టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అడ్డు వస్తారా? రండి.. తొక్కుకుంటూ పోతా! ఇప్పటి వరకు ఒక ఎత్తు. ఇకనుంచి మరో ఎత్తు. ఏమనుకుంటున్నారో.. ఖబడ్దార్! అని హెచ్చరించారు. కొన్నాళ్లుగా విరామం ప్రకటించిన.. రా.. కదలిరా! సభలను తిరిగి ప్రారంభించిన చంద్రబాబు.. బాపట్ల జిల్లా ఇంకొల్లులో నిర్వహించిన సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
ఎందుకంత కోపం?
టీడీపీ అధినేత చంద్రబాబు అంత కోపగించుకోవడానికి, నిప్పులు చెరగడానికి కారణం.. రా..కదలిరా! సభను మరోసారి పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయడమే. బాపట్లలో నిర్వహిస్తున్న సభకు అనుమతి లేదని.. ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. తొక్కుకుంటూ పోతా! అని వ్యాఖ్యానించారు. ఇది రేపో మాపో పోయే ప్రభుత్వం.. దీనిని కాపాడాలని మీరు చూస్తే.. మీ ఉద్యోగాలు ఊడుతాయి. మేం చట్ట ప్రకారం వెళ్తున్నాం.. అడ్డం వస్తే తొక్కుకుని పోతాం. జగన్‌ను ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఎన్నికలకు ముందే మన గెలుపు ఖాయమైంది అని చంద్రబాబు అన్నారు.
అందరం వైసీపీ బాధితులమే!
రాష్ట్రంలోని అందరూ దాదాపు వైసీపీ బాధితులే ఉన్నారని చంద్రబాబు అన్నారు. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌కు రూ.3 వేల కోట్ల జరిమానా విధించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఏం తప్పు చేశాడు. మీ పార్టలో ఉన్నప్పుడు కూడా ఆయన మైనింగ్ చేశాడు. ఇప్పుడు కూడా చేస్తున్నాడు. కానీ, ఇప్పుడు మీ పార్టీలో లేడని ఆయనపై అన్ని వేల కోట్ల జరిమానా విధిస్తాడా ఈ జగన్ రెడ్డి? అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. తాను సహా జనసేన అదినేత పవన్ కళ్యాణ్ ఇలా.. అందరూ.. వైసీపీ బాధితులమేనని అన్నారు. జగన్ పెట్టే ప్రతి స్కీమ్ వెనుక స్కామ్ ఉంటుందన్నారు. ఇలాంటి దోపిడీ ఎప్పుడూ చూడలేదని అన్నారు.
మళ్లీ వస్తే.. నాలుగో రాజధాని అంటాడు!
జగన్ మరోసారి అధికారంలోకి వస్తే.. నాలుగో రాజధాని కడతానని నమ్మిస్తాడని చంద్రబాబు దుయ్యబట్టారు. రాజకీయాలను కలుషితం చేసిన వ్యక్తి జగన్ అని విమర్శించారు. వైసీపీకి కౌంట్‌డౌన్ మొదలైందని.. మరో 52 రోజుల తర్వాత టీడీపీ-జనసేన ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జగన్‌కు అభ్యర్థులు దొరక్క సందిగ్ధంలో పడ్డాడని ఎద్దేవా చేశారు. వై నాట్ పులివెందుల అనేదే తమ నినాదమని వెల్లడించారు.
This post was last modified on February 17, 2024 9:37 pm
తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు (94) కన్నుమూశారు. అనారోగ్యంతో చెన్నైలోని కావేరి…
సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…
ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…
కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…
ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…
దసరా తర్వాత నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వచ్చిన ది ప్యారడైజ్ సినిమా మిశ్రమ స్పందన…