బీఆర్ఎస్ చాప్టర్ దాదాపు క్లోజ్ అయిపోయిందా ? పార్టీలో జరుగుతున్న పరిణామాలు గమనిస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇంతకీ చాప్టర్ క్లోజ్ అంటే తెలంగాణ లో కాదు. జాతీయస్థాయిలో అని అర్ధం. తెలంగాణాను బేస్ చేసుకుని దేశమంతా పార్టీని విస్తరింప చేయాలని కేసీయార్ చాలా కలలు కన్నారు. అందుకు కొంత ప్రయత్నాలు కూడా చేశారు. మహారాష్ట్ర, కర్నాటక, ఏపీ మీద ఎక్కువ దృష్టి పెట్టారు. వీటిల్లో కూడా మహారాష్ట్రకు చాలాసార్లు వెళ్ళొచ్చారు. అక్కడ బహిరంగసభలు కూడా నిర్వహించారు.
మహారాష్ట్రలో జరిగిన స్ధానిక సంస్ధల ఎన్నికల్లో పోటీ చేసి కొన్ని చోట్ల గెలుచుకున్నారు. జాతీయ స్ధాయిలో చక్రంతిప్పేయాలని ఉబలాటపడి టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చారు. అన్నీ బాగానే ఉన్నాయి కాని మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవటంతో కథంతా అడ్డంతిరిగింది. తెలంగాణాలోనే పార్టీని కాపాడుకోలేకపోతున్నారు. దాంతో మిగిలిన రాష్ట్రాల్లో ఇంకేమి పట్టించుకుంటారు ? అందుకనే మహారాష్ట్ర, ఏపీ నేతలతో అసలు టచ్ లోనే ఉండటం లేదట.
ఇపుడు ఏపీలో ఎన్నికల హడావుడి తారాస్ధాయికి చేరుకుంటున్నది. తొందరలోనే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు జరగబోతున్నాయి. అన్ని పార్టీలు ప్రచారంతో, సభలతో, అభ్యర్థుల కసరత్తుతో చాలా హడావుడి పడుతున్నాయి. అయితే బీఆర్ఎస్ మాత్రం స్తబ్దుగా ఉంది. ఎందుకంటే ఏపీలో పోటీచేయకూడదని డిసైడ్ అయ్యిందట. అందుకనే ఏపీ నేతలు కేసీయార్ ను కలవాలని ఎంత ప్రయత్నించినా కుదరడంలేదని పార్టీవర్గాల సమాచారం. ఏపీ బీఆర్ఎస్ నేత రావెల కిషోర్ బాబు చాలారోజుల క్రితమే వైసీపీలో చేరిపోయారు. ఇపుడు అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ మాత్రమే ఉన్నారు. ఈయన కూడా తొందరలోనే రాజీనామా చేసేస్తారని అంటున్నారు.
మొత్తానికి ఏపీలో బీఆర్ఎస్ చాప్టర్ క్లోజ్ అన్నట్లుగానే ఉంది. ప్రస్తుత పరిస్ధితుల్లో ఇతర రాష్ట్రాల్లో బీఆర్ఎస్ పోటీచేసే పరిస్థితిలో లేదని అర్థమైపోతోంది. అందుకనే మహారాష్ట్ర, ఏపీ నేతలు మాట్లాడాలని ఎంత ప్రయత్నిస్తున్నా కేసీయార్ అందుబాటులోకి రావటంలేదట. దాంతో మహారాష్ట్రాలో చాలామంది నేతలు రాజీనామాలు చేస్తున్నారు. ఏపీలో చెప్పుకోవటానికి పెద్దగా నేతలు లేరు కాబట్టి రాజీనామాల హడావుడి కనబడటంలేదు. బహుశా అధ్యక్షుడిగా తోట రాజీనామా చేసేస్తే ఇక ఏపీ బీఆర్ఎస్ కు ఆపీసు కూడా ఉండదేమో.
This post was last modified on February 26, 2024 9:42 am
కటక్లో జరిగిన టీ20 మ్యాచ్లో టీమిండియా 101 పరుగుల భారీ విజయం సాధించినా, సోషల్ మీడియాలో మాత్రం కెప్టెన్ సూర్యకుమార్…
అక్కినేని నాగార్జున ప్రస్తుతం 67వ పడిలో ఉన్నారు. ఆయన ఎవరో తెలియని వాళ్లకు ఆయన్ని చూపించి తన వయసెంత అంటే 40-45 మధ్య చెబుతారేమో. నిజానికి ఆ…
ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రాన్ని త్వరలోనే జోన్లు, రీజియన్లు, కారిడార్లు, క్లస్టర్లు, హబ్లుగా విభజించుకుని అభివృద్ధి…
బాక్సాఫీస్ పరిణామాలు సస్పెన్స్ థ్రిల్లర్ తరహాలో మలుపులు తిరుగుతున్నాయి. డిసెంబర్ 5 అఖండ 2 వాయిదా పడింది. క్రిస్మస్ కు…
తెలుగు రాజకీయాల్లో కొడాలి నానిది ఓ డిఫరెంట్ స్టైల్. ప్రత్యర్ధులపై దూకుడుగా మాట్లాడే ఆయన వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు.…
పెట్టుబడిదారులకు ఏపీ స్వర్గ ధామంగా మారుతుందని.. మంత్రి నారా లోకేష్ తెలిపారు. అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి.. పెట్టుబడి దారులతో…