Political News

వీళ్ళది భలే పొత్తు

రాబోయే ఎన్నికల్లో ఏపీలో కాంగ్రెస్, వామపక్షాలు పొత్తుల్లో పోటీ చేస్తాయని కాంగ్రెస్ చీఫ్ షర్మిల ప్రకటించారు. మీడియా సమావేశంలో షర్మిల వామపక్షాల కార్యదర్శులు శ్రీనివాసరావు, రామకృష్ణ ఎంతో ఆర్భాటంగా ప్రకటించటమే ఆశ్చర్యంగా ఉంది. నాలుగు రోజుల క్రితం వరకు సీపీఐ చంద్రబాబు నాయుడు తో పొత్తు పెట్టుకోవటానికి తహతహలాడిన విషయం అందరుచూసిందే. బీజేపీతో పొత్తువద్దని టీడీపీ, జనసేన, వామపక్షాలు పొత్తు పెట్టుకుందామని సీపీఐ జాతీయ కార్యదర్శి, రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ చంద్రబాబును పదేపదే బతిమలాడుకున్న విషయం అందరూ చూసిందే.

వీళ్ళ విజ్ఞప్తులను చంద్రబాబు పట్టించుకోకుండా బీజేపీతో పొత్తు దిశగా వెళుతున్నారు. ఈనెలాఖరులోగా పొత్తుల విషయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశముంది. ఇక చంద్రబాబుతో లాభంలేదని అర్ధమైపోయి కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నారు. దీన్ని చాలా ఆర్భాటంగా ప్రకటించటమే ఆశ్చర్యంగా ఉంది. నిజానికి ఈ మూడుపార్టీలు కాదు ఇలాంటి పార్టీలు ఎన్ని పొత్తు పెట్టుకున్నా పెద్దగా ఉపయోగముండదని అందరికీ తెలిసిందే. ఎందుకంటే జోగిజోగి రాసుకుంటే బూడిదరాలుతుందనే సామెత తెలిసిందే. ఈ సామెత కాంగ్రెస్, వామపక్షాలకు సరిగ్గా సరిపోతుంది.

పోయిన ఎన్నికల్లో కాంగ్రెస్ కు వచ్చిన ఓట్లేమీలేదు. అలాగే వామపక్షాలకు అసలు ఓట్లేసిన వాళ్ళే లేరు. మూడు పార్టీలకు కలిపి కనీసం అరశాతం ఓట్లు కూడా లేవు. ఇలాంటి మూడుపార్టీలు పొత్తు పెట్టుకుని ఏమిసాధిస్తాయో ఎవరికీ అర్ధంకావటంలేదు. నిజానికి ఈ మూడుపార్టీలు జనాల నమ్మకాన్ని పోగొట్టుకుని చాలా కాలమే అయిపోయింది. రాష్ట్ర విభజనకు ముందే వామపక్షాలు జనాలకు దూరమైపోయాయి. అడ్డుగోలు విభజనతో కాంగ్రెస్ సీమాంధ్రను నాశనం చేసేసింది.

సో, ఈ కారణాలతోనే పై మూడుపార్టీలు జనాధరణను కోల్పోయాయి. తమపార్టీలు జనాధరణకు దూరమయ్యాయన్న విషయాన్ని పార్టీలే గుర్తించటంలేదు. ఈ పార్టీల తరపున పోటీచేస్తున్న అభ్యర్ధులు ప్రత్యర్ధులపై గెలవలేరు సరికదా కనీసం ఓడించటానికి కూడా పనికిరారు. ఇలాంటి పార్టీలు ఎన్నిపొత్తుపెట్టుకుంటే మాత్రం ప్రత్యర్ధులకు జరిగే నష్టమేమిటి ? 175 సీట్లలో పోటీచేయటానికి మూడుపార్టీలకు గట్టి అభ్యర్ధులు దొరికితే అదే చాలా గొప్పని చెప్పుకోవాలి. రాబోయే ఎన్నికల్లో మూడుపార్టీల పొత్తును జనాలు ఏ మేరకు ఆదరిస్తారు ? ఎన్ని ఓట్లొస్తాయో చూడాలి.

This post was last modified on February 24, 2024 10:15 am

Share

Recent Posts

సూపర్ హిట్ హీరోల విచిత్ర పరిస్థితి

ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…

47 minutes ago

చంద్రబాబు సభ సమీపంలో పేలుడు!

విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…

2 hours ago

కుల పిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా… మతపిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా

వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…

2 hours ago

వాల్యూమ్ పెంచండి జైలర్ సాబ్

ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…

4 hours ago

మహాకాల్… ఊహించని కాంబినేషన్

ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…

4 hours ago

సునీల్ యాద‌వ్ ఎవ‌రు…?

వైసీపీ అధినేత జ‌గ‌న్ చిన్నాన్న వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య‌కు సంబంధించి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తున్న సునీల్ యాద‌వ్ వ్య‌వ‌హారం…

5 hours ago