్దాం.. నిర్మిద్దాం“ నినాదంతో ఏపీని అభివృద్ధి చేసుకుందామని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి పేద కుటుంబానికి నెలకు రూ.5 వేల చొప్పున ఆర్థిక సాయం చేయనున్నట్టు తెలిపారు. ఇది పథకం కాదని.. కాంగ్రెస్ గ్యారెంటీ అని పేర్కొన్నారు. “టీడీపీ అధినేత చంద్రబాబు, సీఎం జగన్, జనసేన అదినేత పవన్ కళ్యాణ్‌లు మోడీకి దాసోహం చేస్తున్నారు. వారి వల్ల రాష్ట్రానికి ప్రయోజనం లేదు“ అని ఖర్గే వ్యాఖ్యానించారు.
మోడీపై విమర్శలు..
అనంతపురంలో నిర్వహించిన సభలో ఖర్గే మాట్లాడుతూ.. ప్రధాని మోడీపై విమర్శలు గుప్పించారు. “మోఢీ అహంకారి. అన్నిం టికీ.. నేను-నేను అంటున్నాడు. కానీ, మేం మాత్రం మనం-మనం అంటున్నాం. మీకు మేం కావాలో.. నేను అనే దురహంకారి అయిన మోడీ కావాలో నిర్ణయించుకోండి“అని దేశ ప్రజలకు అనంత వేదికగా ఖర్గే పిలుపునిచ్చారు. కాంగ్రెస్ హయాంలో ప్రారం భించిన పథకాలకు తన పేరు వేసుకుని ప్రచారం చేసుకుంటున్నాడని ప్రధానిపై ఖర్గే విమర్శలు గుప్పించారు. “ఇప్పుడు మోడీ నాది.. అని చెబుతున్న ప్రతి పథకం వెనుక కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్ ఎంతో కృషి చేసింది. ఈ దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసింది. ఇవన్నీ ఇప్పుడున్న ప్రధాని అనుభవిస్తున్నాడు“ అని ఖర్గే వ్యాఖ్యానించారు.
షర్మిలకు అందుకే పగ్గాలిచ్చాం..
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పగ్గాలను వైఎస్ షర్మిలకు ఇవ్వడం వెనుక ఉన్న వ్యూహాన్ని ఖర్గే వివరించారు. “దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి ఎవరికీ తల వంచలేదు. అలాంటి లక్షణం జగన్‌కు లేదు. ఆయన మోడీ దగ్గర సాగిల పడుతున్నాడు. ఇద్దరూ వైఎస్ బిడ్డలే అయినా.. షర్మిలకు ఆ లక్షణం వచ్చింది. అందుకే.. ఆమెకు ఏపీ పగ్గాలు అప్పగించాం. ఆమె వెంట మేమంతా ఉంటాం“ అని ఖర్గే వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ హయాంలో రాజశేఖరరెడ్డి ఎప్పుడు వచ్చినా.. కాంగ్రెస్ తలుపులు తెరిచే ఉన్నాయని, ఇప్పుడు మోడీ దగ్గరకు వెళ్లాలంటే.. సీఎం జగన్ భయపడిపోతున్నాడని అన్నారు.
This post was last modified on February 27, 2024 10:03 am
నిన్న విడుదలైన గేమ్ ఛేంజర్ యునానిమస్ గా బ్లాక్ బస్టర్ అనిపించుకోనప్పటికీ మిక్స్డ్ టాక్ తోనూ క్రమంగా పుంజుకుంటుందనే నమ్మకంలో…
రాయలసీమ అంటేనే… ఫ్యాక్షన్ గొడవలకు పెట్టింది పేరు. నిత్యం వైరి వర్గాలపై దాడులు చేసుకుంటూ కాలం వెళ్లదీసే ఇక్కడి వారిలో…
నందమూరి నటసింహం బాలకృష్ణ తాజా చిత్రం డాకు మహారాజ్ ఆదివారం ప్రేక్షకుల ముందుకు రానుంది. వరుస హిట్లతో మంచి జోరు…
విజయనగరం జిల్లా భోగాపురం వద్ద నిర్మాణంలో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాజెక్టు మరో కీలక మలుపు తీసుకుంది. గోపాలపురం ఎయిర్‌పోర్టు…
తిరుమలలో వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనం టోకెన్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనలో ఆరుగురు మృతి చెందగా 40…
2019 ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్ల జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత…