కీలక సమయాల్లో సీఎం స్థాయిలో ఉన్న వారు స్పందించే తీరుతో వారి రాజకీయ చతురత ఎంతన్న విషయాన్ని ఇట్టే గుర్తించొచ్చు. ఈ విషయంలో గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ తప్పుల మీద తప్పులు చేస్తే.. అందుకు భిన్నంగా ముఖ్యమంత్రి రేవంత్ మాత్రం ఆ దిశగా అడుగులు వేయకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. విషాద వేళ.. పట్టింపులకు పోకుండా.. రాజకీయాలకు తెర తీయకుండా.. హుందాగా వ్యవహరించిన తీరును పలువురు ప్రశంసిస్తున్నారు.
చిన్న వయసులో అనూహ్యంగా చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత అంతిమ సంస్కారాల్ని ప్రభుత్వ లాంఛనాలతో పూర్తి చేసేలా ఆదేశాలు జారీ చేయటం తెలిసిందే. లాస్య నందిత తండ్రి.. సీనియర్ నాయకుడు.. పలుమార్లు అసెంబ్లీకి ఎన్నికైన సాయన్న మరణ వేళ.. ఆయన అంతిమ సంస్కారాలు ప్రభుత్వ లాంఛనాలతో జరగకపోవటం కేసీఆర్ సర్కారుపై తీవ్ర విమర్శలకు దారి తీసింది.
కాలం కలిసి రాలేదు కానీ..కచ్ఛితంగా మంత్రి కావాల్సిన సాయన్నకు మరణించిన వేళలో అయినా కనీస మర్యాద ఇస్తూ.. అధికారిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించాలన్న డిమాండ్ వచ్చింది. అంతిమ సంస్కారాల సమయంలో దాదాపు రెండు గంటల పాటు ఆపేసి.. సాయన్న అభిమానులు ఆందోళన చేపట్టారు. అప్పటి అధికార పార్టీ అయిన బీఆర్ఎస్ అధినేత.. నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం సానుకూలంగా స్పందించలేదు.
అధికార పార్టీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యే మరణించిన వేళలో.. అధికారంలో తాము ఉన్నప్పటికి అధికారిక లాంఛనాలు జరపని వైనంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. తాజాగా మాత్రం సాయన్న కుమార్తె లాస్య నందిత అకాల మరణ నేపథ్యంలో సీఎం రేవంత్.. మాత్రం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని స్పష్టమైన ఆదేశాలు ఇవ్వటాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు. విషాద వేళ.. కేసీఆర్ సర్కారు చేసిన తప్పును రేవంత్ ప్రభుత్వం రిపీట్ చేయకుండా ఉండటం.. విమర్శలకు వేలెత్తి చూపే అవకాశాన్ని ఇవ్వటం చూస్తే.. సీఎంగా ఆయనపై మరింత సానుకూలత పెరుగుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
This post was last modified on February 24, 2024 10:09 am
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…
గల్లా జయదేవ్.. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంతూరు చంద్రగిరికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తగానే కాకుండా… గుంటూరు…
దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సమావేశం ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లోని పాలకులు, వ్యాపారవర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న సంగతి…
తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై జరుగుతున్న విచారణలో రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి.ప్రకాశ్ కీలక సమాచారాన్ని…