తమిళనాట సినిమాలకు, రాజకీయాలకు విడదీయరాని బంధం ఉంది. ఆ రాష్ట్రంలో అత్యధిక కాలం ముఖ్యమంత్రులుగా ఉన్నది సినిమా వాళ్లే. ఐతే జయలలిత, కరుణానిధి ఒకరి తర్వాత ఒకరు కాలం చేశాక తమిళనాట ఒక రాజకీయ శూన్యత నెలకొనగా దాన్ని భర్తీ చేయడానికి లోకనాయకుడు కమల్ హాసన్ భర్తీ చేయడానికి చేసిన ప్రయత్నం దారుణంగా బెడిసికొట్టింది. ఎన్నో ఆదర్శాలతో ఆయన మొదలుపెట్టిన మక్కల్ నీది మయం పార్టీ తొలిసారి గత పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ పడింది. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అదృష్టాన్ని పరీక్షించుకుంది. కానీ రెండుసార్లూ దారుణమైన ఫలితాలే వచ్చాయి. కమల్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో కనీస ప్రభావం కూడా చూపకపోవడంతో ఆయన పార్టీ ఇన్‌యాక్టివ్ అయిపోయింది.
ఎన్నికలు అయిన వెంటనే ఆయన కొత్త ముఖ్యమంత్రి స్టాలిన్‌ను కలవడం.. ఆయన తనయుడైన నటుడు, నిర్మాత ఉదయనిధి స్టాలిన్‌తో ఎంతో సన్నిహితంగా మెలగడం, కలిసి సినిమాలు కూడా నిర్మించడంతో ఇక ఆయన రాజకీయాల్లో ఏం ఎదుగుతారు అనే ప్రశ్నలు రేకెత్తాయి. కమల్ ఇక రాజకీయాలకు దూరమైనట్లే అని భావించారు. అప్పుడప్పుడూ మొక్కుబడిగా పార్టీ కార్యక్రమాలేవో చేస్తున్నారు కానీ.. మక్కల్ నీదిమయం ప్రభావం అయితే అంతగా ఉన్నట్లు కనిపించడం లేదు. ఇలాంటి తరుణంలో కమల్ మళ్లీ రాజకీయాల మీద దృష్టిసారించడం ఆసక్తి రేకెత్తిస్తోంది.
ఇంకో రెండు నెలల్లో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో మక్కల్ నీదిమయంను పోటీలో నిలపబోతున్నారట కమల్. అధికార డీఎంకేతో ఆయన పార్టీ పొత్తు పెట్టుకోనుందట. కొంతమంది అభ్యర్థులను బరిలోకి దించుతారట. దీని గురించి పరోక్షంగా ఒక ప్రకటన కూడా చేశారు కమల్. ఇంకో రెండు రోజుల్లో శుభవార్త బయటికి వస్తుందని ఆయన అన్నారు. మరి ఎన్నికల్లో ఆయన పార్టీ తరఫున వేరే అభ్యర్థులు మాత్రమే బరిలో ఉంటారా.. కమల్ కూడా పోటీలో నిలుస్తారా అన్నది ఆసక్తికరం.
This post was last modified on February 19, 2024 1:32 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…