టీడీపీ-జనసేన పార్టీలు పొత్తు పెట్టుకుని వచ్చే ఎన్నికల్లో పోటీకి రెడీ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇరు పార్టీల్లోనూ కలవర పరుస్తున్న ఏకైక విషయం.. క్షేత్రస్థాయిలో ఈ నాలుగేళ్ల కాలంలో పార్టీని ముందుకు నడిపించిన నాయకులు.. టికెట్లు కోరుతుండడం.. ఆమేరకు పార్టీలకు టికెట్లు దక్కే ఛాన్స్ లేకపోవడం. దీంతో రెండు పార్టీలు కూడా.. కార్యకర్తలను బుజ్జగించే పనిచేపట్టాయి. గత కొన్ని రోజులుగా టీడీపీ అధినేత చంద్రబాబు.. పార్టీ యువ నాయకుడు నారా లోకేష్ ఇద్దరూ కూడా కార్యకర్తలు మరింత ఉత్సాహంతో పనిచేయాలని.. పార్టీ అధికారంలోకి వచ్చాక.. నామినేటెడ్ పదవులు ఇస్తామని చెబుతున్నా రు.
అంతేకాదు.. టికెట్లు రాలేదని.. గుస్సాగా ఉండొద్దని, వ్యతిరేక ప్రచారం చేయొద్దని కూడా కుండబద్దలు కొడుతున్నారు. ఇక, నారా లోకేష్ మరో అడుగు ముందుకు వేసి.. తాను అంతా గమనిస్తున్నానన్నారు. పార్టీలో ఎవరు కష్టపడుతున్నారో తనకు తెలుసునని.. ఆ మేరకు వారికి న్యాయం జరుగుతుందని కూడా చెప్పారు. ఇక, ఇప్పుడు జనసేన వంతు వచ్చింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా పార్టీ కార్యకర్తలను బుజ్జగించే పనిని ప్రారంభించారు. ప్రస్తుతం విశాఖలో పర్యటిస్తున్న పవన్.. పార్టీ కార్యకర్లతో భేటీ అయ్యారు. టికెట్ల కోసం.. చాలా మంది మీలో ఎదురు చూస్తున్నారు. ఆ విషయం నాకు తెలుసు. కానీ.. కొన్ని కొన్ని సందర్భాలు సంక్లిష్టంగా ఉంటాయి. మీరు అర్ధం చేసుకోవాలి
అని వ్యాఖ్యానించారు.
పార్టీ కోసం పనిచేసిన వారికి సముచిత స్థానం కల్పించే బాధ్యత తాను తీసుకుంటానని పవన్ కళ్యాణ్ తెలిపారు. 2019 తర్వాత పార్టీకి అండగా నిలిచిన వాళ్లకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, టికెట్లు కూడా వారికిఇచ్చే అవకాశాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. అయితే.. ఇప్పుడు వచ్చే టిక్కెట్ల కన్నా.. భవిష్యత్తులో మరిన్ని పదవులు రాబోతున్నాయని చెప్పారు. గతంలో ప్రజారాజ్యంలో ఉన్న చిన్న పరిచయంతో ఓ నేతకు టీడీపీలో రెండు సార్లు కీలక పదవి వచ్చేలా చేశానని.. అలాంటిది పార్టీ కోసం కష్టపడే వారిని వదిలేయబోనని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
ప్రతి ఒక్కరూ మరింత బాధ్యతగా పనిచేయాలని ఈ సందర్భంగా పవన్ సూచించారు. పని చేసిన వారి పేర్లు తన దగ్గర ఉన్నాయని.. ప్రతి ఒక్కరినీ కడుపులో పెట్టుకుని కాపాడుకుంటామని.. అన్నారు. క్షేత్రస్థాయిలో మీరు కూడా పదవులు కోరుకుంటారు. ఇది తప్పేంకాదు. కానీ, రాష్ట్రంలో కొన్ని రాజకీయ పరిణామాలు మారాయి. అందుకే మనం ప్రస్తుతానికి పదవులపై కాకుండా.. పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేలా వైసీపీని గద్దె దింపేలా పనిచేయాలి. తర్వాత.. పదవులు వాతంటత అవే వస్తాయి. మీరు ఆ విషయాన్ని నాకు వదిలేయండి
అని వ్యాఖ్యానించారు.
This post was last modified on February 19, 2024 10:00 pm
వైసీపీ కీలక నేత, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి ఓ రేంజిలో న్యాయ పోరాటం చేస్తున్నారు. తిరుపతి…
వైసీపీ అధినేత జగన్ వ్యవహార శైలి కేవలం ప్రధాన ప్రతిపక్షం కోసమే ఆరాటపడుతున్నట్టు కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం ఆయనకు…
ఏపీలో రిలీజ్ సినిమాల ప్రదర్శనలపై కూటమి సర్కారు సరికొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇప్పటిదాకా రిలీజ్ అయ్యే దాదాపుగా అన్ని…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏది చేసినా చాలా వెరైటీగా ఉంటుంది. ఇతర రాజకీయ నాయకులతో…
https://www.youtube.com/watch?v=V0ARlFc_ndE సంక్రాంతి పందెం కోళ్ళలో మొదటిది గేమ్ ఛేంజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. తుది తీర్పు ఏంటనేది తేలడానికి ఇంకొంచెం…
బ్రాండ్ ఏపీ ప్రారంభమైందని సీఎం చంద్రబాబు తెలిపారు. వైసీపీ విధ్వంసంతో అతలాకుతలమైన రాష్ట్రాన్ని అన్ని విధాలా బాగు చేస్తున్నామని చెప్పారు.…