తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు, ఎమ్మెల్యే కేటీఆర్.. తాజాగా “మా కారు సర్వీసింగుకే వెళ్లింది” అని మరోసారి కుండబద్దలు కొట్టారు. అయితే.. ఆయన గత డిసెంబరులో ఎన్నికలు జరిగిన నాటి నుంచి ఇప్పటి వరకు ఈ మాటను 50 నుంచి 60 సార్లు చెప్పి ఉంటారని పరిశీలకులు చెబుతున్నారు. ఎక్కడ ఏవేదిక ఎక్కినా.. కేటీఆర్ చెబుతున్న మాట ఇదే కావడం గమనార్హం. సందర్భంతో పనిలేకుండా.. సమయంతో నూ పనిలేకుండా.. కేటీఆర్ పదే పదే.. మా కారు సర్వీసింగుకే వెళ్లిందని చెబుతుండడంతో.. ఏదో డౌట్ కొడుతోందని అంటున్నారు పరిశీలకులు.
ప్రస్తుతం ఉన్న టాక్ ఏంటంటే.. ‘కారు’ షెడ్డుకు వెళ్లిందని! కాంగ్రెస్ నేతలు దీనిని ప్రచారం చేయడం లేదు. అయితే.. బీఆర్ ఎస్‌లోనే చిన్నపాటి గుసగుస వినిపిస్తోంది. దీంతో కేటీఆర్.. ఇలా పదే పదే కారు సర్వీసింగుకు మాత్రమే వెళ్లిందని చెబుతున్నారు. దీనివల్ల లేనిపోని అపోహలు తెరమీదికి వచ్చే అవకాశం ఉందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. తాజాగా నాగర్ కర్నూల్‌లో నిర్వహించిన పార్లమెంటరీ ఎన్నికల సన్నాహక సభలో కేటీఆర్ పదే పదే ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక, ఇదే సమయంలో పాలక పక్షం కాంగ్రెస్‌పైనా విమర్శలు గుప్పించారు.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన పథకాలు ఎగ్గొట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని.. కేటీఆర్ వ్యాఖ్యానించారు. గ్రామాల్లో కేసీఆర్‌పై ప్రేమ ఉన్నవారు లక్షల మంది ఉన్నారని, వారిని వచ్చే ఎన్నికలలో పార్టీవైపు మళ్లించాలని సూచించారు. ఇక, పదవులు రాలేదని నేతలకు బాధ ఉండొచ్చేమో గానీ.. కార్యకర్తలకు ఆ బాధ లేదని కీలక నేతలకు చురకలంటించారు. కార్యకర్తలను నేతలు ఏడాదిపాటు కాపాడుకుంటే.. మిగతా నాలుగేళ్లు కార్యకర్తలే నేతలను కాపాడతారని కేటీఆర్ తెలిపారు.
మళ్లీ అదే పాట!
ఇక, ఇటీవల అసెంబ్లీలో దుమ్మురేపిన ప్రాజెక్టుల అంశాన్ని మరోసారి కేటీఆర్ కెలికారు. కృష్ణానదిపై ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రానికి అప్పగించిందని విమర్శించారు. ఈ ప్రాజెక్ట్‌లను కాంగ్రెస్ నేతలు.. ఢిల్లీ పెద్దల చేతిలో పెట్టి గులాం గిరీ చేశారని వ్యాఖ్యానించారు. ఎక్కడ కోల్పోతే అక్కడే సాధించుకోవాలంటూ పార్లమెంటు ఎన్నికల్లో విజయంపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. అచ్చంపేటలో పూర్వ వైభవం సాధించుకోవాలని పిలుపునిచ్చారు. “కేసీఆర్ నాయకత్వంలో 14 ఏళ్లు ఉద్యమం చేశాం. 24 ఏళ్ల పాటు కారు 100 కి.మీ. వేగంతో జోరుగా వెళ్లింది. ప్రస్తుతం సర్వీసుకు మాత్రమే వెళ్లింది. తిరిగి వస్తుంది” అని కేటీఆర్ తనదైన శైలిలో వ్యాఖ్యానించారు.
This post was last modified on February 26, 2024 6:35 am
నిర్మాత దిల్ రాజు అన్నట్టు వందల సినిమాలు తీయకపోయినా కెవిఎన్ ప్రొడక్షన్స్ అనేది ఇప్పుడు అన్ని బాషల ఇండస్ట్రీలో హాట్…
మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘కాాకా’ నుంచి ఇటీవల రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ మెగా అభిమానులనే కాక సామాన్య…
కింగ్ సైజ్ ఫిలిం మేకర్ అని ఎవరికైనా బిరుదు ఇవ్వాల్సి వస్తే అందరి మదిలో మెదిలే ఒకే ఒక్క పేరు…
మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…
ఏదైనా మితంగా తింటేనే అందం. మితిమీరిందా పొట్ట ఉబ్బిపోయి డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిండి సామెత సినిమాలకు కూడా…
కరోనా తర్వాత థియేటర్స్ కి జనం మళ్ళీ వచ్చేలా చేసిన సినిమాల్లో జాంబీ రెడ్డి ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ…