తెలుగుదేశం పార్టీ ఏర్పాటైనప్పటి నుండి ఇప్పటివరకు గెలవని నియోజకవర్గాలు 42 ఉన్నాయి. ఇందుకు అనేక కారణాలున్నాయి. పొత్తుల్లో మిత్రపక్షాలకు సీట్లు కేటాయించటేయటం, ప్రతి ఎన్నికకు ఒక అభ్యర్ధిని పోటీకి దింపటం లాంటి అనేక కారణాల వల్ల టీడీపీ జెండా ఎగరలేదనే చెప్పాలి. ఇలాంటి నియోజకవర్గాల్లో గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలోని మాచర్ల కూడా ఒకటి. మాచర్ల నియోజకవర్గంలో నాలుగు ఎన్నికల్లో వరుసగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డే గెలుస్తున్నారు. ఇందులో రెండుసార్లు కాంగ్రెస్ నుండి చివరి రెండు ఎన్నికల్లో వైసీపీ నుండి గెలిచారు.
తొందరలో జరగబోయే ఎన్నికల్లో ఐదోసారి గెలిచేందుకు సిద్ధమవుతున్నారు. ఇదే సమయంలో చివరి ఐదు ఎన్నికల్లో మాచెర్లలో టీడీపీ తరపున ఐదుగురు అభ్యర్ధులు పోటీచేశారు. 2004లో జూలకంటి బ్రహానందరెడ్డి, 2009లో జూలకంటి బ్రహ్మారెడ్డి, 2012 ఉపఎన్నికలో చిరుమామిళ్ళ మధుబాబు, 2014లో కొమ్మారెడ్డి చలమారెడ్డి, 2019లో అన్నపురెడ్డి అంజిరెడ్డి పోటీచేశారు. చంద్రబాబులో పెద్ద మైనస్ ఏమిటంటే ఒక ఎన్నికలో ఓడిపోగానే తర్వాత ఎన్నికకు అభ్యర్ధిని మార్చేస్తారు. చంద్రబాబు అలవాటే చాలా నియోజకవర్గాల్లో టీడీపీకి సమస్యగా తయారైంది.
టీడీపీ తరపున పోటీచేసి ఓడిపోయిన జూలకంటి బ్రహ్మారెడ్డినే రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు పోటీచేయించబోతున్నారు. పిన్నెల్లిని ధీటుగా ఎదుర్కోగలిగిన నేత బ్రహ్మారెడ్డి మాత్రమే అని చంద్రబాబు గుర్తించారు. నియోజకవర్గానికి ఇన్చార్జి అయినప్పటినుండి బ్రహ్మారెడ్డి కూడా చాలా యాక్టివగ్ నే పనిచేస్తున్నారు. ఏ చిన్న అవకాశం వచ్చినా అధికారపార్టీని ఢీకొట్టే రీతిలో రాజకీయం చేస్తున్నారు. కాబట్టి ద్వితీయశ్రేణి నేతలు, క్యాడర్లో బ్రహ్మారెడ్డిపైన నమ్మకం కుదిరినట్లుంది. అందుకనే చాలామంది ఇన్చార్జికి మద్దతుగా నిలబడుతున్నారు.
రెండుపార్టీల మధ్య దాడులు, ప్రతిదాడులతో నియోజకర్గంలో ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవరు చెప్పలేని పరిస్ధితి కనబడుతోంది. పిన్నెల్లికి పార్టీతో పాటు నియోజకవర్గంలో కూడా అపరామైన పట్టుంది. వరుసగా నాలుగుసార్లు గెలుస్తున్న కారణంగా వ్యతిరేకత కూడా ఎంతో కొంత ఉంటుందనటంలో సందేహంలేదు. జనసేన మద్దతుతో బ్రహ్మారెడ్డి, అధికార అండదండలతో పిన్నెల్లి రాబోయే ఎన్నికలను ఎదుర్కోవటానికి రెడీగా ఉన్నారు. ఇద్దరిలో ఏ విషయంలోను ఎవరు తక్కువ కాదు కాబట్టి గెలుపు ఎవరిదో చూడాలి. బ్రహ్మారెడ్డి గెలిస్తే మాచెర్లలో టీడీపీ చరిత్రను తిరగరాసినట్లే అవుతుంది.
This post was last modified on February 19, 2024 11:16 am
ఇటీవలే నెట్ ఫ్లిక్స్ లో వచ్చాక దేవర 2 ఉంటుందా లేదా అనే దాని గురించి డిస్కషన్లు ఎక్కువయ్యాయి. డిజిటల్…
ఏపీ సీఎం చంద్రబాబు తన మంత్రులను డిజప్పాయింట్ చేసేశారు. అదేంటి అనుకుంటున్నారా? ఇక్కడే ఉంది వ్యూహం. తాజాగా అసెంబ్లీలో ప్రవేశ…
ఒకప్పుడు థియేటర్లో సినిమా చూస్తూ దోమలు కుడుతున్నా, తెరమీద బొమ్మ మసకమసకగా కనిపించినా ప్రేక్షకులు సర్దుకుపోయేవాళ్లు. ఇష్టమైన యాక్టర్ల నటన…
టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ తో వైఎస్ షర్మిల సంబంధం ఉందని సోషల్ మీడియాలో చాలాకాలంగా దుష్ప్రచారం జరుగుతోన్న సంగతి…
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసన మండలిలో వైసీపీ, కూటమి పార్టీల సభ్యుల మధ్య వాడీ వేడీ వాదనలు జరుగుతున్న…
టాలీవుడ్ లో నాగ చైతన్య, శోభితా ధూళిపాళ్లల పెళ్లి విషయం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. సమంతతో…