ఏపీ రాజకీయాలకు సంబంధించి ఈ నెలాఖరులో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగానే అనేక రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలతో పొత్తులను ఫైనల్ చేయబోతున్నారట. అందుకనే ఈనెల 20 లేదా 21వ తేదీన బీజేపీ అగ్రనేతలతో ఢిల్లీలో చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ భేటీ అవబోతున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. జాతీయ కార్యవర్గ సమావేశాలకు ఏపీ నుంచి కూడా బీజేపీ నేతలు వెళ్ళారు.
ఈ సందర్భంగానే రాష్ట్రంలో పార్టీ పరిస్ధితి, పొత్తు పెట్టుకుంటే జరిగే లాభాలు, తీసుకోవాల్సిన సీట్లపై చర్చలు జరిగినట్లు సమాచారం. లోకల్ నేతలతో మాట్లాడటం, విడిగా ఇప్పటికే తెప్పించుకున్న రిపోర్టులను సరిచూసుకున్నారట. అందుకనే చంద్రబాబు, పవన్ తో జాయింట్ మీటింగ్ పెట్టుకుని పొత్తులను ఫైనల్ చేయాలని బీజేపీ అగ్రనేతలు డిసైడ్ అయ్యారట. ముందుగా చంద్రబాబు ఎన్డీయేలో చేరితే ఆ తర్వాత పొత్తుల విషయాన్ని మాట్లాడచ్చని అనుకున్నారట. ఎన్డీయేలో చేరితే టీడీపీ పార్టనర్ అవుతుంది. అప్పుడు పొత్తుల విషయంతో పాటు పోటీ చేయబోయే సీట్ల సంఖ్య, నియోజకవర్గాలను ఫైనల్ చేయటానికి వీలుగా ఉంటుందని భావించారట.
అందుకు చంద్రబాబు కూడా సానుకూలంగా స్పందించారట. కాబట్టే బీజేపీ అగ్రనేతలు చంద్రబాబు, పవన్ తో జాయింట్ గా సమావేశం కాబోతున్నారు. బహుశా 20 లేదా 21వ తేదీన ఢిల్లీలో మీటింగ్ జరిగే అవకావముందని పార్టీవర్గాల సమాచారం. ఈమధ్యనే పొత్తులపై చంద్రబాబు ఢిల్లీకి వెళ్ళి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో భేటీ అయిన విషయం తెలిసిందే. వాళ్ళిద్దరి మధ్య చర్చల్లో ఏమి జరిగింది ? ఎవరేమి మాట్లాడారనే విషయంలో క్లారిటీ లేదు.
అయితే రెండు మూడు రోజుల్లో జరగబోయే మీటింగు మాత్రం చాలా కీలకమైనదనే అంటున్నారు. ఎన్డీయేలో జాయిన్ అవటం, పొత్తులపై మాట్లాడుకోవటం, సీట్లసంఖ్య, నియోజకర్గాలను వీలైనంత తొందరగా తేల్చేయాలని అనుకుంటున్నారు. ఈ విషయంలో బీజేపీ కన్నా జనసేన, టీడీపీ పైనే ఎక్కువ ఒత్తిళ్ళు పెరిగిపోతున్నాయి. అయితే ఎంతస్పీడుగా చర్చల ప్రక్రియ మొదలుపెట్టినా పైన చెప్పిన ప్రక్రియ ముగిసేటప్పటికి మార్చి మొదటి వారం అయిపోతుందని అనుకుంటున్నారు. మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.
This post was last modified on February 18, 2024 12:56 pm
నిన్న విడుదలైన గేమ్ ఛేంజర్ యునానిమస్ గా బ్లాక్ బస్టర్ అనిపించుకోనప్పటికీ మిక్స్డ్ టాక్ తోనూ క్రమంగా పుంజుకుంటుందనే నమ్మకంలో…
రాయలసీమ అంటేనే… ఫ్యాక్షన్ గొడవలకు పెట్టింది పేరు. నిత్యం వైరి వర్గాలపై దాడులు చేసుకుంటూ కాలం వెళ్లదీసే ఇక్కడి వారిలో…
నందమూరి నటసింహం బాలకృష్ణ తాజా చిత్రం డాకు మహారాజ్ ఆదివారం ప్రేక్షకుల ముందుకు రానుంది. వరుస హిట్లతో మంచి జోరు…
విజయనగరం జిల్లా భోగాపురం వద్ద నిర్మాణంలో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాజెక్టు మరో కీలక మలుపు తీసుకుంది. గోపాలపురం ఎయిర్పోర్టు…
తిరుమలలో వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనం టోకెన్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనలో ఆరుగురు మృతి చెందగా 40…
2019 ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్ల జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత…