ఎదుటి వారిని తొక్కేసి ఎదగడం ఒకటైపు రాజకీయం. ఎదుటి వారి మనుసు కూడా దోచుకుని ప్రజల్ని గెలుస్తూ ఎదగడం మరోటైపు రాజకీయం. రేవంత్ రెండో టైపులా కనిపిస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు. తాజాగా ఆయన చేసిన ఒక కామెంట్ అందరికీ తెగ నచ్చేసింది. చివరకు టీఆర్ఎస్ వారి మనసును దోచిందంటే మీరే అర్థం చేసుకోవచ్చు రేవంత్ రాజకీయం ఏంటో.
రాజకీయాల్లో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్ ఉంటుంది. కేసీఆర్ ది అందరికీ దూరంగా ఉండే స్టైల్, రేవంత్ ది అందరికీ దగ్గరగా ఉండే స్టైల్. అందుకే ఎవరు దేనికి పిలిచినా వెళ్తారు. తాజాగా క్రెడాయ్ వాళ్లు అగ్నిమాపకదళం కోసం నిర్మించిన బిల్డింగు ప్రారంభోత్సవానికి వెళ్లిన ఆయన అక్కడ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్ మహానగరం అభివృద్ధి చేయడంలో గతంలో ముఖ్యమంత్రులుగా పని చేసిన వారంతా ఎంతో కష్టపడ్డారని… ఎటువంటి పక్షపాతం లేకుండా హైదరాబాదును డెవలప్ చేశారని… కామెంట్ చేశారు. రేవంత్ మాటల్లో చెప్పాలంటే… గతంలో ఈ ప్రాంతానికి ముఖ్యమంత్రులుగా పని చేసిన చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి, కేసీఆర్ ల రాజకీయం.. ఆలోచన విధానం ఎలా ఉన్నా.. హైదరాబాద్ విషయంలో మాత్రం వారు అంతకు ముందున్న ప్రభుత్వాల అభివ్రుద్దిని కొనసాగించారు. ఇదే సంప్రదాయాన్ని ఇక ముందు కూడా కొనసాగుతుంది. ముగ్గురు ముఖ్యమంత్రులు చేసిన మంచి పనులను మరింత వేగంగా కొనసాగిస్తాను. హైదరాబాదు మహానగరాన్ని మరింతగా అభివ్రుద్ధి చేస్తాను‘ అని రేవంత్ రెడ్డి అన్నారు.
గత ముఖ్యమంత్రుల్ని ఉద్దేశించి ఆయన చేసిన కామెంట్లు అందరినీ ఆకట్టుకున్నాయి.
ఇటీవలే బీఆర్ఎస్ అధి నేత కేసీఆర్ అసెంబ్లీకి హాజరు కానప్పటికీ.. ఆయన పుట్టిన రోజున అసెంబ్లీలో ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పడం ద్వారా గులాబీ నేతల మనసుల్ని దోచారు రేవంత్. కొత్త సంప్రదాయాన్ని మొదలుపెట్టారు. రేవంత్ ఇలా చేస్తారని ఎవరూ ఊహించలేదు. తాజా కామెంట్లు బీఆర్ఎస్ కు రెండో సర్ ప్రైజ్. తిట్టేటప్పుడు తిడుతూ… అభినందనలు చెప్పాల్సిన వచ్చినపుడు అభినందించడం ద్వారా అతను రాజనీతిని ప్రదర్శిస్తున్నారన్న పేరు తెచ్చుకుంటున్నారు రేవంత్.
This post was last modified on February 19, 2024 11:18 am
పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న అకీరానందన్ తెరంగేట్రం కన్నా ముందు అతని సంగీతం వినే అవకాశం దక్కేలా…
రీల్స్ చేయటం ఇవాల్టి రోజున కామన్ గా మారింది. చిన్నా.. పెద్దా అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరు తమకున్న…
అభిమానుల దృష్టి ఓజి మీద విపరీతంగా ఉండటం వల్ల హైప్ విషయంలో హరిహర వీరమల్లు కొంచెం వెనుకబడినట్టు అనిపిస్తోంది కానీ…
టాలీవుడ్లో మెగా హీరోలకు ఉన్న ఫ్యాన్ సపోర్ట్ ఇంకెవరికీ ఉండదనే అభిప్రాయాలున్నాయి. ముందు తరంలో ముందు మెగాస్టార్ చిరంజీవి, ఆ…
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…