Political News

బాల‌య్య వార్నింగ్.. జ‌గ‌న్ రియాక్ష‌న్‌

ఏపీ వైసీపీ ప్ర‌భుత్వంపై టీడీపీ నాయ‌కుడు, హిందూపురం ఎమ్మెల్యే బాల‌కృష్ణ ఫైర్ అయ్యారు. అదేస‌మ‌యంలో మాస్ వార్నింగ్ కూడా ఇచ్చారు. “ఇదేం ప‌ద్ద‌తి. మీరు ఎలానూ ఓడిపోతారు. ఇంకా దాడులు చేయ‌డం ఎందుకు? ఇప్ప‌టికైనా మానుకోండి. లేక పోతే తీవ్ర‌ప‌రిణామాలు ఎదుర్కొనాల్సి ఉంటుంది” అని బాల‌య్య వార్నింగ్ ఇచ్చారు. మ‌రి దీని ప్ర‌భావ‌మో ఏమో.. తెలియ‌దు కానీ.. సీఎం జ‌గ‌న్ రియాక్ట్ అయ్యారు. నిత్యం తాను తిట్టిపోసే ఓ పత్రిక ఫొటో జ‌ర్న‌లిస్టుపై జ‌రిగిన దాడిని సీరియ‌స్‌గా తీసుకుని.. వెంట‌నే నిందితుల‌పై చ‌ర్య‌ల‌కు ఆదేశించారు. దీంతో ఈ ప‌రిణామం ఆస‌క్తిగా మారింది.

ఏం జ‌రిగింది?

ఆదివారం సాయంత్రం అనంత‌పురం జిల్లా రాప్తాడులో వైసీపీ అధినేత జ‌గ‌న్ నిర్వ‌హించిన సిద్ధం-3వ స‌భ‌లో ఓ దిన‌ప‌త్రిక‌కు చెందిన ఫొటో జ‌ర్న‌లిస్టుపై దాడి జ‌రిగింది. ఈ దాడిలో స‌ద‌రు ఫొటో జ‌ర్న‌లిస్టు తీవ్రంగా గాయ‌ప‌డి.. ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. ఈయ‌నకు అన్ని వ‌ర్గాల నుంచి మ‌ద్ద‌తు పెరుగుతోంది. అదేస‌మయంలో వైసీపీ ప్ర‌భుత్వంపైనా, నాయ‌కుల‌పైనా విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. సోమ‌వారం ఉద‌యం నుంచి రాత్రి వ‌ర‌కు కూడా జ‌ర్న‌లిస్టుకు సంఘీభావం తెలుపుతూ.. అనేక మంది ప్ర‌క‌ట‌న‌లు జారీ చేశారు. అయితే.. ప్ర‌భుత్వం వైపు నుంచి పెద్ద‌గా స్పందన రాలేదు.

బాల‌య్య వార్నింగ్‌..

జ‌ర్న‌లిస్టుపై జ‌రిగిన‌ ఘ‌ట‌న‌పై బాల‌య్య స్పందించారు. వైసీపీ ప్ర‌భుత్వాన్ని హెచ్చ‌రించారు. విధుల్లో ఉన్న జ‌ర్న‌లిస్టుల‌పై వైసీపీ నాయ‌కులు.. దాడి చేయ‌డం హేయ‌మైన చ‌ర్య‌గా ఆయ‌న పేర్కొన్నారు. “రాష్ట్రంలో జ‌ర్న‌లిస్టుల‌పై దాడులు పెరుగుతున్నాయి. జర్నలిస్టులకు రక్షణ కరువైంది. జర్నలిస్టుల రక్షణ కోసం కఠిన చట్టాలు తేవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రశ్నించే గొంతు నొక్కాలనుకోవడం హర్షించదగిన విషయం కాదు. ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపే రోజు మరెంతో దూరం లేదు. ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చూసుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం” అని బాల‌య్య వార్నింగ్ ఇచ్చారు.

జ‌గ‌న్ రెస్పాండ్‌..

