తెలంగాణ బీజేపీ మాజీ చీఫ్, ఎంపీ బండి సంజయ్ బాంబు పేల్చారు. ఏకంగా ఎనిమిది మంది బీఆఎస్ ఎమ్మెల్యేలు తమకు టచ్‌లో ఉన్నారని ఆయన తెలిపారు. బీఆర్‌ఎస్‌కు ఎంపీ అభ్యర్థులు లేరని, ఉన్న వాళ్లు పక్క చూపులు చూస్తున్నారన్నారు. తమ పార్టీలో చేరేందుకు నాయకులు క్యూ కట్టే సమయం వచ్చిందన్నారు. ఎంపీగా పోటీ చేయమని అభ్యర్థులను కేసీఆర్ బతిమలాడుతున్నారని.. అయినా ఎవరూ ఆయనను పట్టించుకోవడం లేదని వ్యాఖ్యానించారు. కేసీఆర్ అవినీతిని వ్యతిరేకించి హరీష్ రావుతో సహా ఎవరైనా బీజేపీలోకి వస్తామని అంటే ఆహ్వానిస్తామన్నారు.
వారి మధ్య అవగాహన ఉంది..
ప్రతిపక్షం బీఆర్‌ఎస్, అధికార పక్షం కాంగ్రెస్‌కు మధ్య అవగాహన ఒప్పందం జరిగిందని బండి విమర్శించారు. అందుకే బీఆర్‌ఎస్ పాలనకు సంబంధించి ఇన్ని కుంభకోణాలు బయటపడుతున్నప్పటికీ.. కాంగ్రెస్ చర్యలు తీసుకోవట్లేదని మండిపడ్డారు. అదే.. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడి ఉంటే కేటీఆర్, కేసీఆర్ ఇప్పటికే జైలులో ఉండేవాళ్లని వ్యాఖ్యానించారు. ఇదిలావుంటే, కేసీఆర్.. ఎన్డీయేతో జట్టు కడతారని వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. ఎట్టి పరిస్థితుల్లో బీఆర్‌ఎస్‌తో పొత్తు ఉండదని తేల్చి చెప్పారు. ఇదంతా కేసీఆర్ ఆడుతున్న మైండ్ గేమ్‌గా ఆయన పేర్కొన్నారు. అధికారంలో ఉన్నప్పుడే కేసీఆర్‌ను ఎన్డీఏలో చేరుతామనీ అడిగితేనే చేర్చుకోలేదన్నారు.
కాంగ్రెస్ గ్రాఫ్ తగ్గింది!
రాష్ట్రంలో కాంగ్రెస్ గ్రాఫ్ తగ్గిందని బండి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినందుకు ప్రజలు బాధపడుతున్నారన్నారు. కర్ణాటకలోనే కాదు.. తెలంగాణలో సైతం గ్యారంటీల పేరుతో మోసం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్‌కి ఎన్ని సీట్లు వస్తాయనేది ఆ పార్టీ నేతలే చెప్పాలన్నారు. ఇచ్చిన వాగ్దానాలు పూర్తి చేయకుంటే ప్రజలే కాంగ్రెస్‌కి బుద్ది చెప్తారని బండి వెల్లడించారు. రేవంత్ రెడ్డి ఇంతకు ముందు కూడా బీజేపీ, బీఆర్‌ఎస్ ఒకటేనని ఆరోపించారని గుర్తు చేశారు.
రాముడు-మోడీ!
పార్లమెంట్ ఎన్నికల్లో రాముడు-మోడీ ఒక్కవైఫు, రజాకార్లు, ఎంఐఎం, బీఆర్‌ఎస్ ఒక వైపు ఉన్నాయన్నారు. దేవుడిని రాముడిని నమ్మే వాళ్లు బీజేపీకి ఓటేస్తారన్నారు. బీఆర్ఎస్ అవినీతి అంతా కాగ్ రిపోర్ట్ ద్వారా బయట పడిందని బండి సంజయ్ చెప్పారు. హైదరాబాద్ పార్లమెంట్ సీటుపై కూడా దృష్టి పెట్టామని తెలిపారు.
This post was last modified on February 16, 2024 8:15 pm
అత్తారింటికి దారేది సినిమాలో ఎంఎస్ నారాయణ చెప్పినట్టు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే విజేత. దీన్ని సరిగ్గా…
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం మరో రెండు రోజుల్లో ముగియనుంది. ఈ క్రమంలోనే ఓ పక్క మహాయుతి కూటమి..మరో పక్క మహా…
అదేంటి జెనీలియా ఎప్పుడో వివాహ బంధంలో అడుగు పెట్టింది కదాని ఆశ్చర్యపోకండి. మ్యాటర్ తన గురించి కాదు. ఆరంజ్ ఫ్లాష్…
టాలీవుడ్ కే కాదు మొత్తం అన్ని భాషల ప్రేక్షకులు విపరీతంగా ఎదురు చూస్తున్న పుష్ప 2 ది రూల్ కౌంట్…
విశాఖలో 500 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చుపెట్టి రుషికొండ ప్యాలెస్ కట్టిన జగన్ పై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు…
మహారాష్ట్ర డెగ్లూరులో ఎన్డీయే అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆకట్టుకునే ప్రసంగంతో…