చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లుగా ఉంది నాగబాబు వ్యవహారం. డ్యామేజి జరిగిపోయిన తర్వాత జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు కంట్రోల్ కు దిగారు. ఇంతకీ విషయం ఏమిటంటే నాలుగు రోజులుగా నాగబాబు ఉత్తరాంధ్రలోనే మకాంవేశారు. అదికూడా అనకాపల్లి పార్లమెంటు పరిధిలోని నియోజకవర్గాల్లోనే పర్యటిస్తున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల్లోని నేతలతో పర్యటిస్తున్న నాగబాబు సమీక్షలు కూడా చేస్తున్నారు. అయితే సీనియర్ నేత, మొదటినుండి పార్టీ జెండాను మోస్తున్న శివశంకర్ ను మాత్రం పట్టించుకోలేదు.
రాబోయే ఎన్నికల్లో పెందుర్తి నుండి పోటీ చేయాలని శివశంకర్ చాలాకాలంగా ప్రయత్నిస్తున్నారు. అయితే వైసీపీ నుండి వచ్చిన పంచకర్ల రమేష్ కు టికెట్ ను పార్టీ అధినేత పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారట. అందుకనే శివశంకర్ ను పార్టీ నాయకత్వం పట్టించుకోవటంలేదు. మరి దీని ప్రభావం రాబోయే ఎన్నికల్లో ఎలాగ ఉంటుందో చూడాలి. ఇదే పద్దతిలో అనకాపల్లికి చెందిన కొణతాల రామకృష్ణను కూడా ఎవరు పట్టించుకోవటంలేదు. ఈమధ్యనే పవన్ పిలుపు మేరకు కొణతాల పార్టీలో చేరిన విషయం తెలిసిందే.
రాబోయే ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంటు టికెట్ హామీతోనే కొణతాల జనసేనలో చేరారనే ప్రచారం అందరికీ తెలిసిందే. పార్టీలో చేరేంతవరకు కొణతాలపై బాగా ఇంట్రస్టుచూపించిన నాయకత్వం ఇపుడు పట్టించుకోవటంలేదు. కొద్దిరోజులుగా అనకాపల్లిలోనే క్యాంపు వేసిన నాగబాబు మాజీ ఎంపీ కొణతాలను కనీసం కలవను కూడా కలవలేదు. సమావేశాలకు, సమీక్షలకు కూడా పిలవలేదు. దాంతో నాగబాబు వ్యవహారంపై పార్టీలో బాగా అసంతృప్తి పెరిగిపోయింది. రాబోయే ఎన్నికల్లో దీని ప్రభావం పార్టీ గెలుపుపై పడుతుందని అనుకున్నట్లున్నారు. అందుకనే సడెన్ గా కొణాతల ఇంటికి నాగబాబు వెళ్ళారు.
ఇంతకీ కొణతాలను జనసేన ఎందుకు పట్టించుకోవటంలేదు ? ఎందుకంటే అనకాపల్లి ఎంపీగా నాగబాబే పోటీచేయబోతున్నారనే ప్రచారం తెలిసిందే. ఒకవైపు నాగబాబే పోటీచేస్తున్నారని అనుకుంటున్నపుడు ఇక ఎంపీ టికెట్ ను ఆశిస్తున్న కొణతాలను ఎవరు పట్టించుకుంటారు ? మరిదే నిజమైతే అసలు కొణతాలను పార్టీలో పవన్ ఎందుకు చేర్చుకున్నట్లు ? అనే ప్రశ్నకు సమాధానం లేదు. ఏదేమైనా శివశంకర్, కొణతాల విషయంలో పార్టీకి జరిగిన డ్యామేజి కంట్రోల్ అవుతుందా ? అన్నదే అసలైన పాయింట్.
నాలుగు రోజులుగా నాగబాబు ఉత్తరాంధ్రలోనే మకాంవేశారు. అదికూడా అనకాపల్లి పార్లమెంటు పరిధిలోని నియోజకవర్గాల్లోనే పర్యటిస్తున్నారు.
This post was last modified on February 18, 2024 2:50 pm
ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ దురంధర్ అంచనాలకు మించి ఆడేస్తోంది. మరీ జవాన్, పఠాన్ రేంజులో కాదు కానీ రణ్వీర్…
గత వారం రావాల్సిన అఖండ-2.. నిర్మాతలకు, ఈరోస్ సంస్థకు మధ్య ఉన్న పాత ఫైనాన్స్ వివాదం కోర్టుకు చేరడంతో అనూహ్యంగా…
కటక్లో జరిగిన టీ20 మ్యాచ్లో టీమిండియా 101 పరుగుల భారీ విజయం సాధించినా, సోషల్ మీడియాలో మాత్రం కెప్టెన్ సూర్యకుమార్…
అక్కినేని నాగార్జున ప్రస్తుతం 67వ పడిలో ఉన్నారు. ఆయన ఎవరో తెలియని వాళ్లకు ఆయన్ని చూపించి తన వయసెంత అంటే 40-45 మధ్య చెబుతారేమో. నిజానికి ఆ…
ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రాన్ని త్వరలోనే జోన్లు, రీజియన్లు, కారిడార్లు, క్లస్టర్లు, హబ్లుగా విభజించుకుని అభివృద్ధి…
బాక్సాఫీస్ పరిణామాలు సస్పెన్స్ థ్రిల్లర్ తరహాలో మలుపులు తిరుగుతున్నాయి. డిసెంబర్ 5 అఖండ 2 వాయిదా పడింది. క్రిస్మస్ కు…