బాల‌య్య సోష‌ల్ మీడియాలో ప్ర‌భుత్వానికి వార్నింగ్ ఇచ్చిన త‌ర్వాత సీన్ మారిపోయింది. వెను వెంట‌నే సీఎం జ‌గ‌న్ అనంత‌పురం జిల్లా ఎస్పీ అన్బురాజ‌న్‌తో ఫోన్‌లో మాట్లాడారు. “ఇలాంటి ఘ‌ట‌న జ‌రుగుతుంద‌ని మీకు ముందే తెలుసా? తెలిసినా.. చేతులు ముడుచుకుని కూర్చున్నారా?” అని సీఎం జ‌గ‌న్ ప్ర‌శ్నించారు. అదేవిధంగా ఈ ఘ‌ట‌న‌లో బాధ్యులు ఎలాంటి వారైనా..చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆయ‌న ఆదేశించారు. ఈ ఆదేశాలు అందిన వెంట‌నే ఎస్పీ మీడియా ముందుకు వ‌చ్చారు. ఘ‌ట‌న‌లో బాధ్యులైన వారిని గుర్తించిన‌ట్టు చెప్పారు. ఇందులో పోలీసుల నిర్లక్ష్యం ఉందన్న ఆరోపణల మీద అద‌న‌పు ఎస్పీ స్థాయి అధికారులతో విచారణకు ఆదేశించిన‌ట్టు చెప్పారు. ఈ విష‌యంపై సీఎం జ‌గ‌న్ కూడా సీరియ‌స్‌గా ఉన్నార‌ని. తెలిపారు. మొత్తానికి ఈ ఘ‌ట‌న‌తో అంటే.. బాల‌య్య వార్నింగ్‌.. జ‌గ‌న్ రియాక్ష‌న్‌తో బాధిత జ‌ర్న‌లిస్టుకు న్యాయం జ‌ర‌గ‌డం.. ఆస‌క్తిగా మారింది.

This post was last modified on February 19, 2024 10:41 pm

Share

Recent Posts

వినాయక చవితి పూజా విధానం 2026

వినాయక చవితి సందర్భంగా ప్రతి ఇంట్లో భక్తిశ్రద్ధలతో గణపతి పూజ నిర్వహిస్తారు. పూజకు కావాల్సిన సామగ్రి సిద్ధం చేసుకుని, వినాయకుడిని…

12 minutes ago

సుమంత్ అదే దారిలో వెళ్తే ఎలా

హీరోలన్నాక అన్ని రకాల జానర్లు ట్రై చేయాలి. ఏదో ట్రెండ్ నడుస్తోంది కదాని ఒకదానికే కట్టుబడితే సానుకూల ఫలితాలు రావు.…

2 hours ago

మండాడి మెరుపు దాడి ఎవరు ఊహించారు

త్రివిక్రమ్ అన్నట్టు కొన్ని అద్భుతాలు ఎవరూ ఊహించరు, అవి జరిగినప్పుడు చూస్తూ ఉండిపోవాలంతే. దానికి గొప్ప ఉదాహరణగా బాలీవుడ్ 'హనుమాన్…

3 hours ago

త్రినాథుడి బ్యాటింగ్ ఆపే టైమొచ్చింది

పాతిక రోజులకు చేరుకున్నా బాక్సాఫీస్ వద్ద దూకుడు కొనసాగిస్తూనే ఉన్న ఇరుముడి ఎట్టకేలకు థియేటర్ రన్ ముగింపుకి వచ్చినట్టే. నెట్…

4 hours ago

టాలీవుడ్‌లో ఇలాంటి కలయికలు అసాధ్యమా

నిన్న లండన్ సిల్వర్ స్టోన్ పార్క్ లో జరిగిన కార్ రేసింగ్ లో అజిత్ కు మద్దతు ఇచ్చేందుకు తమిళనాడు…

5 hours ago

హిందూపురం ఇలాకాలో… బాల‌య్యదే హ‌వా!

శ్రీ సత్యసాయి జిల్లాలోని హిందూపురం నియోజకవర్గంలో స్థానిక సంస్థల రాజకీయం ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ చుట్టూనే తిరుగుతోంది. ఆయ‌న అనుకూల…

5 hours ago