రాజకీయాల్లో చంద్రబాబు రాముడు వంటివారు. నేను ఆయనకు ఆంజనేయుడి టైపు
– అని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నాయకుడు, టీడీపీ ఉత్తరాంధ్ర జిల్లాల ఇంచార్జ్ బుద్దా వెంకన్న వ్యాఖ్యానించారు. ఆయన పశ్చిమ నియోజకర్గం టికెట్ ను ఆశిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. దీనిని జనసేనతో పొత్తులో భాగంగా ఆ పార్టీ నాయకుడు పోతిన వెంకట మహేష్‌కు ఇవ్వాలని టీడీపీ అధినేత నిర్ణయించారు. ఇటీవల ఈ విషయం తెలిసి.. తన రక్తంతో చంద్రబాబు పాదాలు కడిగి బుద్దా వెంకన్న హల్చల్ చేయడం రాస్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
తాజాగా మరోసారి విజయవాడలో ఆయన మాట్లాడుతూ.. తాను ఆంజనేయుడినని, ఎదురు తిరిగి.. చంద్రబాబు దిష్టిబొమ్మలు తగల బెట్టనని.. ఆయన ఆమే శాసనం, తాను శిరోధార్యంగా భావిస్తానని వ్యాఖ్యానించారు. టీడీపీలో ఆయారాం, గయారాంలు ఉన్నారు.టిక్కెట్ ఇస్తే పొగుడుతారు, లేదంటే దిష్టిబొమ్మ తగల పెడతారు. నేను మాత్రం చంద్రబాబుకు ఆంజనేయుడి వంటి వాడిని. చంద్రబాబును అభ్యర్దించాలే కానీ డిమాండ్ చేయకూడదు. చంద్రబాబుకు రామబంటు అనే పదం నా జీవితంలో నిల పెట్టుకుంటాను
అని బుద్ద వెంకన్న వ్యాఖ్యానించారు.
కేశినేనిపై విమర్శలు
కేశినేని నాని పెద్ద కోవర్టని వెంకన్న విమర్శించారు. తాను కనకదుర్గ ఫ్లైఓవర్ ఉద్యమం చేస్తే… తనకు పేరు వచ్చిందని కేశినేని నాని తన గొప్పగా చెప్పాడన్నారు. చంద్రబాబు కేంద్రంతో మాట్లాడి తేస్తే ఆయన ఖాతాలో వెసుకున్నారని విమర్శించారు. విజయవాడ ఇన్ ఛార్జిగా తాను ఉంటే ఫిర్యాదు చేశాడని తెలిపారు. తనను తొలగించాలని అనేక కుట్రలు చేశాడన్నారు. ఆ రోజు సుజనా చౌదరి అది కరెక్ట్ కాదని ఆపారని వివరించారు. వెల్లంపల్లితో లాలూచీ పడి… కేశినేని నాని కోవర్టు అయ్యాడన్నారు.
This post was last modified on February 26, 2024 5:49 pm
కోలీవుడ్ టాప్ హీరోయిన్ నయనతారకు కోపం వచ్చింది. హీరో ధనుష్ మీద తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ మూడు పేజీల…
పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న అకీరానందన్ తెరంగేట్రం కన్నా ముందు అతని సంగీతం వినే అవకాశం దక్కేలా…
రీల్స్ చేయటం ఇవాల్టి రోజున కామన్ గా మారింది. చిన్నా.. పెద్దా అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరు తమకున్న…
అభిమానుల దృష్టి ఓజి మీద విపరీతంగా ఉండటం వల్ల హైప్ విషయంలో హరిహర వీరమల్లు కొంచెం వెనుకబడినట్టు అనిపిస్తోంది కానీ…
టాలీవుడ్లో మెగా హీరోలకు ఉన్న ఫ్యాన్ సపోర్ట్ ఇంకెవరికీ ఉండదనే అభిప్రాయాలున్నాయి. ముందు తరంలో ముందు మెగాస్టార్ చిరంజీవి, ఆ…
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…