రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పటి వరకు టీడీపీ-జనసేన మిత్రపక్షం 118 స్తానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన విషయం తెలిసిందే ఇక, మిగిలిన కీలకమైన నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. బీజేపీ కలసి వస్తే.. అంటూ. చంద్రబాబు ఇటీవల వ్యాఖ్యలు చేశారు.ఒకవేళ ఆ పార్టీ కలిసి వచ్చినా.. 10-15 సీట్లలోపే అవకాశం ఇస్తారు. మిగిలి స్థానాల్లో అంటే.. 42లో టీడీపీ పోటీ చేయనుంది. అయితే.. జనసేన నుంచి అభ్యర్థులు ఎక్కువగా ఉండడంతో మరో 5-10 సీట్లు ఆ పార్టీకి ఇచ్చే ఆలోచనతో టీడీపీ ఉన్నట్టు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో చంద్రబాబు ఇప్పటికిప్పుడు 30 స్థానాలపై దృష్టి పెట్టారు. ఆయా స్థానాల్లోనూ అభ్యర్థులను కొలిక్కి తెచ్చేస్తే.. ఇక, ప్రధాన క్రతువు పూర్తవుతుందని ఆయన భావిస్తున్నారు. ఇక. ఇప్పటికే ప్రకటించిన 94 స్థానాల(టీడీపీ)కు భారీ ఇబ్బందులు వస్తాయని అనుకున్నా.. అనుకున్న విధంగా ఏమీ సంచలనాలు చోటు చేసుకోలేదు. కేవలం 5 నుంచి 6 నియోజకవర్గాలలోనే నాయకులు అసంతృప్తితో రగులుతున్నారు. వీరిని బుజ్జగిస్తున్నారు. దీంతో తొలి జాబితా సక్సెస్ అయినట్టేనని చంద్రబాబు లెక్కలు వేసుకుంటున్నారు.
ఇక, ఇప్పుడు మలిజాబితా సహా 22 ఎంపీ సీట్లపై కసరత్తు ప్రారంభించారు. అయితే.. వీటిలో 4 సీట్లను బీజేపీ ఆశిస్తున్న నేపథ్యంలో మొగిలిన 18 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులను ఎంపిక చేసే పనిని పూర్తి చేసేలా చంద్రబాబు ఇంటి నుంచి కసరత్తు ముమ్మరం చేసినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గత ఎన్నికల్లో కేవలం ముగ్గురు మాత్రమే విజయం సాధించగా.. ఒకరు టీడీపీ నుంచి వైసీపీలోకి జంప్ చేశారు. దీనికి తోడు ఒకరు(గల్లా జయదేవ్) రాజకీయాలకు ఏకంగా దూరమయ్యారు. ఈ నేపథ్యంలో మిగిలిన 17 స్థానాల్లో బలమైన అభ్యర్థులను నిలపాలని నిర్ణయించుకున్నారు.
This post was last modified on February 26, 2024 5:47 pm
కోలీవుడ్ టాప్ హీరోయిన్ నయనతారకు కోపం వచ్చింది. హీరో ధనుష్ మీద తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ మూడు పేజీల…
పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న అకీరానందన్ తెరంగేట్రం కన్నా ముందు అతని సంగీతం వినే అవకాశం దక్కేలా…
రీల్స్ చేయటం ఇవాల్టి రోజున కామన్ గా మారింది. చిన్నా.. పెద్దా అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరు తమకున్న…
అభిమానుల దృష్టి ఓజి మీద విపరీతంగా ఉండటం వల్ల హైప్ విషయంలో హరిహర వీరమల్లు కొంచెం వెనుకబడినట్టు అనిపిస్తోంది కానీ…
టాలీవుడ్లో మెగా హీరోలకు ఉన్న ఫ్యాన్ సపోర్ట్ ఇంకెవరికీ ఉండదనే అభిప్రాయాలున్నాయి. ముందు తరంలో ముందు మెగాస్టార్ చిరంజీవి, ఆ…
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…