Political News

మాకు 160, మిగతా 15 సీట్ల‌ కోస‌మే కొట్టుకుంటున్నారు – KA పాల్

ప్ర‌జాశాంతి పార్టీ అధ్య‌క్షుడు, పొలిటిక‌ల్ క‌మెడియ‌న్ అని ప్ర‌తిప‌క్ష పార్టీలు, ఇతర నాయ‌కులు పిలుచుకునే కిలారి ఆనంద పాల్ తాజాగా ఏపీ రాజ‌కీయ నేత‌ల‌కు స‌వాల్ రువ్వారు. అది కూడా ఆయ‌న రెండు ప్ర‌ధాన పార్టీల అధ్య‌క్షుల‌కు స‌వాల్ రువ్వ‌డం గ‌మ‌నార్హం. “విజ‌య‌వాడ‌లో పేద్ద అంబేద్కర్ విగ్రహం పెట్టారు క‌దా.. ఆ విగ్ర‌హం సాక్షిగా నాతో చర్చలకు రావాలి“ అని టీడీపీ అధినేత చంద్రబాబు, సీఎం జగన్‌కి సవాల్ విసిరారు. విగ్రహాలు చూసి దళితులు మోసపోరని తేల్చి చెప్పారు. టీడీపీ, జనసేన, వైసీపీని వీడి బయటకు రావాలని బడుగు, బలహీన వర్గాల వారికి విజ్ఞప్తి చేశారు. ఆ మూడు పార్టీలు బీజీపీకి తొత్తులని ఆరోపించారు.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌జాశాంతి పార్టీ 160 స్థానాల్లో విజ‌యం ద‌క్కించుకుంటుంద‌ని పాల్ చెప్పారు. మిగిలిన 15 సీట్ల  కోస‌మే వైసీపీ, టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ కొట్టుకుంటున్నాయ‌ని త‌న‌దైన శైలిలో పాల్ అన్నారు. త‌మ పార్టీకి160 సీట్లు ఇచ్చేందుకు ప్ర‌జ‌లురెడీగా ఉన్నార‌ని చెప్పారు. “ఇది ప‌క్కా. దీనిపై నేను ఎవ‌రితోనైనా చ‌ర్చించేందుకు రెడీ. చంద్ర‌బాబు, జ‌గ‌న్‌, ఎవ‌రు వ‌చ్చినా సిద్ధం“ అని పిడికిలి బిగించి మ‌రీ చెప్పారు. ఇక‌, వ‌చ్చే పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో తాను వైజాగ్ నుంచి ఎంపీగా పోటీ చేస్తానని.. తనతో కలిసి నడవాలని.. వేలకోట్లు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని త‌న‌దైన వ్యాఖ్య‌లు చేశారు.

విగ్ర‌హాలు ఎవ‌రి కొర‌కు!

“అంబేడ్క‌ర్ విగ్ర‌హాలు పెడుతున్నారు. అవి ఎవ‌రి కొర‌కు? ఎస్సీ ఎస్టీల‌కు మేలు చేయాలంటే.. ముందుగా వారికి అన్ని ప‌థ‌కాలు స‌మ‌గ్రంగా అంద‌జేయాలి. విద్య‌ను విస్త‌రించాలి. అవి వ‌దిలేసి విగ్ర‌హాలు పెడ‌తామంటే.. ఎలా?  ఎందుకు? అంబేడ్క‌ర్ ఏమ‌న్నా.. జ‌గ‌న్ క‌ల్లోకి వ‌చ్చి అడిగారా?  ఆయ‌న విగ్ర‌హాలుపెట్ట‌మ‌ని చెప్పారా?“ అని కేఏ పాల్ విమ‌ర్శ‌లు గుప్పించారు. అంబేడ్క‌ర్ రాజ్యాధికారం కావాలని అడిగాడు కానీ, విగ్రహాలు పెట్టమని అడిగాడా? అని కేఏ పాల్ ప్రశ్నించారు. తాను ఏ మతాన్ని, కులాన్ని విమర్శించనని చెప్పారు.

ప‌వ‌న్‌కు ఓట్లు లేవు

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు ఏపీలో ఓటు బ్యాంకు లేద‌ని పాల్ అన్నారు. “పవన్ కళ్యాణ్‌కి ఓట్లు లేవు కాబట్టి అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకుంటున్నాడు. ఆయ‌న పార్టీపై ఆయ‌న‌కే న‌మ్మ‌డం లేదు. కాపు సోద‌రులు అంద‌రూ నాతోనే ఉన్నారు. ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం గారు వ‌స్తానంటే.. ఇప్పుడే పార్టీలో చేర్చుకుంటే. అలాంటి వారు వ‌చ్చేయాలి.“ అని కేఏ పాల్ అన్నారు.  జగన్ చొక్కాలు మడత పెట్టాలని అంటున్నాడని, చంద్రబాబు ఏమో కుర్చీలు మ‌డ‌త పెడ‌తామ‌ని చెబుతున్నార‌ని.. ఇద్ద‌రినీ క‌లిసి ప్ర‌జ‌లు వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు మ‌డ‌త పెట్టేందుకు సిద్ధంగా ఉన్నార‌ని పాల్ వ్యాఖ్యానించారు.

This post was last modified on February 20, 2024 10:02 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ధనుష్ మీద భగ్గుమన్న నయనతార

కోలీవుడ్ టాప్ హీరోయిన్ నయనతారకు కోపం వచ్చింది. హీరో ధనుష్ మీద తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ మూడు పేజీల…

3 hours ago

అకీరా సంగీతానికి తమన్ గైడెన్స్

పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న అకీరానందన్ తెరంగేట్రం కన్నా ముందు అతని సంగీతం వినే అవకాశం దక్కేలా…

5 hours ago

రీల్స్ చేసే వారికి రైల్వే శాఖ లేటెస్టు వార్నింగ్..

రీల్స్ చేయటం ఇవాల్టి రోజున కామన్ గా మారింది. చిన్నా.. పెద్దా అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరు తమకున్న…

5 hours ago

వీరమల్లుని నిలబెట్టే 7 ఎపిసోడ్లు

అభిమానుల దృష్టి ఓజి మీద విపరీతంగా ఉండటం వల్ల హైప్ విషయంలో హరిహర వీరమల్లు కొంచెం వెనుకబడినట్టు అనిపిస్తోంది కానీ…

5 hours ago

మెగా సపోర్ట్ ఏమైనట్లు?

టాలీవుడ్లో మెగా హీరోలకు ఉన్న ఫ్యాన్ సపోర్ట్ ఇంకెవరికీ ఉండదనే అభిప్రాయాలున్నాయి. ముందు తరంలో ముందు మెగాస్టార్ చిరంజీవి, ఆ…

12 hours ago

వివేకా కేసులో స్పీడు పెంచిన సునీత

ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…

17 hours ago