“రెండు రోజుల్లో బూతులు నేర్చుకుని వస్తా.. కాసుకో!”- అంటూ వైసీపీ నాయకుడు, సిట్టింగ్ ఎమ్మెల్యేపై టీడీపీ నాయకుడు, తాజాగా టికెట్ దక్కించుకున్న నేత విరుచుకుపడ్డారు. బూతులు మాట్లాడడమే రాజకీయం అనుకుంటే.. తాను కూడా బూతులు నేర్చుకుని వచ్చి మాట్లాడతానని వ్యాఖ్యానించారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని గన్నవరం నియోజకవర్గంలో వైసీపీ వర్సెస్ టీడీపీ నేతల మధ్య యుద్ధం ఓ రేంజ్‌లో సాగుతోంది. ఇక్కడ నుంచి వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరఫున సిట్టింగ్ నేత వల్లభనేని వంశీ పోటీ చేయనున్నారు.
ఇక, ఇదే నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరఫున యార్లగడ్డ వెంకట్రావు పోటీ చేయనున్నారు. అయితే.. వీరి మధ్య తరచుగా ఎన్నికల పోరు సాగుతోంది. ఇటీవల టీడీపీ అనుచరులను కొందరిని పోలీసులు తీసుకువెళ్లి కేసులు పెట్టారు. దీనివెనుక ఎమ్మెల్యే వంశీ హస్తం ఉందని యార్లగడ్డ అన్నారు. దీనిపై వంశీ కూడా అదే రేంజ్‌లో రియాక్ట్ అయి.. బూతులతో విరుచుకుపడ్డారని యార్లగడ్డ చెబుతున్నా రు. ఈ క్రమంలో ఆయన స్పందిస్తూ.. తాను కూడా బూతులు మాట్లాడగలనని.. అయి రెండు రోజుల్లో నేర్చుకుని వస్తానని.. కాసుకో! అంటూ వార్నింగ్ ఇచ్చారు.
ఇదేసమయంలో టీడీపీ కార్యకర్తలపై కేసులు పెడుతున్న పోలీసులకు కూడా యార్లగడ్డ వార్నింగ్ ఇచ్చా రు. “అమెరికా నుంచి వచ్చాడు.. సౌమ్యుడు.. వివాద రహితుడు అనుకుంటున్నారేమో… జిల్లా ఎస్పీ పేరు ను నారా లోకేష్ రెడ్ బుక్కులోకి చేర్చే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటా”.. అని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో తన గెలుపు ఖాయమైందని అన్నారు. టీడీపీ బీఫాంపై ఇక్కడ పోటీ చేసిన వారు ఆరు సార్లుగా గెలుస్తునే ఉన్నారని.. ఇప్పుడు తాను కూడా గెలుస్తానని.. ఇది చిన్న విషయమని యార్లగడ్డ వ్యాఖ్యానించారు. మరి ఈ వ్యాఖ్యలపై వంశీ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
This post was last modified on February 25, 2024 6:40 pm
అక్టోబర్ 2 జాతిపిత మహాత్మా గాంధీ జయంతి. నేషనల్ హాలిడే. ఆ మహానుభావుడిని ఎందరు గుర్తు చేసుకుంటారో కానీ సెలవు…
సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం ‘80ల ట్రెండ్’ సందడి చేస్తోంది. సాధారణ ఫొటోలను కృత్రిమ మేధ సాయంతో 1980ల నాటి దుస్తులు,…
చాట్‌జీపీటీ, జెమినీ, క్లాడ్ లాంటి AI సేవల వెనుక భారీ డేటా సెంటర్లు, ఖరీదైన చిప్స్, విద్యుత్ అవసరం ఉంటుంది.…
నాలాంటి వాళ్ళే కాక్రోచ్ అవుతున్నారంటూ వైసీపీ అధినేత జగన్ చెప్పిన ఈ మాట నెట్టింట తెగ వైరల్ అవుతుంది. నీట్…
ఫౌజీ విడుదల వాయిదా గురించి అసలైన మైత్రి మూవీ మేకర్స్ ఇంకా చెప్పలేదు కానీ మిగిలిన సినిమాలు అలెర్ట్ అయిపోయి…
షాప్‌లో యూపీఐ పేమెంట్ చేయాలంటే ప్రస్తుతం ఫోన్‌లో యాప్ ఓపెన్ చేసి, కెమెరాతో క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తున్నాం. ఇక…