ఒక ఘటన ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకునేలా చేసింది. అదే సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే, బీఆర్ ఎస్ నాయకురాలు లాస్య నందిత ఘోర రోడ్డు ప్రమాద ఘటన. పటాన్‌చెరు ఓఆర్ ఆర్ రోడ్డుపై జరిగిన దుర్ఘటనలో లాస్య నందిత అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయిన ఘటన రెండు తెలుగు రాష్ట్రాలను కుదిపేసింది. ఈ ప్రమాదానికి ప్రధాన కారణం.. డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నాడని.. అతి వేగమే కారణమని పోలీసులు నిర్ధారించారు. ఏదేమైనా.. ఎమ్మెల్యేగా గెలిచి మూడు మాసాలు కూడా తిరగకుండానే.. యువ ఎమ్మెల్యే ప్రాణాలు కోల్పోవడం పార్టీలకు అతీతంగా అందరినీ కలచి వేసింది.
ఈ నేపథ్యంలో రేవంత్‌రెడ్డి సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. రాజకీయ నేతలు, వీఐపీల కార్లు నడిపే డ్రైవర్లకు ఫిటినెస్ టెస్టులు చేయించాలని ఒక నిర్ణయానికి వచ్చింది. ఈ బాధ్యతలను రాష్ట్ర రవాణా శాఖ అధికారులు తీసుకోనున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నామినేటెడ్ పదవులు, గవర్నర్ సహా కేబినెట్ హోదా ఉన్న వారి కార్లకు ఉన్న డ్రైవర్లకు ఈ నిబంధన వర్తించనుంది. దీని ప్రకారం.. ఆయా కార్ల డ్రైవర్లకు ఫిట్ నెస్ టెస్టులను చేయనున్నారు. ఈ క్రమంలో వారి కంటి ఆరోగ్యంతోపాటు.. కాళ్లు, చేతుల ఆరోగ్యాన్ని కూడా పరిశీలిస్తారు.
అదేవిధంగా కండరాల పటుత్వం, మానసిక స్థితిని కూడా వైద్యుల ద్వారా రవాణాశాఖ అధికారులు పరీక్షించనున్నారు. తద్వారా పటిష్టమైన డ్రైవర్లు వీఐపీలకు అందుబాటులోకి రానున్నట్టు ప్రభుత్వం భావిస్తోంది. ఈ నిబంధనలు తక్షణ మే అమల్లోకి వస్తాయని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. వీఐపీలు, రాజకీయ నాయకులు తమకు సహకరించాలని ఆయన సూచించారు. ప్రమాదాల నివారణకు మరిన్ని సూచనలు కూడా చేయాలని ఆయన కోరారు. అంతేకాదు.. వీఐపీ, రాజకీయ నేతల డ్రైవర్ల ఫిట్ నెస్ పరీక్షలు నిరంతరాయంగా జరుగుతాయని తెలిపారు. ప్రభుత్వ ఉద్దేశం.. ప్రమాదాలను నివారించడంతోపాటు వీఐపీల ప్రాణాలకు రక్షణ కల్పించడమేనని పొన్నం వివరించారు.
This post was last modified on February 25, 2024 10:03 am
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టుల వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
వైసీపీ అధినేత జగన్ మరో సోదరి, దివంగత వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీత.. మరోసారి రం గంలోకి దిగారు.…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రెండో రోజు కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఈరోజు అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలతోపాటు పలు విషయాలు చర్చకు…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసన సభలో మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. ఈ క్రమంలోనే అభివృద్ధి వికేంద్రీకరణ,…
ఏపీ మాజీ సీఎం జగన్ పై ఆయన సోదరి, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చాలాకాలంగా తీవ్ర స్థాయిలో…
రాజధానిగా అమరావతిని గుర్తించడంలో వైసీపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు.. ఈ క్రమంలో తీసుకు న్న రెండు కీలక నిర్ణయాలు.. తాజాగా…