Political News

సీఎం జ‌గ‌న్ హెలికాప్ట‌ర్లు.. ర‌ఘురామ ఫిర్యాదు

ఏపీ సీఎం జ‌గ‌న్‌.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌చారం కోసం వినియోగించేలా రెండు హెలికాప్ట‌ర్ల‌ను లీజుకు తీసుకు నేందుకు ప్ర‌య‌త్నించిన విష‌యం తెలిసిందే. దీనికి గాను ఒక్కొక్క హెలికాప్ట‌ర్‌కు 2 కోట్ల రూపాయ‌ల చొప్పున ప్ర‌జాధ‌నాన్ని ఇవ్వ‌నున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. ఈ వార్త‌ల‌ను సీరియ‌స్‌గా తీసుకున్న వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి పిర్యాదు చేశారు. సీఎం జగన్ ఎన్నికల వ్యయ నియమావళిని ఉల్లంఘించారని దానిలో పేర్కొన్నారు.

అంతేకాదు.. ఎన్నిక‌ల నిబంధనలకు విరుద్ధంగా ప్ర‌జ‌ల సొమ్మును వినియోగించి విజయవాడ, విశాఖపట్నంలలో రెండు హెలికాప్టర్లు పెట్టాలని గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారని ర‌ఘురామ స‌ద‌రు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎన్నికల ప్ర‌చారానికి స‌ర్కారు ఖ‌జానా నుంచి సొమ్ములు వెచ్చించ‌డం నియ‌మావ‌ళికి విరుద్ధ‌మ‌ని పేర్కొన్నారు. హెలికాప్టర్లను లీజుకు తీసుకునే వ్య‌వ‌హారంపై త‌క్ష‌ణ‌మే జోక్యం చేసుకోవాల‌ని.. వాటిని నిలువ‌రించాల‌ని ఆయ‌న కోరారు.

ఎన్నిక‌ల స‌మ‌యంలో సీఎం జ‌గ‌న్ వినియోగించే రెండు హెలికాప్టర్లకు నెలకు  4 కోట్ల రూపాయ‌ల చొప్పు న‌ ఖర్చు చేస్తున్నారని ర‌ఘురామ వివ‌రించారు.  వ్యక్తిగత భద్రత పేరుతో ఎన్నికల ప్రచారం చేసుకోవడా నికే ఈ విధమైన ఏర్పాటు చేసుకున్నారని ఆరోపించారు. ఎన్నికల వ్య‌యాన్ని రేపు ఎన్నిక‌ల సంఘానికి చూపించాల్సి ఉంటుంద‌ని, అందుకే ముందుగానే ఈ ఎత్తుగ‌డ వేశార‌ని, వ్య‌యం నుంచి తప్పించుకోవ డానికే జగన్ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారని తెలిపారు.

ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ఈ హెలికాప్టర్లలోనే భారీగా నగదును తరలించే అవ‌కాశం ఉంద‌ని ఎంపీ ర‌ఘురామ అనుమానాలువ్య‌క్తం చేశారు. హెలికాప్టర్ల వాడకాన్ని అడ్డుకోవాలని సీఈసీని కోరారు. హెలికాప్టర్లను తనిఖీలు చేసేందుకు కూడా ప్రత్యేక పరిశీలకులను నియమించాలని త‌న ఫిర్యాదులో కోరారు. మొత్తం 12 పేజీల‌తో కూడిన ఫిర్యాదును ఆయ‌న కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి పంపించారు. మ‌రి దీనిపై ఈసీ ఎలాంటి నిర్న‌యం తీసుకుంటుందో చూడాలి.

This post was last modified on February 23, 2024 4:11 pm

Share

Recent Posts

ఫౌజీ ప్లాన్ మారడం వెనుక ఏం జరిగింది

ప్రభాస్ అభిమానులు చాలా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్న అప్డేట్స్ ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. డార్లింగ్ కెరీర్ లో బాహుబలి,…

26 minutes ago

తమన్ ఈసారి నెగిటివిటీని దాటేయాలి

టాలీవుడ్ లో చాలా కాలంగా తమన్ ముద్ర వినిపించడం లేదు. ఓజి టైంలో అంచనాలు అందుకున్నాడు కానీ ఆ తర్వాత…

56 minutes ago

పండగ బోణీ చేయాల్సింది కళ్యాణే

పన్నెండు రోజుల ముందే టాలీవుడ్ బాక్సాఫీస్ దసరా పండగ మొదలైపోయింది. అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే ఇవాళ ఆదర్శ కుటుంబం…

1 hour ago

5 కోట్ల వ‌ర‌కు జీఎస్టీ ఎగ్గొట్టారా…

వస్తు, సేవ‌ల ప‌న్ను.. జీఎస్టీ విధానంలో కీల‌క మార్పులు చేయ‌నున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రైనా వ్యాపారులు పారిశ్రామిక వేత్త‌లు.. జీఎస్టీ…

4 hours ago

మస్క్ అంబానీ మధ్య శాటిలైట్ ఫైట్

భారత దేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ యుద్దానికి తెర లేచింది. మొట్టమొదటిసారిగా అంబానీ ఆధిపత్యానికి సవాల్ ఎదురైంది. ఈ క్రమంలో ప్రపంచ…

5 hours ago

గోదావరి పుష్కరాలకు నిధులు ఇవ్వండి మోదీజీ

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీతో ఏపీ సీఎం చంద్ర‌బాబు భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా అనేక అంశాల‌పై ఆయన కు విన‌తి…

7 hours ago