Political News

మాజీ మంత్రి గంటా ఎక్క‌డ‌?

తాజాగా ప్ర‌క‌టించిన టీడీపీ తొలి అసెంబ్లీ అభ్య‌ర్థుల జాబితాలో మాజీ మంత్రి గంటా శ్రీనివాస‌రావు పేరు క‌నిపించ‌లేదు. విశాఖ ఉత్త‌ర నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ఆయ‌న.. పేరు..తాజా జాబితాలో లేక‌పోవ‌డంతో ఆయ‌న‌కు ఎక్క‌డ టికెట్ ఇస్తార‌నే చ‌ర్చ జోరుగా సాగుతోంది. నిజానికి ఆయ‌న విశాఖ ప‌రిధిలోని భీమిలి లేదా పెందుర్తి నుంచి టికెట్ కావాల‌ని కోరుతున్నారు. అయితే.. రెండు రోజుల నుంచి ఆయ‌న పేరు విజ‌య‌న‌గ‌రం జిల్లా చీపురుప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంప‌రిశీల‌న‌లో ఉంద‌నే వార్త‌లు వ‌స్తున్నాయి.

ఇక‌, దీనిపై టీడీపీ నుంచి ఎలాంటి ప్ర‌క‌ట‌నా రాలేదు. మ‌రోవైపు.. వైసీపీ మంత్రి చీపురుప‌ల్లి ఎమ్మెల్యే బొత్స స‌త్య‌నారాయ‌ణ ఎవ‌రు వ‌చ్చి పోటీ చేసినా ఓడిస్తాన‌ని చెప్పారు. ఈ నేప‌థ్యంలో తాజాగా వెలువ‌రించిన జాబితాలో ఎక్క‌డా గంటా పేరు క‌నిపించ‌లేదు. పైగా ఆయ‌న ఎదురు చూస్తున్న భీమిలి నుంచి జ‌న‌సేన‌కు కేటాయించారు. ఈ పార్టీ త‌ర‌ఫున ప్ర‌స్తుతం ఎమ్మెల్సీగా ఉన్న వంశీ కృష్ణ యాద‌వ్ పోటీ చేయ‌నున్నారు. ఇది టీడీపీ శ్రేణుల‌కు మింగుడు ప‌డ‌డం చాలా క‌ష్టం.

ఇక‌, గంటా ఆశించిన మ‌రో నియోజ‌క‌వ‌ర్గం పెందుర్తి. ఇక్క‌డ కూడా.. జ‌న‌సేన పోటీ చేయ‌నుంది. జ‌న‌సేన అభ్య‌ర్థిగా పంచ‌క‌ర్ల ర‌మేష్‌బాబును ప్ర‌క‌టించారు. పోనీ.. గాజువాక అయినా.. టీడీపీ తీసుకుని ఉంటే బాగుండేద‌నే వాద‌న ఉంది. కానీ, ఇక్క‌డ కూడా జ‌న‌సేన‌కు ఇచ్చేశారు. ఈ పార్టీ త‌ర‌ఫున సుంద‌ర‌పు స‌తీష్‌కుమార్‌కు అవ‌కాశం ఇచ్చారు. ఇలా.. గంటా శ్రీనివాస‌రావుకు దాదాపు విశాఖ‌న‌గ‌ర ప‌రిధిలో చోటు లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. మ‌రోవైపు.. విశాఖ ఉత్త‌రం కూడా మిగిలే ప‌రిస్థితి లేదు. రేపు బీజేపీతో పొత్తు ఉంటే ఆ సీటును.. బీజేపీ అభ్య‌ర్థి.. విష్ణుకుమార్‌రాజుకు కేటాయించాల్సి ఉంటుంది. మ‌రి గంటా కు ఏ సీటు ఇస్తారో చూడాలి. 

This post was last modified on February 24, 2024 2:36 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ధనుష్ మీద భగ్గుమన్న నయనతార

కోలీవుడ్ టాప్ హీరోయిన్ నయనతారకు కోపం వచ్చింది. హీరో ధనుష్ మీద తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ మూడు పేజీల…

44 mins ago

అకీరా సంగీతానికి తమన్ గైడెన్స్

పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న అకీరానందన్ తెరంగేట్రం కన్నా ముందు అతని సంగీతం వినే అవకాశం దక్కేలా…

3 hours ago

రీల్స్ చేసే వారికి రైల్వే శాఖ లేటెస్టు వార్నింగ్..

రీల్స్ చేయటం ఇవాల్టి రోజున కామన్ గా మారింది. చిన్నా.. పెద్దా అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరు తమకున్న…

3 hours ago

వీరమల్లుని నిలబెట్టే 7 ఎపిసోడ్లు

అభిమానుల దృష్టి ఓజి మీద విపరీతంగా ఉండటం వల్ల హైప్ విషయంలో హరిహర వీరమల్లు కొంచెం వెనుకబడినట్టు అనిపిస్తోంది కానీ…

3 hours ago

మెగా సపోర్ట్ ఏమైనట్లు?

టాలీవుడ్లో మెగా హీరోలకు ఉన్న ఫ్యాన్ సపోర్ట్ ఇంకెవరికీ ఉండదనే అభిప్రాయాలున్నాయి. ముందు తరంలో ముందు మెగాస్టార్ చిరంజీవి, ఆ…

10 hours ago

వివేకా కేసులో స్పీడు పెంచిన సునీత

ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…

15 hours ago